Diabetes: డయాబెటిస్ ఉన్న వారు ఖర్జూరాలు డైలీ తినొచ్చా?-can diabetic eat dates daily diabetes diet tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: డయాబెటిస్ ఉన్న వారు ఖర్జూరాలు డైలీ తినొచ్చా?

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు ఖర్జూరాలు డైలీ తినొచ్చా?

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 17, 2024 08:30 AM IST

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు ఖర్జూరాలు తినవచ్చా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఖర్జూరాలు తియ్యగా ఉండడమే దీనికి కారణంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారు రోజులో ఖర్జూరాలు తినొచ్చో ఇక్కడ తెలుసుకోండి.

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు ఖర్జూరాలు డైలీ తినొచ్చా?
Diabetes: డయాబెటిస్ ఉన్న వారు ఖర్జూరాలు డైలీ తినొచ్చా? (freepik)

డయాబెటిస్‍ ఉండే వారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. డయాబెటిస్ కంట్రోల్‍లో ఉండేలా చూసుకుంటూ డైట్ ప్లాన్ చేసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్త పడాలి. ఈ క్రమంలో ఆహారానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు ఖర్జూరాలు తినొచ్చా అనే సందేహం ఉంటుంది. ఎందుకంటే ఖర్జూరాలు తియ్యగా ఉంటాయి. ఇందులో నేచురల్ షుగర్ అయిన ఫ్రక్టోస్ ఉంటుంది.

డయాబెటిస్ ఉన్న వారు తినొచ్చా!

ఖర్జూరాల్లో ఉండే ఫ్రక్టోస్ వల్ల ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయనే భావన ఉంటుంది. అయితే, ఖర్జూరాల్లో గ్లెసెమిక్ ఇండెక్స్, గ్లెసెమిక్ లోడ్ తక్కువగా ఉంటాయి. దీంతో ఇవి తిన్నా రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా పెరగదు. అయితే, డయాబెటిస్ ఉన్న వారు మోతాదు మేరకే ఖర్జూరాలు తీసుకోవాలి. మరీ ఎక్కువగా తినకూడదు.

రోజులో ఎన్ని తినొచ్చు?

డయాబెటిస్ ఉన్న వారు రోజులో 2 నుంచి 3 ఖర్జూరాలు తినవచ్చు. ఈ మోతాదులో తింటే వారి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అంతకు మించి తినకూడదు. అతిగా తింటే ఖర్జూరాల్లోని కార్బ్స్ వల్ల దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే డయాబెటిస్‍తో బాధపడే వారు రోజుకు 2 ఖర్జూరాలు తీసుకోవడం ఉత్తమం.

ఖర్జూరాల ప్రయోజనాలు ఇవే

ఖర్జూరాల్లో మెగ్నిషియం, పొటాషియం, ఫైబర్, కాల్షియం, ఐరన్, జింక్, విటమిన్ సీ సహా మరిన్ని పోషకాలు మెండుగా ఉంటాయి. ఓవరాల్ ఆరోగ్యానికి ఇవి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తాయి.

మోతాదు మేరకు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేందుకు ఖార్జూరాలు తోడ్పడతాయి. ఇందులోని పొటాషియం, మెగ్నిషియం ఇందుకు సహకరిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గించగలవు.

ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరచగలదు. బరువు ఫైబర్ ఎక్కువగా ఉండటంతో బరువు తగ్గేందుకు కూడా సాయం చేస్తుంది. తరచూ ఏదో ఒకటి తినాలనే కోరికను ఫైబర్ అదుపు చేయగలదు. కడుపు నిండిన సంతృప్తిని చాలాసేపు ఉంచగలదు.

ఖర్జూరాల్లోని కాల్షియంతో పాటు మరిన్ని మినరల్స్ ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సీ, ఏ, ఈ సహా ఇతర విటమిన్లు కళ్లు, రక్తం, జట్టుకు మేలు చేస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచగలదు. శరీరంలో వాపు, మంట తగ్గేందుకు ఖర్జూరాలు తోడ్పడతాయి. రోగ నిరోధక శక్తని కూడా ఖర్జూరాలు పెంచగలవు. అందుకే ప్రతీ రోజూ వీటిని తినడం ముఖ్యం.

Whats_app_banner