Budget Friendly Foreign Trip । కేవలం రూ.40 వేల బడ్జెట్ ధరలో ఈ దేశాలను పర్యటించవచ్చు!-budget friendly foreign trip 5 beautiful destinations to fly in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Budget Friendly Foreign Trip, 5 Beautiful Destinations To Fly In Summer

Budget Friendly Foreign Trip । కేవలం రూ.40 వేల బడ్జెట్ ధరలో ఈ దేశాలను పర్యటించవచ్చు!

HT Telugu Desk HT Telugu
May 02, 2023 11:40 AM IST

Budget Friendly Foreign Trip: తక్కువ ఖర్చుతో కేవలం రూ. 40 వేల బడ్జెట్లోనే మీరు విహారయాత్రను ఆనందించేందుకు కొన్ని దేశాలు ఉన్నాయి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

Bali, Indonesia
Bali, Indonesia (Unsplash)

Budget Friendly Foreign Trip: సమయం ఉన్నప్పుడే విహారయాత్ర చేయాలి. ఒకసారి విహారయాత్ర చేయాలని ఆలోచిస్తే వెంటనే ప్లాన్ సిద్ధం చేయాలి. ఎందుకంటే గడిచిన సమయం మళ్లీ తిరిగిరాదు, ఒక్కసారి వాయిదాపడ్డ యాత్ర ప్రణాళిక మళ్లీ ఎప్పడు రీషెడ్యూల్ అవుతుందో తెలియదు.వేసవిలో పిల్లలకు పరీక్షలు ముగిసి సెలవులు ఉంటాయి కాబట్టి, ఈ సీజన్‌లో పిల్లలతో కలిసి విహారయాత్ర చేయాలని చాలా మంది పేరేంట్స్ భావిస్తారు. అయితే అందరితో కలిసి వెళ్లాలంటే ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయనే భయం ఉంటుంది. అందులోనూ అంతర్జాతీయ ప్రయాణం అయితే మీ జేబుకి పెద్ద చెల్లు పడటం గ్యారెంటీ. అయితే మీకు అలాంటి భయాలు లేకుండా తక్కువ ఖర్చుతో కేవలం రూ. 40 వేల బడ్జెట్లోనే మీరు విహారయాత్రను ఆనందించేందుకు కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

వియత్నాం

ఇది ఒక విలాసవంతమైన దేశం, బడ్జెట్ ప్రయాణీకులను ఆకర్షించే ప్రదేశం. వియత్నాం వీధులు నిత్యం ఫాన్సీ రెస్టారెంట్లు, విశేషమైన దుకాణాలు, అందమైన కేఫ్‌లతో సందడిగా ఉంటాయి. అంతే కాకుండా, ఈ దేశంలో కొన్ని ప్రసిద్ధ బీచ్‌లు కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని చూసి ఆనందించవచ్చు. వియత్నాంలో అనేక దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, పగోడాలు, ఇతర పవిత్ర స్థలాలు ఉన్నాయి, వీటిని సందర్శించడం ఆనందంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన ఖర్చులు కేవలం రూ.20 వేలలో పూర్తవుతుంది.

థాయిలాండ్

ఆగ్నేయాసియాలోని రిక్రియేషన్ హబ్‌లో తక్కువ బడ్జెట్‌తో ప్రయాణిస్తున్నప్పుడు, థాయ్‌లాండ్‌ పర్యటన ఉత్తమ ఎంపిక అవుతుంది. థాయిలాండ్ ప్రపంచంలోని కొన్ని అత్యుత్తమ బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ఉత్సాహభరితమైన వాతావరణం, పొద్దుపోని రాత్రి, వివిధ రకాల సీఫుడ్, ఇతర రుచికరమైన వంటకాలు మిమ్మల్ని ఈ ప్రదేశం ఎంజాయ్ చేసేలా చేస్తాయి. అద్దెకు ద్విచక్ర వాహనాలు సులభంగా లభ్యం కావడం వల్ల మీ ప్రయాణం సాఫీగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అందుబాటు ధరల్లో వసతి కూడా లభిస్తుంది.

శ్రీలంక

భారతదేశానికి అతి చేరువగా హిందూ మహాసముద్రంలో ఒక ముత్యంలా ఉన్న ద్వీపం శ్రీలంక. భారతదేశం నుండి బడ్జెట్ ధరలో అంతర్జాతీయ పర్యటనను ప్లాన్ చేయడానికి ఉత్తమమైన దేశాలలో శ్రీలంక ఒకటి. శ్రీలంక ఒక మనోహరమైన కలల ప్రపంచం. చుట్టూ దట్టమైన అడవులు, స్వచ్ఛమైన సముద్ర తీరాలు ఉన్నాయి. మీరు సాహసయాత్రలను ఇష్టపడితే ఈ అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించండి , వాటర్ స్పోర్ట్స్‌లో పాల్గొనండి. గొప్పగొప్ప రుచులకు, షాపింగ్ కోసం కూడా శ్రీలంక ప్రసిద్ది.

దుబాయ్

ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండే భవంతులు, సర్రున జారేటువంటి ప్రయాణాన్ని అందించే నునుపైన రోడ్లు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బీచ్ రిసార్ట్‌లు, మరెన్నో అద్భుతాలకు UAE నిలయం. బడ్జెట్ ధరలో విలాసవంతమైన విహారయాత్రను ఆనందించాలనుకుంటే దుబాయ్ బెస్ట్ ఛాయిస్. ఇక్కడ అధునాతన జీవనశైని, గొప్ప అరబ్ సంస్కృతిని ఆస్వాదించవచ్చు. సాహసయాత్రలైనా, షాపింగ్ అయినా, అన్నీ ఇక్కడ లభిస్తాయి.

బాలి

ఇండోనేషియా ద్వీపసమూహంలో బాలి ఒక ఆణిముత్యం అని చెప్పవచ్చు. దీనిని 'ది ఐలాండ్ ఆఫ్ గాడ్స్' అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనీ ప్రకృతి సౌందర్యం అంతా ఇక్కడే ఉందా అన్నట్లుగా ఈ ప్రదేశం ఉంటుంది. ఒక వైపు ఆకుపచ్చని భూములు, మరోవైపు నీలివర్ణపు సముద్రాలు, పురాతన కట్టడాలు, ఘనమైన సంస్కృతి ఇలా ఎన్నింటినో బాలి అందిస్తుంది.

WhatsApp channel

టాపిక్