Breast Tightening Tips: వయసు పెరుగుతున్నా రొమ్ములు బిగుతుగా, అందంగా ఉండాలంటే ఏం చేయాలి?
Breast Tightening Tips: రొమ్ములు వదులుగా, జారిపోయినట్లుగా మారితే ఆడవారు చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీసే అవకాశాలున్నాయి. వయసు పెరుగుతున్నా కూడా రొమ్ములు బిగుతుగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇక్కడ తెలుసుకోండి.

ఆడవారు అందంగా కనిపించడానికి, అందరిలోనూ ఆత్మవిశ్వాసంతో నిలబడటానికి వారి రొమ్ము పరిమాణం, షేపులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. లేదంటే వారు నలుగురిలో నామూషీగా, ఇబ్బందిగా ఫీలవుతుంటారు.వయసు పెరిగే కొద్దీ రొమ్ములు వదులుగా మారడం, జారిపోయినట్లు కనిపించడం సాధారణమే. అంతేకాదు శరీర బరువు, గర్భధారణ వంటి సమయాల్లో శరీర మార్పుల వల్ల కూడా రొమ్ములు సాగిపోతాయి. ఇది చూడటానికి కాస్త అందవిహీనంగా కనిపిస్తుంది. ఫలితంగా ఆడావారిలో ఆత్మన్యూనత భావం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటివి కలుగుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే వయసు పెరుగుతున్నా రొమ్ములు బిగుతుగా కనిపించాలంటే కొన్ని చిట్కాలను పాటించాలంటున్నారు నిపుణులు అవేంటో తెలుసుకుందాం.
ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి:
రొమ్ములు ఎల్లప్పుడూ బిగుతుగా, అందంగా ఉండాలంటే విటమిన్-సీ, పోషకాలు ఫైబర్ అధికంగా,ఫైటోఈస్ట్రోజెన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తీసుకోవాలి.చిక్కుళ్లు, గింజలు, కొవ్వు చేపలు వంటి రొమ్ము కణజాలాల ఆరోగ్యానికి చాలా మంచిది.ఇవి చర్మారోగ్యాన్ని పెంచే కోల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తాయి.
చెస్ట్ వ్యాయామాలు చేయాలి:
పుష్-అప్స్, ఛెస్ట్ ప్రెస్‌లు, డంబెల్ ఫ్లైలు వంటి బ్రెస్ట్ ఎక్సర్ సైజులు బ్రెస్ట్ కింద ఉన్న కండరాలను బలపరుస్తాయి. ఇవి రొమ్ములను ఎల్లప్పుడూ బిగుతుగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటితో పాటు సరైన పొజిషన్లో కూర్చోవడం కూడా చాలా అవసరం. కూర్చున్నప్పుడు భూజాలను వెనక్కి నెట్టి ఉంచి, ఛాతి భాగాన్ని ముందుకు ఉంచడం వల్ల రొమ్ములు టైట్‌గా ఉంటాయి.
బరువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి:
బరువు పెరగడం లేదా తగ్గడం కూడా రొమ్ములు రూపాన్ని, ఆకృతినీ ప్రభావితం చేస్తాయి.రొమ్ములు సాగిపోయినట్లు కనిపించడానికి ఇదే ప్రధాన కారణంగా నిలుస్తుంది. అందుకే శరీర బరువును ఎప్పుడూ స్థిరంగా ఉంచుకోవడం ముఖ్యం.
చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయాలి:
బ్రెస్ట్ చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితమైనది. కాబట్టి దీనిని మాయిశ్చరైజ్ చేయడం చాలా ముఖ్యం. కొబ్బిరి నూనె, షియా బటర్ లాంటి క్రీములు లేదా నూనెలతో రొమ్ములను, చుట్టూ ఉండే చర్మానికి అప్లై చేస్తూ ఉండటం వల్ల చర్మం బలంగా తయారవుతుంది. రొమ్ములు సాగిపోకుండా ఉంటాయి.
వేసుకునే బ్రాను తేలికగా తీసుకోకండి:
రొమ్ములు సాగిపోకుండా ఉండాలంటే వేసుకునే బ్రా విషయంలో కాస్త ఆలోచించి ఎంచుకోవాలి. బ్రెస్ట్ కు సపోర్టివ్ గా ఉండే బ్రాను ధరించడం వల్ల రొమ్ము కణజాలం, స్నాయువులపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. సపోర్టివ్ బ్రా గురుత్వాకర్షణ వల్ల కుంగిపోవడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది బ్రెస్ట్‌లపై ఉన్న బరువును తగ్గించి సాగిపోకుండా కాపాడుతుంది.
నీరు తాగడం మర్చిపోవద్దు:
చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి మంచి హైడ్రేషన్ అవసరం.నీటిని ఎక్కువగా తాగడం వల్ల చర్మం స్థితిస్థాపకత కోల్పోకుండా ఉంటుంది. ఆరోగ్యంగా, తేలికగా ఉంటుంది.ఇది రొమ్ములు టైట్‌గా ఉండడంలో సహాయపడుతుంది.
అప్పుడప్పుడూ మసాజ్ చేసుకోండి :
బ్రెస్ట్‌లకు సాఫీగా, సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణను మెరుగవుతుంది.ఇది రొమ్ము కండరాలను బలంగా ఉంచి సాగనివ్వకుండా ఆపుతుంది. చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
ధూమపానం మానేయండి:
మీకు సిగరెట్ తాగే అలవాటు ఉండి ఉంటే వెంటనే మానేందుకు ప్రయ్నతించండి. ధూమపానం ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా చాలా హానికరం. ఇది చర్మం స్థితిస్థాపకతను కోల్పోయేలా చేస్తుంది. రొమ్ములు బిగుతుగా ఉండాలంటే మద్యపానం జోలికి పోకుండా ఉండండి.
సంబంధిత కథనం