Indoor Walking: ఇంట్లోనే ఇలా వాకింగ్ చేస్తూ బరువు తగ్గొచ్చు, పదివేల అడుగులు పూర్తి చేసేయచ్చు-by walking like this at home you can lose weight and complete ten thousand steps ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Indoor Walking: ఇంట్లోనే ఇలా వాకింగ్ చేస్తూ బరువు తగ్గొచ్చు, పదివేల అడుగులు పూర్తి చేసేయచ్చు

Indoor Walking: ఇంట్లోనే ఇలా వాకింగ్ చేస్తూ బరువు తగ్గొచ్చు, పదివేల అడుగులు పూర్తి చేసేయచ్చు

Haritha Chappa HT Telugu
Jun 05, 2024 09:47 AM IST

Indoor Walking: బయట వేడిని తట్టుకోలేక చాలా మంది వాకింగ్ చేయలేకపోతున్నారు. వారు ఇండోర్ వాకింగ్ ప్రయత్నించవచ్చు. ఇంట్లోనే వాకింగ్ చేయడాన్ని ఇండోర్ వాకింగ్ అంటారు. ఇలా కూడా బరువు తగ్గవచ్చు.

ఇంట్లోనే వాకింగ్ చేయడం ఎలా?
ఇంట్లోనే వాకింగ్ చేయడం ఎలా? (Freepik)

వేడి గాలులు వీస్తున్న సీజన్లో తీవ్రమైన వ్యాయామాలు చేస్తే విపరీతంగా చెమటపడుతుంది. శరీరంలోని నీరు బయటికి పోతుంది. ఆరుబయట అడుగు పెట్టాలంటే వేడికి, చెమటకు భయపడతారు. ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. వేసవిలో వ్యాయామం చేయడానికి ముందు తగినంత నీరు తాగాలి. అయితే బయట వాకింగ్ చేయలేని వారు…. ఇంట్లోనే వాకింగ్ చేసుకోవచ్చు. వేసవిలో శారీరకంగా దృఢంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు 10,000 అడుగులు పూర్తి చేయడం మంచి మార్గం.

ఇండోర్ వాకింగ్ అంటే ఇంట్లోనే వాకింగ్ చేయడం. మీ ఇల్లు, పనిప్రాంతంలో మీరు వాకింగ్ చేస్తూ ఫిట్ గా ఉండవచ్చు. వీలైనంత వరకు ఇంట్లో కూర్చోకుండా ఇటూ అటూ నడుస్తూ ఉండాలి. ఇంట్లోనే పదివేల అడుగులు వేయాలన్న లక్ష్యం పెట్టుకోవాలి. 10,000 అడుగులు నడవడం మీ ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడటమే కాకుండా, ఇది మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనం కుదురుతుంది. మీ బరువును బట్టి, రోజుకు 10,000 అడుగులు నడవడం వల్ల 250 నుండి 600 కేలరీలు ఖర్చవుతాయి. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం, నడక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక అధ్యయనాల ప్రకారం క్రమం తప్పకుండా నడవడం గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

వాకింగ్ ఇలా చేయండి

వేసవిలో మీ రోజువారీ 10,000 అడుగుల సంఖ్యను పూర్తి చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

1. జుంబా క్లాస్: ఆన్లైన్ ఏరోబిక్స్ లేదా జుంబా క్లాస్ వంటివి చేయడానికి సరదాగా ఉంటాయి. వీటిని ఫాలో అయితే వాకింగ్ చేసినట్టు అవుతుంది. ఇది మీ హృదయ స్పందన రేటును పెంచడానికి, బరువు తగ్గడానికి అద్భుతమైన మార్గం.

2. మీ ఇంటి చుట్టూ నడవండి: మీ ఇల్లు, అపార్ట్మెంట్ లేదా ఆఫీసులో వీలైనంత వరకు నడవండి. ఇంట్లో/ ఆఫీసులో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత 10 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి. ఇది జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా, ఉదర సంబంధిత సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది. రోజంతా మిమ్మల్ని మీరు చురుకుగా ఉంచడానికి టైమర్ సెట్ చేసుకుని ప్రతి గంటకు కొన్ని నిమిషాలు నడవవచ్చు.

3. షాపింగ్ కు వెళ్లండి: మీ ఇంటి సమీపంలోని షాపింగ్ మాల్స్ ఉంటే అక్కడికి వెళ్లి కూడా వాకింగ్ చేయవచ్చు. చాలా మాల్స్ పెద్దవిగా ఉంటాయి. అక్కడ ఒక గంట సేపు నడిస్తే పదివేల అడుగులు పూర్తయిపోతాయి. అలా విండో షాపింగ్ ను ఆస్వాదించవచ్చు.

4. ఇంటి పనులు : మీరు ఇంట్లో చేయాల్సిన పనుల జాబితాను ముందుగానే రాసుకోండి. వాక్యూమింగ్, మోపింగ్, శుభ్రం చేయడం వంటి పనులు చేయడం ద్వారా మీ అడుగుల సంఖ్యను పెంచుకుంది. ఇలా చేయడం మీ ఇల్లు కూడా శుభ్రపడుతుంది.

5. మెట్లు ఎక్కడం: మెట్లు ఎక్కడం గుండె ఆరోగ్యానికి ఒక గొప్ప వ్యాయామం. ఇది మీ అడుగుల సంఖ్యను పెంచుతాయి. ప్రతిరోజూ మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండాలి.

6. టీవీ చూస్తున్నప్పుడు నడవండి: స్థలం పరిమితంగా ఉంటే, టీవీ చూస్తున్నప్పుడు, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు లేదా సంగీతం వింటున్నప్పుడు నడవడం వంటివి చేయాలి. అడుగులు లెక్కపెట్టేందుకు ట్రాక్ చేయడానికి స్టెప్-ట్రాకింగ్ యాప్ ఉపయోగించవచ్చు.

ఇలా చేస్తే ఇంట్లోనే వాకింగ్ పూర్తి చేయవచ్చు. వాతావరణం చల్లబడేవరకు ఇలా ఇంట్లోనే నడవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

Whats_app_banner