Broccoli Recipe: హెల్తీ రెసిపీ బ్రకోలీ 65, దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది ఎలా చేయాలో తెలుసుకోండి
Broccoli Recipe: ఆరోగ్యకరమైన ఆహారంలో బ్రకోలీ ఒకటి. కానీ దీన్ని తినే వారి సంఖ్య తక్కువే. ఇది చూడడానికి కాలీఫ్లవర్‌లా ఉంటుంది. ఇక్కడ బ్రకోలీతో చేసే రెసిపీ గురించి ఇచ్చాము.
Broccoli Recipe: బ్రకోలీ చూస్తే కాలీఫ్లవర్ గుర్తుకొస్తుంది. కాకపోతే కాలీఫ్లవర్ తెల్లగా ఉంటే బ్రకోలీ ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. బ్రోకోలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయ. అయితే తెలుగు ఇళ్లల్లో దీని వాడకం చాలా తక్కువ. దీనితో ఉండే వంటల విధానం తెలియక ఎంతో మంది బ్రోకోలిని కొనరు. నిజానికి ప్రక్రియతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇక్కడ మేము బ్రకోలిక్ 65 రెసిపీ ఇచ్చాము. ఇది పిల్లలకు అప్పుడప్పుడు పెట్టి చూడండి. వారికి కచ్చితంగా నచ్చుతుంది .
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
బ్రకోలి 65 రెసిపీకి కావలసిన పదార్థాలు
బ్రకోలి ముక్కలు - ఒక కప్పు
కార్న్ ఫ్లోర్ - పావు కప్పు
శెనగపిండి - పావు కప్పు
బియ్యం పిండి - పావు కప్పు
గరం మసాలా - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పెరుగు - రెండు స్పూన్లు
నీళ్లు - సరిపడినంత
కారం పొడి - ఒక స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
బ్రకోలి 65 రెసిపి
1. బ్రకోలీని నిలువుగా ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలో వేయాలి.
2. అదే గిన్నెలో నీరు, ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉంచాలి.
3. ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేయాలి.
4. ఇప్పుడు మరొక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, కారం పొడి, ఉప్పు, పెరుగు వేసి కాస్త నీళ్లు వేసి చిక్కటి పేస్టులా చేసుకోవాలి.
5. ఈ మిశ్రమంలో బ్రకోలి మొక్కలను వేసి బాగా కలుపుకోవాలి.
6. ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె పోయాలి.
7. నూనె బాగా వేడెక్కాక బ్రకోలి ముక్కలను వేసి వేయించుకోవాలి.
8. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
9. అంతే బ్రకోలీ 65 రెడీ అయినట్టే. దీన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది.
బ్రకోలిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఫోలేట్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే వంటివన్నీ ఇందులో లభిస్తాయి. అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు బ్రొకోలీలో నిండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు, మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి పిల్లలకు వారంలో రెండు మూడు సార్లు బ్రకోలీతో చేసిన రెసిపీలను తినిపించండి. పెద్దలు వీటిని తింటే ఎంతో ఆరోగ్యం.