Rakhi gifts: రాఖీ గిఫ్ట్ కోసం బడ్జెట్ లేదా? తక్కువ ధరలో బెస్ట్ గిఫ్ట్ ఇవే
Rakhi gifts: రక్షాబంధన్ రోజున సోదరికి ఇవ్వడానికి బడ్జెట్ లేకపోతే కంగారు పడకండి. తక్కువ ధరలోనే వచ్చే ఆలోచింపజేసే ఈ బహుమతులను చూసి మీ సోదరి ఖచ్చితంగా సంతోషిస్తుంది.
రక్షాబంధన్ రోజున సోదరికి సోదరుడు కానుకలు, శకునం ఇచ్చే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కానీ దానికోసం ఖరీదైన బహుమతులు కొనే బడ్జెట్ లేకపోతే తక్కువ ధరలోనే కొన్ని ఉత్తమ బహుమతులు కొనుగోలు చేయొచ్చు. వెయ్యి రూపాయల్లోపే కొనగలిగే మంచి గిఫ్ట్ ఆప్షన్లున్నాయి. అవేంటో చూడండి.
పర్సనలైడ్జ్ జ్యువెలరీ:
మీరు బంగారం లేదా వెండి ఆభరణాలనే కొనక్కర్లేదు. మార్కెట్లో లభించే ఆర్టిఫిషియల్ కస్టమైజ్డ్ జ్యువెలరీ మీ సోదరి కోసం కొనవ్వచ్చు. మీ సోదరి పేరు వచ్చే మొదటి అక్షరం పెండెట్లు కొనివ్వచ్చు. లేదా వాళ్ల రాశికి అదృష్టం తెచ్చే సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఉన్న జ్యువెలరీని బహుమతిగా ఇవ్వచ్చు. కచ్చితంగా మీ సోదరికి నచ్చుతుంది.
ఫిట్‌నెస్ బ్యాండ్:
వెయ్యి రూపాయల్లోపే మార్కెట్లో ఫిట్‌నెస్ బ్యాండ్స్ దొరుకుతున్నాయి. తన ఆరోగ్యం కోసం సాయపడేట్లు తనకు దీన్ని బహుమతిగా ఇవ్వండి.
అలంకరణ వస్తువులు:
మీరు సోదరిని మెప్పించాలనుకుంటే ఆమెకు ఇంటి అలంకరణకోసం అవసరం అయ్యే వస్తువులు కొనివ్వండి. డెకరేటివ్ పీసెస్, ఫ్యాన్సీ లాంతర్లు, లైట్లు, బెడ్‌లైట్స్, కప్ సెట్స్ లాంటివి.. ఇలా చాలానే ఇవ్వచ్చు. ఇవన్నీ వెయ్యి లోపే వచ్చేస్తాయి.
స్కిన్ కేర్ ప్రొడక్ట్స్:
స్కిన్ కేర్ ప్రొడక్ట్ కిట్ మొత్తం కొనాలంటే ఖరీదే. కానీ తక్కువ బడ్జెట్ లో కొనేలా శ్యాంపుల్ సైజ్ కిట్స్ కొన్ని అందుబాటులో ఉంటాయి. వీటి ధర ఎక్కువగా ఉండదు. ఈ ప్రొడక్ట్ కిట్లను బహుమతిగా ఇవ్వచ్చు.
హ్యాండ్ బ్యాగ్:
లేడీస్ కు ఆభరణాలు, యాక్ససరీల పట్ల ప్రత్యేక మక్కువ ఉంటుంది. సోదరిని సంతోషపెట్టాలనుకుంటే బడ్జెట్ లో అందమైన హ్యాండ్ బ్యాగ్ ఇవ్వండి.
గిఫ్ట్ కార్డ్:
ఇవన్నీ వద్దు.. తనకు నచ్చింది తనకు కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటే.. ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ గిఫ్ట్ కార్డు కొని తనకు ఇచ్చేయండి. తనకు అవసరం ఉంది తనే కొనుక్కుంటుంది.
రక్షాబంధన్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా బడ్జెట్ అంచాన వేసుకుని ఈ గిఫ్ట్ ఐటమ్స్ కొనండి. రక్షాబంధన్ వేడుకలను ఆనందంగా జరుపుకోండి.