ఆస్తమా... ఒక దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్య. దీన్ని గురక, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యల ద్వారా గుర్తంచవచ్చు. ముఖ్యంగా రుతువులు మారే సమయంలో, వేసవి మరియు వసంత ఋతువుల్లో ఈ బాధ మరింత ఎక్కువవుతుంది. అయితే, వాతావరణ మార్పులే కాదు, కొన్నిసార్లు మన రోజువారీ ఆహారంలో ఉండే పదార్థాలు కూడా ఈ ఆస్తమా లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయని మీకు తెలుసా? ప్రముఖ పల్మోనాలజిస్ట్ డాక్టర్ ఇందర్ మోహన్ చుగ్, HT లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ కొన్ని సాధారణ ఆహారాలు ఆస్తమాను ఎలా ప్రేరేపిస్తాయో వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం!
బాగా చల్లటి పదార్థాలైన ఐస్ ముక్కలు, ఐస్ క్రీం కూల్ డ్రింక్స్ వంటివి ఆస్తమాను పెంచే ఆహారాల్లో ముందు వరుసలో ఉంటాయి. ఇవి శ్వాస మార్గాన్ని చికాకు పెట్టవచ్చు, ఆస్తమా లక్షణాలను ప్రేరేపించవచ్చు. ఆహార గొట్టంతో పాటు శ్వాసకోశ నాళానికి హాని కలిగించవచ్చు.
బయట దొరికే చాట్, పానీ పూరీ, ఇమ్లీ పానీ, కచోరీ వంటి ఆహారాలు రుచికరమైనవే అయినప్పటికీ ఇవి తరచుగా దుమ్ము, కాలుష్య కారకాలకు గురవుతాయి. వీటిని తినడం ఆస్తమా రోగులకు మరింత ప్రమాదకరం. అంతేకాదు ఈ ఆహారాలలో ఉండే మసాలాలు ఆస్తమా లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి.
ఇప్పుడు ఎక్కువ మంది ఇష్టపడే ఆహారాల్లో ఒకటైన ఫాస్ట్ ఫుడ్, చైనీస్ ఫుడ్ ఆస్తమా బాధితులకు విషంతో సమానం. ఎందుకంటే చాలా చైనీస్ వంటకాల్లో కొన్ని కృత్రిమ సంకలనాలు, రకరకాల సాస్‌లు ఉంటాయి. ఇవి అలెర్జీ కారకాలు లేదా చికాకులను కలిగిస్తాయి. దీనివల్ల ఆస్తమా లక్షణాలు మరింత తీవ్రమవుతాయి.
చిప్స్, ఫ్రోజెన్ మీల్స్, బాక్స్డ్ జ్యూస్‌లు మొదలైన వాటిలో ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఇవి కూడా ఆస్తమా లక్షణాలను మరింత ప్రేరేపిస్తాయి.
నిల్వ చేసుకుని తనే పచ్చళ్లు వంటి ఆహారాలు కూడా ఆస్తమా ఉన్నవారిలో అలెర్జీ ప్రతిచర్యలు లేదా శ్వాసకోశ లక్షణాలను రేకెత్తిస్తాయి.
కొంతమంది వ్యక్తులు కెఫైన్ లేదా ఆస్పిరిన్ వంటి మందులకు ప్రతికూలంగా స్పందించవచ్చు. అంతేకాదు కొందరిలో పాలు, వేరుశనగలు వంటివి తినడం వల్ల కూడా ఆస్తమా సమస్య పెరగచ్చు. పడని పదార్థాలేంటో తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి.
ఆస్తమా లక్షణాలను తగ్గించడానికి ఏయే ఆహార పదార్థాలు తీసుకోవాలో డాక్టర్ ఇందర్ మోహన్ చుగ్ వివరించాలరు. ఆయన ఇచ్చిన జాబితాలో ఏమున్నాయంటే..