Brain Teaser: తర్వాత రాబోయే సంఖ్య ఏమై ఉంటుంది? చెప్పగలిగారంటే మీరు పజిల్ మాస్టర్ అయిపోయినట్లే..
Brain Teaser: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ బ్రెయిన్ టీజర్ మీ ముందుంచుతున్నాం. ఈ వరుసలో తర్వాత రాబోయే సంఖ్య ఏమే ఉంటుందో, మీకేమైనా అంచనా ఉందా? చెప్పుకోండి చూద్దాం.
ఇంటర్నెట్ యుగంలో ఎంటర్‌టైన్మెంట్ అంతా బ్రెయిన్ టీజర్‌లపైనే ఉంది. ఎక్కువ మంది ఈ పజిల్స్ పరిష్కరించడాన్నే ఎంజాయ్ చేస్తున్నారట. ఇవి మన ఆలోచనలను, తీసుకోబోయే నిర్ణయాలను స్పష్టంగా ఉంచుకోవడానికి బాగా సహకరిస్తాయి కూడా. పరిష్కరించగలిగినంత వరకూ ఓకే కానీ, లేదంటే చాలా గందరగోళానికి లోను కావాల్సి వస్తుంది. అయినా కూడా సాల్వ్ చేసిన తర్వాత అనిపించే రిఫ్రెషింగ్ ఫీలింగ్ కోసం పజిల్స్ అంటే ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తుంటారు. మరి ఈ బ్రెయిన్ పజిల్ పరిష్కరించేందుకు మీరు రెడీయేనా?
సాల్వ్ చేయగలననే నమ్మకం మీకుంటే, ఇదిగోండి ఒక కొత్త పజిల్
ఇటీవల ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేసిన ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో బాగా వైరల్ గా మారింది. అంతలా అందరి దృష్టిని ఆకర్షించిన పజిల్ మీద మీరూ ఓ కన్నేయండి. Brainy Bits Hub అకౌంట్లో చేసిన ఈ పోస్ట్ ఇలా ఉంది:
"నెక్స్ట్ రాబోయే సంఖ్య ఏమిటి? - 0, 1, 1, 2, 3, 5, 8, 13, ?"
సమాధానం = 21
(0+1, 1+1, 1+2, 2+3, 3+5, 5+8, 8+13)
పజిల్‌ను చేధిస్తే:
ఫస్ట్ టైం చూసిన వారెవరికైనా ఇది గందరగోళంగా అనిపించొచ్చు. కానీ, పజిల్ లవర్స్ కు ఇది చాలా నచ్చే క్వశ్చన్. ఈ వరుసను కనుగొనడం చాలా సులువుగా అనిపిస్తుంది. మరి, ఈ ప్రత్యేక బ్రెయిన్ టీజర్‌లోని తదుపరి సంఖ్యను అంచనా వేయగలిగారా..
సాధారణంగా బ్రెయిన్ టీజర్‌లను ఎక్కువగా ఎందుకు ఇష్టపడతారంటే..
ఇలాంటి బ్రెయిన్ టీజర్‌లు కేవలం కాలక్షేపం కోసమే కాదు. ఆలోచనాత్మకంగా ఉండి, మెదడుకు పదును పెడతాయి. మనలోని విమర్శనాత్మకమైన ధోరణిని మెరుగుపరిచి, బాక్స్ వెలుపల ఉండి ఎలా ఆలోచించాలో నేర్పిస్తాయి. మనల్ని గందరగోళానికి గురిచేసినా లేదా పరిష్కారంతో సంతోషపెట్టినా, దృష్టిని ఆకట్టుకుంటాయి. రోజువారీ దినచర్య నుండి కాస్త భిన్నంగా ప్రవర్తించే అవకాశాన్ని కల్పిస్తాయి. మానసికంగా సవాళ్లను ఎదుర్కొనే వారికి, బ్రెయిన్ టీజర్ విడదీయగలిగిన చిక్కుముడిలా ఉండి సంతృప్తి కలిగిస్తుంది.
మరికొన్ని పజిల్స్ మీ కోసం..
2, 4, 8, 16, 32, …?
- సమాధానం: 64
(2×2=4, 4×2=8, 8×2=16, 16×2=32, 32×2=64)
1, 4, 9, 16, 25, …?
- సమాధానం: 36
(1²=1, 2²=4, 3²=9, 4²=16, 5²=25, 6²=36)
5, 10, 20, 40, 80, …?
- సమాధానం: 160
(5×2=10, 10×2=20, 20×2=40, 40×2=80, 80×2=160)
1, 1, 2, 6, 24, …?
- సమాధానం: 120
(1!=1, 2!=2, 3!=6, 4!=24, 5!=120)
బ్రెయిన్ పజిల్ పరిష్కరించే ప్రయత్నంలో మనకు తెలియకుండానే మానసికంగా బలపడతాం. వీటి వల్ల మానసిక వ్యాయామం, సమస్యను పరిష్కరించే సామర్థ్యం, లాజికల్ థింకింగ్, సంక్లిష్ట సమస్యలు అంగీకరించే స్వభావం, సృజనాత్మకత, ఫోకస్ పెంపు, చురుకుదనం, ఆత్మవిశ్వాసం వంటి అంశాలు మెరుగవుతాయి.
ఇటువంటి పజిల్స్ ను అప్పుడప్పుడు చేస్తుండటం వల్ల లాజికల్ థింకింగ్ మెరుగవుతుంది.
సంబంధిత కథనం
టాపిక్