Bunny chow: ఇది మన భారతీయ వంటకమే కానీ మన దేశంలో మాత్రం దొరకదు, తినాలంటే దక్షిణాఫ్రికా వెళ్లాలి
Bunny chow: మనదేశంలో పుట్టిన ఒక భారతీయ వంటకం బన్నీ చౌ. మన దేశంలో మాత్రం ఇది దొరకదు.దీన్ని తినేందుకు దక్షిణాఫ్రికా వెళ్లాలి. అక్కడ డర్బన్ నగరంలో ఎక్కువమంది ఈ వంటకాన్ని తింటున్నారు. దీని పేరు బన్నీ చౌ.
Bunny chow: భారతదేశ వంటకమే కానీ ఇప్పుడు భారతదేశంలో కనిపించకుండా పోయింది. అదే బన్నీ చౌ. ఈ వంటకాన్ని తినాలంటే దేశం దాటి వెళ్ళాలి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో అధికంగా వీటిని తినేవారు ఉన్నారు.
బన్నీ చౌ అంటే ఏమిటి?
బన్నీచౌ అనేది బ్రెడ్ తో చేసే ఒక వంటకం. బ్రెడ్ చేశాక దాన్ని ప్లేట్లో వేసి పైన కూరను పెడతారు. దీన్ని ఫోర్క్ తోనే, స్పూన్‌తోనో తినలేరు. కేవలం చేతులతో మాత్రమే తినాలి. కూర పెట్టేటప్పుడు బ్రెడ్ పైన కొంత భాగాన్ని తీసి కాస్త లోతుగా చేస్తారు. ఆ లోతుగా ఉన్న ప్రాంతంలో కూరను వేస్తారు. ఇది దక్షిణాఫ్రికాలోని డర్బన్ ప్రాంతంలో స్ట్రీట్ ఫుడ్‌గా మారిపోయింది.
బన్నీచౌను దక్షిణాఫ్రికాలోని డర్బన్‌కు తీసుకెళ్ళింది మన భారతీయులే. ఒకప్పుడు వీరు దక్షిణాఫ్రికాకు కూలీలుగా వెళ్లేవారు. అక్కడ చక్కెర మిల్లులో పనిచేసేవారు. వారు తమతో పాటు ఈ బన్నీ చౌ రెసిపీని కూడా తీసుకెళ్లారు. ముఖ్యంగా బన్నీ చౌను లంచ్ లో అక్కడ తినేవారు. ఇది పేదవాడి ఆహారంగా గుర్తింపు పొందింది. ఇది రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది.
బన్నీ చౌ అనే ఫన్నీ పేరు దీని రావడం వెనుక కూడా ఒక కారణం ఉందని అక్కడ చెప్పుకుంటారు. అప్పట్లో దక్షిణాఫ్రికాకు వెళ్ళిన భారత కూలీలను బనియా అని పిలిచేవారు. వారు ప్రతిరోజూ తెచ్చుకునే ఆహారం కాబట్టి దీన్ని బన్నీ చౌ అనే పిలిచేవారని చెప్పుకుంటారు. ఇది పూర్తి శాకాహారం. బ్రెడ్ మధ్యలో కూరగాయలను వండి పెట్టేవారు. అయితే ఇప్పుడు మాంసాహారులు కూడా బన్నీచౌను వండటం మొదలుపెట్టారు. ఈ బ్రెడ్ పై గుడ్డు కూరలు, మటన్ కూరలు కూడా వేసి తింటున్నారు. కానీ పక్కన క్యారెట్ తురుము కచ్చితంగా ఉండాల్సిందే. బన్నీ చౌను తినాలంటే క్యారెట్ సలాడ్ ఉండాలి. భారత్ లోనే ఉండే ఈ వంటకం ప్రస్తుతం కనిపించకుండా పోయింది. ఎవరికైనా ఈ వంటకాన్ని వండుకుని తింటున్నారో లేదో.
టాపిక్