Tuesday Motivation: మన శరీరంలో ముఖ్యమైన భాగాలలో మెదడు ఒకటి. మెదడు ఉత్తమంగా పనిచేయాలంటే దానిపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మన దినచర్యలో కొన్ని అలవాట్లను జోడించడం ద్వారా మెదడుకు పదును పెట్టి భవిష్యత్తులో దానికి ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. మెదడు అంత ఆరోగ్యంగా ఉంటే మీ ఆయుష్షు కూడా అంతగా పెరుగుతుంది. మీ ఆలోచనలు అంతే చురుగ్గా ఉంటాయి. మెదడుకు పదును పెట్టేందుకు ఎలాంటి అలవాట్లు కావాలో తెలుసుకోండి.
మెదడుకు నిత్యం ఏదో ఒక కొత్త పనిని అప్పజెప్పాలి. కొత్త విషయాలను నేర్చుకునే మెదడు చురుగ్గా ఉంటుంది. కొత్త పుస్తకాన్ని చదవడం, కొత్త భాష నేర్చుకోవడం, కొత్త అభిరుచి ఫాలో అవ్వడం చేయాలి. ఇలా చేయడం వల్ల అభిజ్ఞా పనితీరును మెరుగుపరుచుకునేందుకు సహాయపడుతుంది.
ఏ పని చేసినా పంచేంద్రియాలను నిమగ్నం చేసి చేయాలి. అలా నిమగ్నం చేయడం వల్ల మెదడు చురుకుగా, అప్రమత్తంగా ఉంటుంది. దృష్టి, ధ్వని, స్పర్శ, రుచి, వాసన ఇవే పంచేంద్రియాలు. టెక్సాస్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలు ఇంద్రియాలను నిమగ్నం చేయడం వల్ల అభిజ్ఞా సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
ధ్యానం అనేది ఒక రిలాక్సేషన్ టెక్నిక్. ఇది మెదడుపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది. సాధారణ ధ్యానం మెదడుకు అభ్యాసం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. భావోద్వేగ నియంత్రణ వంటివి పెరుగుతాయి. ధ్యానం చేయడం వల్ల దృష్టిని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.
పంచదార తినడం ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిది. అధిక చక్కెర వినియోగం వల్ల బలహీనమైన అభిజ్ఞా పనితీరుతో ముడిపడి ఉంది. అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. శుధ్ధి చేసిన చక్కెర పదార్థాలు,మైదా పిండి వంటి వాటితో చేసిన ఆహారాలను తినడం మానేయాలి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడి కూడా చక్కెర వల్ల పెరుగుతుంది.
ప్రతి రోజూ ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల మెదడు చక్కగా పనిచేస్తుంది. నడక,ఈత, సైక్లింగ్ వంటి చర్యలు మెదడులో రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. మెదడులో కొత్త న్యూరాన్ల పెరుగుదలను ప్రొత్సహిస్తాయి. మానసిక ఆందోళనను తగ్గిస్తాయి.