Moong Dal Upma : పెసరు పప్పు ఉప్మా.. ఇలా తయారు చేయాలి-breakfast recipes how to make moong dal upma ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Breakfast Recipes How To Make Moong Dal Upma

Moong Dal Upma : పెసరు పప్పు ఉప్మా.. ఇలా తయారు చేయాలి

HT Telugu Desk HT Telugu
Mar 13, 2023 06:30 AM IST

Moong Dal Upma : ఉప్మా అంటే కొంతమందికి నచ్చదు. ఆ పేరు చెప్పగానే లేచి వెళ్లిపోతారు. అయితే వెరైటీగా పెసరు పప్పు ఉప్మా చేస్తే.. ఎంచక్కా తినేయోచ్చు.

మూంగ్ దాల్ ఉప్మా
మూంగ్ దాల్ ఉప్మా

ఉప్మా అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ రోజు టిఫిన్ ఉప్మా అనగానే.. ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు. ఎన్నిసార్లు వద్దన్నా.. అదే చేస్తున్నారని ఫైర్ అవుతారు. కొంతమంది మాత్రం.. కూరగాయలు, జీడిపప్పు, పల్లీలు వేస్తే తింటారు. అయితే ఉప్మాను మరింత టేస్టీగా తయారు చేయోచ్చు. పెసరు పప్పుతో చేసే ఉప్మాను మీరు హాయిగా తింటారు. తయారు చేయడం కూడా సులభమే. ఇంతకీ మూంగ్ దాల్ ఉప్మాను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు..

పెసర పప్పు పొట్టు తీసింది-ఒక కప్పు, ఉప్పు-ఒక టీస్పూన్‌, నీళ్లు-ఒకటిన్నర కప్పు, తాళింపు కోసం-నువ్వులు-ఒక టీస్పూన్‌, ఆవాలు-అర టీస్పూన్‌, అల్లం తురుము-ఒక చెంచాన్నర, ఉల్లికాడలు-రెండు, ఉల్లిపాయ ముక్కలు-రెండు టీస్పూన్లు, కరివేపాకు-రెండు రెబ్బలు, పచ్చి మిర్చి-మూడు.

మెుదట పెసర పప్పును నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత దాన్ని మెత్తగా రుబ్బాలి. కొంచెం ఉప్పు కలుపుకోవాలి. ఇడ్లీల పాత్రలో వేసుకుని.. ఇడ్లీల మాదిరిగా ఆవిరి మీద ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత.. తీసుకుని మెత్తగా రవ్వలా చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసుకుని వేడి చేయాలి. అందులో ఆవాలు, అల్లం, ఉల్లిపాయ, కరివేపాకు, నువ్వులు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.

ఇందులో ఇంతకు ముందు తయారు చేసుకున్న పెసరు పప్పును వేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. చివరగా.. ఉల్లికాడల వేసుకుంటే సరిపోతుంది. రుచికరమైన మూంగ్ దాల్ ఉప్మా తయారు అయింది. బ్రేక్ ఫాస్ట్ లాగా తినొచ్చు. టేస్టీగా ఉంటుంది.

WhatsApp channel

టాపిక్