Breakfast Recipe: ఆనియన్ చిల్లీ పరాఠాను అయిదు నిమిషాల్లో రెడీ చేసేయండి, స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఇదే!-breakfast recipe prepare onion chilli paratha in five minutes this is a special breakfast recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipe: ఆనియన్ చిల్లీ పరాఠాను అయిదు నిమిషాల్లో రెడీ చేసేయండి, స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఇదే!

Breakfast Recipe: ఆనియన్ చిల్లీ పరాఠాను అయిదు నిమిషాల్లో రెడీ చేసేయండి, స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఇదే!

Ramya Sri Marka HT Telugu
Published Feb 14, 2025 06:30 AM IST

Breakfast Recipe: రెగ్యూలర్ బ్రేక్‌ఫాస్ట్‌లు తిని బోర్ కొట్టేసిందా! అయితే ఆనియన్ - చిల్లీ కాంబినేషన్‌తో తయారుచేసే పరాఠాను ట్రై చేయండి. మీరు అనుకున్న సమయం కంటే వేగంగా తయారుచేసుకోగల బ్రేక్ ఫాస్ట్ తినండి.

ఆనియన్ చిల్లీ పరాఠాను అయిదు నిమిషాల్లో రెడీ చేసేయండి
ఆనియన్ చిల్లీ పరాఠాను అయిదు నిమిషాల్లో రెడీ చేసేయండి

ఆనియన్ - చిల్లీ పరాఠా వినడానికే చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! తినడానికి కూడా అలానే ఉంటుంది. సాధారణంగా పరాఠాతో పాటు పచ్చి ఉల్లిపాయ తిని ఉంటారు. కానీ, పరాఠా లోపల వేయించిన ఆనియన్ పెట్టుకుని తినే రెసిపీ ఇదే ఫస్ట్ టైం కావొచ్చు. మరి దాని టేస్ట్ ఏంటో, ఎలా ట్రై చేయాలో చూసేద్దామా..!

ఆనియన్ - చిల్లీ పరాఠా తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • గోధుమ పిండి - 1 కప్పు
  • ఉప్పు - 1/4 టీస్పూన్
  • వాము - 1/4 టీస్పూన్
  • కొత్తిమీర ఆకులు - 1 టీస్పూన్
  • నూనె - 1 టీస్పూన్
  • నీరు - 1/2 కప్పు
  • పెద్ద ఉల్లిపాయలు - 2
  • వెల్లుల్లి రెబ్బలు - 2 నుంచి 3
  • కొత్తిమీర ఆకులు - 2 టేబుల్ స్పూన్స్
  • కాశ్మీరి కారం పొడి -1/2 టీస్పూన్
  • మాగీ మసాలా - 1 టీస్పూన్
  • చాట్ మసాలా పౌడర్ - 1/2 టీస్పూన్
  • పచ్చి మిరపకాయ - 1
  • ఉప్పు - 1/4 టీస్పూన్
  • నూనె / నెయ్యి

తయారీ విధానం:

  • ఒక గిన్నెలోకి కప్పు గోధుమ పిండి తీసుకోండి. అందులో పావు కప్పు మైదా పిండి కలపండి.
  • అందులో వాము, కొత్తిమీర ఆకులు వేయండి. కలర్ కోసం కావాలనుకుంటే కాస్త పసుపు కలుపుకోవచ్చు.
  • సగం కప్పు నీరు కలుపుకుని ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని పక్కకు పెట్టుకోండి.
  • మరో వైపు రెండు ఉల్లిపాయలను సన్నగా తురుముకుని పాన్ లో వేయండి.
  • అందులో రెండు వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, లేదంటే తురుముకుని వేసుకోండి.
  • ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అర టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి.
  • ఆ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ మ్యాగీ మసాలా, రింగులుగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి వేయండి.
  • అవన్నీ కలిపి దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకూ వేయించుకున్న తర్వాత అందులో ఉప్పు కలుపుకోండి.
  • ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పలుచగా చేసుకుని చపాతీ మాదిరిగా చేసుకోవాలి.
  • దానిపై వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలను ట్రయాంగిల్‌లో పేర్చుకోవాలి.
  • అంచుల్లో కాస్త నీటితో తడుపుకుంటే, పిండి బాగా అతుకుతుంది.
  • వాటిని తీసుకుని పాన్ పై పెట్టి వేడి చేయాలి. కాస్త రంగు మారిన తర్వాత కుదిరితే నెయ్యి లేదంటే నూనె వేసుకుని వేయించుకోండి.
  • ఇలా రెడీ అయిన ఆనియన్ పరాఠాకు పెరుగు పెట్టుకుని తింటే రుచికరంగా ఉంటుంది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం