గణితంలో మీరు దిట్టా? అయితే 10సెకన్లలో దీనికి సమాధానం చెప్పండి!-brain teaser if you are good at maths answer this puzzle in 10 seconds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  గణితంలో మీరు దిట్టా? అయితే 10సెకన్లలో దీనికి సమాధానం చెప్పండి!

గణితంలో మీరు దిట్టా? అయితే 10సెకన్లలో దీనికి సమాధానం చెప్పండి!

Ramya Sri Marka HT Telugu

ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతున్న ఈ మ్యాథ్ పజిల్‌ను మీరు సాల్వ్ చేయగలరా? చూడటానికి సింపుల్‌గా ఉంటుంది కానీ దీని సమాధానం అంత తేలికైతే కాదు. 10 సెకన్లలో దీనికి సమాధారం కనుక్కున్నారంటే మీరు నిజంగా జీనియస్ అన్నట్టే. చాలా మంది దీని కోసం తలలు పట్టుకున్నారు. ఇప్పుడిక మీ వంతు ట్రై చేయండి.

సమాధానం కనిపెట్టండి చూద్దాం..!

ఈ మధ్య సోషల్ మీడియా ప్రపంచం వింతైన, వినోదభరితమైన బ్రెయిన్ టీజర్ చిత్రాలతో నిండిపోతుంది. స్క్రోల్ చేస్తున్నప్పుడు కంటపడే కొన్ని రకాల పజిల్స్ ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చూడటానికి సాధారణంగా అనిపించినా వాటి సమాధానాలు మాత్రం అంత తేలికగా కనిపెట్టలేకపోతున్నాం. ఇవి చాలా ఎగ్జైటింగ్‌గా, సరదాగా అనిపించడం మాత్రమే కాదండోయ్. మన మెదడుకు ఒక మంచి వ్యాయామం లాంటివి.

ఇలాంటి పజిల్స్ మన మెదడుకు మేత లాంటివి. మనల్ని ఆలోచించమని సవాలు చేస్తాయి, తద్వారా మన బుద్ధికి పదును పెడతాయి. అయితే ఈ మేధో కసరత్తులో ఒక ప్రత్యేకమైన సరదా కూడా దాగి ఉంటుంది.

ఇప్పుడు మీ ముందుకు అలాంటి ఒక వైరల్ బ్రెయిన్ టీజర్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇది ఒక సాధారణ గణిత పజిల్ లాగా కనిపిస్తుంది. కొన్ని కూడిక లెక్కలు ఇందులో ఉన్నాయి. కూడికలే కదా అని కూల్ గా తీసుకుంటే సరిపోదండీ. ఇక్కడే ఉంటుంది అసలైన ట్విస్ట్! ఎందుకంటే సాధారణంగా 3+6 అనేది 9 అవుతుంది. కానీ ఇక్కడ 3+6 ... 21 అవుతుంది. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఇదే లాజిక్‌ను ఉపయోగిస్తూ 8+11= ఎంత అవుతుందో కనుక్కోండి!

ఈ పజిల్ ఎక్కడిదంటే..

ఈ పజిల్ Minion Quotes అనే ఫేస్‌బుక్ పేజీలో దర్శనమిచ్చింది, అప్పటినుండి ఇది ఇంటర్నెట్‌లో ఒక సంచలనంగా మారింది. ఎంతో మంది ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి తమ మెదడుకు తీవ్రమైన పని పెట్టారు. కొందరు తెలివైనవారు సరైన సమాధానం చెప్పి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. నిజం చెప్పాలంటే, ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడం ఒక రకమైన మేధో సవాలు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు.

ఇలాంటి ప్రశ్నలు చూడటానికి చాలా సులభంగా అనిపించినప్పటికీ, వాటి వెనుక దాగి ఉన్న లాజిక్‌ను ఛేదించడం అంత సులువు కాదు. ఇవి మన మెదడులోని దాగి ఉన్న ఆలోచనా శక్తిని వెలికితీస్తాయి, విభిన్న కోణాల్లో ఆలోచించేలా ప్రోత్సహిస్తాయి. అంతేకాదు ఖాళీ సమయంలో రీల్స్ చూస్తే టైం వేస్ట్ చేసుకోకుండా సరదాగా బ్రెయిన్ ను షార్ప్ చేసుకోవడానికి ఇవి ఒక అద్భుతమైన సాధనం కూడా.

ట్రై చేయండీ.. మీ మెదడుకు పదును పెట్టడానికి ఇది సరైన సమయం. ఈ బ్రెయిన్ టీజర్‌కు మీ నుండి సరైన సమాధానం వస్తుందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు విజయం సాధిస్తే మీకు సరైన సమాధానం దొరికితే ఈ ఛాలెంజ్‌ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా పంపించండి. వారి నుండి ఎలాంటి సమాధానాలు వస్తాయో చూడండి. ఆలోచించండి... మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం.

జవాబు ఇక్కడుందీ చెక్ చేసుకోండి..

ఈ పజిల్ వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే, మొదటి సంఖ్యను రెండవ సంఖ్యతో గుణించి, ఆ మొత్తానికి మొదటి సంఖ్యను కలపాలి.

1 + 4 = (1 * 4) + 1 = 4 + 1 = 5

2 + 5 = (2 * 5) + 2 = 10 + 2 = 12

3 + 6 = (3 * 6) + 3 = 18 + 3 = 21

ఇదే లాజిక్‌ను ఫాలో అయితే:

8 + 11 = (8 * 11) + 8 = 88 + 8 = 96

కాబట్టి, 8 + 11 = 96.

ఇలాంటి పజిల్స్ సోషల్ మీడియాలో ఎన్నో ఉంటాయి. అప్పుడప్పుడూ వీలైతో రోజూ వీటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు సరదాగా ఉంటుంది, మెదుడకు పదును పెట్టినట్లు ఉంటుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.