Brinjal Benefits : వంకాయ తింటే గుండెపోటుతో పాటు ఈ 4 వ్యాధులు దూరం
Brinjal Benefits : వంకాయ వంటి కూరయు అంటూ ఓ పద్యం ఉంటుంది. వంకాయ గొప్పతనం ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం వంకాయ అంటే నచ్చదు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. దీనిద్వారా చాలా లాభాలు ఉన్నాయి.
వంకాయ అంటే చాలు చాలా మంది ముక్కున వేలేసుకుంటారు. వంకాయ కూర అంటే.. పచ్చడి వేసుకోనైనా తినేస్తారు. వామ్మో.. వంకాయ కూరనా.. నాకు అస్సలే పడదని చెబుతారు. కానీ వంకాయ(Brinjal) మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తింటే శరీరానికి ఏం కాదు.. మంచే జరుగుతుంది. ఈ కూరగాయ విటమిన్లు(Vitamins), ఖనిజాలతో నిండి ఉంది.
ఇందులో విటమిన్ కె, విటమిన్ సి(Vitamin C), ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు మంచి మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరానికి రోజూ అవసరం. ఇంకా నాలుగు ప్రధాన వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించే సామర్థ్యం వంకాయకు ఉంది. వంకాయ ఆరోగ్యానికి(Brinjal For Health) ఎందుకు మంచిది? దీన్ని తింటే ఏయే వ్యాధులు నయమవుతాయో తెలుసుకుందాం.
మీరు హార్ట్ పేషెంట్(Heart Patient) అయితే వంకాయను కచ్చితంగా తినండి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. గుండె జబ్బులకు ప్రధాన కారణమయ్యేవాటి నుంచి కాపాడుతుంది. ఈ కూరగాయ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.
వంకాయలో ఫైబర్(Fiber In Brinjal) అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ ద్వారా సులభంగా వెళుతుంది. ఇది గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో వంకాయను చేర్చుకోవాలి.
బరువు తగ్గడం(Weight Loss) అనేది ప్రధానంగా కేలరీలను తగ్గించడం. ఆహారంలో ఫైబర్ పెంచాలి. వంకాయ మాత్రమే ఈ రెండు పనులు చేయగలదు. వంకాయ తినడం బరువు తగ్గడానికి చాలా మంచిది. ఇది కొవ్వు బర్నింగ్ రేటును మరింత పెంచుతుంది.
ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్(Cancer) ఉంటే, కొన్నిసార్లు అది జన్యుశాస్త్రం ద్వారా సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి మీరు వీలైనంత ఎక్కువ వంకాయను తినాలి. అనేక పరిశోధనల ప్రకారం క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి దీనికి ఉందని చెబుతున్నారు.
ఇక నుంచైనా వంకాయ కూరను తినడం అలవాటు చేసుకోండి. లేనిపోని కారణాలు చెప్పి.. వంకాయ కూరకు దూరంగా ఉండొద్దు. చాలా ప్రయోజనాలు కోల్పోతారు. వంకాస తింటే ఆరోగ్యానికి మంచే జరుగుతుంది. అయితే కొంతమందికి దూరదలాంటి సమస్య వస్తుందని చెబుతుంటారు. వాళ్లు మాత్రం కాస్త ఆలోచించాలి. వంకాయ బాగుండదు అనే అపోహ మాత్రం పెట్టుకోకండి.