Breakup woes: మాజీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి-breakup woes thinking of begging to get your ex back you need to know from relationship experts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Breakup Woes Thinking Of Begging To Get Your Ex Back You Need To Know From Relationship Experts

Breakup woes: మాజీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Feb 22, 2023 04:36 PM IST

Breakup woes: బ్రేకప్ అయ్యాక మాజీ లవర్‌కు మళ్లీ దగ్గరవ్వాలనిపిస్తోందా? ఇది సత్ఫలితాలను ఇస్తుందా? రిలేషన్‌షిప్ కోచ్ ఏమంటున్నారో చూడండి.

బ్రేకప్‌కు మీరే కారణమని ఓవర్ థింకింగ్ చేయకండి
బ్రేకప్‌కు మీరే కారణమని ఓవర్ థింకింగ్ చేయకండి (Freepik)

రిలేషన్‌షిప్ ముగించడం చాలా భావోద్వేగాలతో కూడుకున్నది. చాలావరకు తీవ్రమైన వేదనతో కూడుకున్నది. బ్రేకప్‌ తొలినాళ్లలో దానిని అంగీకరించడానికి మనస్సు ఒప్పుకోదు. అలా అంగీకరించడానికి ముందు మీరు తీసుకోవాలనుకున్న చర్యలు ఆచరణాత్మకం కాకపోవచ్చు. సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. బ్రేకప్ తరువాత బాధితుడిగా మారిన వ్యక్తి తన జీవితాన్ని కొనసాగించేందుకు చాలా సమయం పట్టొచ్చు. పదే పదే బాధపడుతుండొచ్చు. తానేదో తప్పు చేశానని, తప్పుగా మాట్లాడానని, అందుకే ఇలా విడిపోవాల్సి వచ్చిందని బాధపడుతుండొచ్చు. అందుకే తన మాజీకి కాల్ చేయాలని, లేదా మెసేజ్ చేయాలని, తాను మారుతానని చెప్పాలని, సంబంధాన్ని మళ్లీ బతికించాలని వేడుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారు తమ మనస్సులోంచి డిలీట్ చేశాక మళ్లీ కావాలనిపించడం ఫలితాన్ని ఇస్తుందా?

రిలేషన్‌షిప్ బాగున్నప్పుడు అవతలి వ్యక్తి చూపించిన ప్రేమ, ఆప్యాయత, కేరింగ్ పదే పదే గుర్తొస్తుంటుంది. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఐ హేట్ యూ అంటూ భాగస్వామి పదే పదే తిట్టినా అది ప్రేమగానే ఇవతలి వ్యక్తి భావిస్తారు. ప్రేమగా విసిగించినప్పుడు భాగస్వామి సైకో అంటూ తిట్టినా అది మనసుకు హాయిగానే ఉంటుంది. కానీ బ్రేకప్ పరిస్థితికి వచ్చాక మునుపటి ఆప్యాయత, ప్రేమలో రవ్వంత తగ్గినా మీరు బాధితుడిగా మిగిలిపోతారు. మనసు విలవిల్లాడిపోతుంది. కానీ మీరు బ్రేకప్ దశకు చేరుకున్నాకా వారిని తిరిగి రిలేషన్‌షిప్ నిలబెట్టమని ప్రాధేయపడడం వల్ల ఉపయోగం ఉంటుందా? ఈ టెంప్టేషన్‌ సరైనదేనా? రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారో ఇక్కడ చూడండి.

కొన్ని కారణాల వల్ల రిలేషన్‌షిప్ బ్రేకప్ అవుతుంది. దానికి కారణం మీరు కాకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు రిలేషన్‌షిప్‌లో ఇద్దరు పరస్పరం అనుకూలంగా ఉండకపోవచ్చు. లేదా వ్యక్తులు కాలక్రమేణా మారుతూ ఉండొచ్చు. అవతలి వ్యక్తికి వారి జీవితంపై విభిన్నమైన ఆశలు, ఆకాంక్షలు ఉండొచ్చు. లేదా విభిన్న ప్రాధాన్యతలు ఉండొచ్చు. బ్రేకప్‌కు కారణం ఒక్కటే అయి ఉండొకపోవచ్చు.

మీ మాజీ భాగస్వామిని మళ్లీ తిరిగి మీ జీవితంలోకి రావాలని బతిమిలాడాలని అనుకుంటున్నారా? అయితే అదంతా సవ్యంగా సాగకపోవచ్చు. సత్ఫలితం ఇవ్వకొపోవచ్చు. వారితో బంధం అతికినా అది వెలితిగానే ఉంటుంది.

మీ గుర్తింపును పక్కన పడేయకండి

‘అయితే మీరు మీ మాజీకి కాల్ చేయాలని, లేదా టెక్ట్స్ చేయాలని అనుకుంటున్నారా? మీరు మారినట్టు చెప్పాలనుకుంటున్నారా? మహిళలూ.. కాదు కాదు.. ఇది మగవారికి కూడా వర్తిస్తుంది. మీరు మారినట్టు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు. మీ భాగస్వామికి ఈ రిలేషన్‌షిప్ ఇష్టం లేకపోతే ఇంకా వారినే ఎందుకు ఎంచుకోవాలనుకుంటున్నారు? ఆ బంధాన్ని ఇంకా ఎందుకు కోరుకుంటున్నారు? అది మీపై ప్రతిబింబిస్తుంది. ఇది విమర్శనో, లేక జడ్జ్‌మెంటో కాదు. కానీ ఇక్కడ అభద్రతా భావం కనిపిస్తుంది.

మీకు నొప్పిగా ఉందని మీ గుర్తింపును పక్కనపడేసి ఆ బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నారు. మీ మాజీని మీ బంధంలోకి తిరిగి రప్పించేందుకు వారు కోరుకున్న విధంగా, వారికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు. ఇలా చేయడానికి మీరెవరు? మీరిదంతా ఎవరికి చూపించాలనుకుంటున్నారు? మీకోసమా? లేక మీలో ఉన్న పరిణతి చెందని వ్యక్తిత్వం కోసమా? మీరు నిజంగా సంబంధంలో ఉన్న అవసరాలను గౌరవిస్తున్నారా?..’ అని రిలేషన్‌షిప్ కోచ్ స్టెఫానోస్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాశారు.

మీ పట్ల మీరు న్యాయంగా ఉండాలనుకుంటే ముందుగా మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోండి. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకండి. బంధాన్ని తెంచుకున్న వారి కోసం మీరు దిగజారకండి. రిలేషన్‌షిప్ ఇష్టం లేదని వెళ్లిపోయిన వారిని బతిమాలడం కూడా అవతలి వ్యక్తి దృష్టిలో తప్పే అవుతుంది. అందుకే ఉండి పోయే వాళ్లు వచ్చేంత వరకు వెళ్లిపోయే వాళ్లను వెళ్లనివ్వండి.

WhatsApp channel

సంబంధిత కథనం