Brain Teaser : కోడిని కొని అమ్మిన ఈ వ్యక్తికి ఎంత లాభం వచ్చింది? కచ్చితంగా సమాధానం చెప్పలేరు-brain teaser can you determine how much profit this man makes after selling chicken mind game viral news ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brain Teaser : కోడిని కొని అమ్మిన ఈ వ్యక్తికి ఎంత లాభం వచ్చింది? కచ్చితంగా సమాధానం చెప్పలేరు

Brain Teaser : కోడిని కొని అమ్మిన ఈ వ్యక్తికి ఎంత లాభం వచ్చింది? కచ్చితంగా సమాధానం చెప్పలేరు

Anand Sai HT Telugu
Apr 08, 2024 09:30 AM IST

Brain Teaser In Telugu :బ్రెయిన్ టీజర్ ఆసక్తిగా ఉంటుంది. ఇది మీ మెదడు ఎంత తెలివైనదో పరీక్షిస్తుంది. మీకు సమాధానం తెలుసు అనిపిస్తుంది. కానీ చిన్న తప్పు చేస్తారు. చికెన్ కొని అమ్మడం ద్వారా ఈ వ్యక్తి ఎంత లాభపడ్డాడో మీరే చెప్పాలి.

బ్రెయిన్ టీజర్
బ్రెయిన్ టీజర్ (Unsplash)

బ్రెయిన్ టీజర్‌లు నిజంగానే తలలు పట్టుకునేలా చేస్తాయి. పైకి సమాధానం వెతకడం తేలికగా అనిపించినా, సమాధానం దొరక్క తల గొక్కుంటాం. ఒక్కోసారి ఎంత తెలివి వాడినా సమాధానం దొరకదు. సమాధానం కోసం మీరు కొంత ఓపిక పట్టాలి. ఇదే బ్రెయిన్ టీజర్ యెుక్క స్పెషాలిటీ. ఇక్కోడ బ్రెయిన్ టీజర్ ఉంది. ఇది మీ మెదడు ఎంత తెలివైనదో పరీక్షిస్తుంది. మీకు సమాధానం తెలుసు కానీ కన్ఫూజ్ అవుతారు. నిజానికి ఇలాంటివి చేయాలి. అప్పుడే కాస్త ఒత్తిడి నుంచి బయపడతారు. ఆసక్తి పెరుగుతుంది. మీ స్నేహితులతోనూ ఫన్నీగా ఆడొచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి చికెన్ కొని అమ్మడం ద్వారా ఎంత లాభపడ్డాడో మీరే సమాధానం చెప్పాలి.

సోము అనే వ్యక్తి కోడిని 900 రూపాయలకు కొంటాడు. అదే కోడిని వేరొకరికి 1200 రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఇప్పుడు లాభం పొందుతాడు, అంతే కదా? అయితే అతడు మెుదటి కోడిని కొని అమ్మిన తర్వాత ఖాళీగా లేడు. మరో కోడి 1300 రూపాయలకు కొంటాడు. 1600 రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఇక ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాల్సిన టైమ్ వచ్చింది. ఇక ఏం ఆలోచిస్తున్నారు. 20 సెకన్లలో ఈ కోడి వ్యాపారం నుంచి ఎంత డబ్బు వచ్చిందో చెప్పాలి.

మీ సమయం ఇప్పుడు ప్రారంభమవుతుంది. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19...20. మీ సమయం ముగిసింది. మీకు సమాధానం తెలుసా? లెక్కల్లో వేగంగా ఉన్నవారికి 20 సెకన్లు సరిపోతాయి. కాస్త ఆలోచించాలి. ఎంత క్రిటికల్‌గా ఆలోచిస్తే.. అంత త్వరగా సమాధానం వస్తుంది.

మిమ్మల్ని గందరగోళానికి గురిచేసే రెండు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. అవునండి దీనికి రెండు సమాధానాలు ఉన్నాయి. 900 రూపాయలకు కొన్న చికెన్ 1200కి అమ్మితే 300 రూపాయల లాభం వస్తుందని కొందరు లెక్కలు వేస్తారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం మరొకటి ఉంది. మళ్లీ 1300కి కొన్నప్పుడు 100 రూపాయలు పోగొట్టుకున్నాడు. అంటే లాభం 200 రూపాయలుగా వేసుకోవాలి. మళ్లీ రూ.1600కి అమ్మగా మళ్లీ రూ.300 లాభం వచ్చింది. అక్కడ మొత్తం 500 రూపాయల లాభం వచ్చినట్టు లెక్క.

మరి కొందరు ఇలా కూడా లెక్కలు వేస్తారు. కోళ్లను కొనుక్కున్నందుకు ఖర్చు చేసిన డబ్బు 900+1300=2200 అని లెక్కిస్తారు. అమ్మిన డబ్బు 1200+1600=2800. కాబట్టి మీరు 2800లో 2200 కోల్పోతే 600 రూపాయల లాభం పొందుతారు.

అయితే మీ ప్రకారం కోడిని కొని అమ్మడం ద్వారా వచ్చిన లాభం 500 రూపాయలు లేదా 600 రూపాయలు. ఆలోచించి సమాధానం చెప్పండి. దీన్ని మీ స్నేహితులకు కూడా పంపండి. వారి సమాధానం ఏంటో చూద్దాం. ఇందులో రెండు సమాధానాలు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. నిజానికి కొన్నిసార్లు రెండు సమాధానాలు కూడా సరైనవిగానే ఉంటాయి.

WhatsApp channel