Spicy Food: బాగా కారంగా ఉన్న ఆహారం తిన్నాక నాలిక మండిపోతోందా? వెంటనే ఈ ఆహారాలను తినండి మంట తగ్గిపోతుంది-burning tongue after eating very spicy food eat these foods immediately and the inflammation will subside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spicy Food: బాగా కారంగా ఉన్న ఆహారం తిన్నాక నాలిక మండిపోతోందా? వెంటనే ఈ ఆహారాలను తినండి మంట తగ్గిపోతుంది

Spicy Food: బాగా కారంగా ఉన్న ఆహారం తిన్నాక నాలిక మండిపోతోందా? వెంటనే ఈ ఆహారాలను తినండి మంట తగ్గిపోతుంది

Haritha Chappa HT Telugu
Published Feb 10, 2025 10:30 AM IST

Spicy food: కారంగా ఉండే ఆహారం తిన్నాక ఒక్కోసారి విపరీతంగా నోరు మండిపోతుంది. ఇలా నోటిలో స్పైసీగా, మంటగా అనిపిస్తే వెంటనే ఈ ఆహారాలను తినండి. నోటి మంట చాలా వరకు తగ్గిపోతుంది.

నోటి మంటను ఇలా తగ్గించుకోండి
నోటి మంటను ఇలా తగ్గించుకోండి (shutterstock)

స్పైసీ ఫుడ్ అనేది చాలా మందికి ఇష్టం. పచ్చళలు, బిర్యానీలు, కూరలు వంటివి కారంగానే ఉండాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు అనుకోకుండా ఎక్కువ స్పైసీగా తింటారు. లేదా పచ్చిమిరపకాయను నమిలేస్తూ ఉంటారు. ఆ సమయంలో నోరు మంటగా మారడమే కాకుండా ఈ మసాలా కడుపులో చికాకు కలిగిస్తుంది. విపరీతమైన దగ్గు, మంట కూడా వస్తుంది. ఆ కారాన్ని తట్టుకోలేక కొంతమంది విపరీతంగా నీరు తాగేస్తారు. అయినా కూడా మంట తగ్గదు. అలాంటప్పుడు చిన్న చిన్న చిట్కాల ద్వారా మంటను తగ్గించుకోవచ్చు.

కారం ఎక్కువైతే కంటి నుంచి నీరు రావడం మొదలవుతుంది. నోటిలో మంట తగ్గాలంటే కొన్ని రకాల పదార్థాలు సహాయపడతాయి. ఇవి నోటిలోని కారాన్ని వేగంగా తగ్గిస్తాయి. నిజానికి మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల మిరపకాయలో ఉండే కాపుచిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది నాలిక మీద ఉన్న కణజాలాలతో సంబంధంలోకి వస్తే, మంట ప్రారంభమవుతుంది. నాలుక మండడం ప్రారంభమవుతుంది. మిరపకాయల మసాలా తగ్గించడానికి వీటిని తినండి.

నిమ్మరసం తాగండి

నిమ్మరసంలో ఆమ్ల గుణాలున్నాయి. తినేటప్పుడు ఎక్కువ మిరపకాయలు నోటిలోకి వెళ్లినప్పుడు నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల నోటి మంట తగ్గుతుంది. లేదా నిమ్మరసాన్ని నేరుగా నాలిక మీద పిండుకోండి. మంచి ఫలితం కనిపిస్తుంది.

బ్రెడ్ తినండి

ప్రతి ఇంట్లోనూ బ్రెడ్ ఉండడం ఖాయం. కారం ఎక్కువగా తినడం వల్ల మీకు స్పైసీగా అనిపించినప్పుడల్లా, బ్రెడ్ ముక్కను తినండి. బ్రెడ్ తినడం వల్ల లాలాజలంలో ఉండే కాపుచిన్ కంటెంట్ ను బ్రెడ్ పీల్చేసుకుంటుంది. దీని వల్ల నాలిక మంట వెంటనే తగ్గుతుంది.

పంచదార

ఇది బెస్ట్ ఐడియా. స్పైసీగా అనిపించినప్పుడల్లా కొంత పంచదారను నాలిక మీద వేసి మెల్లగా చప్పరించాలి. ఇలా చేయడం వల్ల ఘాటైన ఫీలింగ్ త్వరగా తగ్గుతుంది.

అన్నం

అన్నం కూడా మిరపకాయల మసాలాను సులభంగా తగ్గిస్తుంది. స్పైసీగా అనిపిస్తే సాదా అన్నం తినండి. ఇది మిరపకాయల మసాలా, నోటిలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.

పాలు

పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులను తినడం వల్ల నోటిలో చికాకు నుండి ఉపశమనం లభిస్తుంది. మంట వెంటనే తగ్గుతుంది.

మిరపకాయ మసాలా నోటిలో చికాకు కలిగిస్తుంటే ఎలాంటి పండ్లైనా తినవచ్చు. ఆపిల్, నారింజ లేదా అరటిపండ్లు వంటి పండ్లను తినడం వల్ల నోటి చికాకు, దురద కూడా తగ్గుతుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం