Relationships: అబ్బాయిలు ఎక్కువగా ఇలాంటి అమ్మాయిలనే ఇష్టపడతారు, వీరి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు-boys mostly like girls like this for whom they are willing to do anything ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationships: అబ్బాయిలు ఎక్కువగా ఇలాంటి అమ్మాయిలనే ఇష్టపడతారు, వీరి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు

Relationships: అబ్బాయిలు ఎక్కువగా ఇలాంటి అమ్మాయిలనే ఇష్టపడతారు, వీరి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు

Haritha Chappa HT Telugu
Jun 28, 2024 01:34 PM IST

Relationships: కేవలం అందంతోనే అబ్బాయిలు అమ్మాయిలను ఇష్టపడతారని అనుకుంటారు. నిజానికి అందం మాత్రమే కాదు అమ్మాయిల్లో కనిపించే ఎన్నో లక్షణాలు కూడా అబ్బాయిలను ఆకర్షిస్తాయి.

అబ్బాయిలకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు?
అబ్బాయిలకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు? (Shutterstock)

అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిలను ఇష్టపడతారు అనే విషయం తరచూ చర్చల్లోకి వస్తుంది. దీని సమాధానం చాలా సింపుల్ అనుకుంటారు. ఏముంది… అందంగా ఉన్న అమ్మాయిలు అబ్బాయిలకు నచ్చుతారు అనుకుంటారు. నిజానికి అది కొంతమేరకే నిజం. అబ్బాయిలందరూ ఒకేలా ఉండరు. కేవలం అందం మాత్రమే కాదు, వారిలో మరికొన్ని గుణాలను కూడా అబ్బాయిలు ఇష్టపడతారు. సహజంగానే అబ్బాయి అయినా, అమ్మాయి అయినా అందమైన వ్యక్తిని చూసి అందరూ ఆకర్షితులవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ అందమైన వ్యక్తి తమ భాగస్వామి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇదంతా ఒక క్షణం ఆకర్షణ మాత్రమే. ఒకరిని నిజాయితీగా ఇష్టపడే విషయానికి వస్తే, అందంతో పాటు, ఒక వ్యక్తిని చాలా ఆకర్షణీయంగా మార్చే అనేక విషయాలు ఉన్నాయి. అబ్బాయిలు అమ్మాయిలను పడి చచ్చేంతగా ప్రేమించాలంటే ఆ అమ్మాయిల్లో కొన్ని గుణాలు ఉండాలి. ఆ గుణాలేంటో ప్రతి అబ్బాయి తెలుసుకోండి.

సెల్ఫ్ ఇండిపెండెంట్ గర్ల్స్

నేటి యుగంలో ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఇండిపెండెంట్ గా ఉండటం చాలా ముఖ్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా అబ్బాయిల ఎంపిక కూడా మారిపోయింది. ఇప్పుడు వారు ఇంటి పట్టున ఉండే అమ్మాయిలను కాకుండా స్వయంగా ఎదిగే ఉత్సాహం ఉన్న అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి అమ్మాయిలు ఆర్థికంగా బలంగా ఉంటారు. వారిలో మెచ్చూరిటీ, అవగాహన కలిగి ఉంటారు. ఎందుకంటే వారు బాహ్య ప్రపంచాన్ని చూస్తారు. ఆ ప్రపంచంలో ఎలా జీవించాలో వారికి తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అబ్బాయి, అమ్మాయిల మధ్య అవగాహన కూడా బలంగా ఉంటుంది.

చిన్న చిరునవ్వు

అందమైన చిరునవ్వు అమ్మాయిలకు పెద్ద ఆభరణం అని అబ్బాయిలు చెబుతుంటారు. చిరునవ్వుతో పలకరించే అమ్మాయిలను చూస్తూ అబ్బాయిలకు తెగ నచ్చేస్తారు. ముఖంపై ఎల్లప్పుడూ అందమైన చిరునవ్వును కలిగి ఉంటే చాలు అబ్బాయిలు వారిని వదిలిపెట్టలేరు. తరచూ గొడవలు పడే అమ్మాయిని, కోపంగా ఉండే వారిని, వాదనకు దిగే వారిని అబ్బాయిలు ఇష్టపడరు. ఇలాంటి వారి దగ్గర నుంచి అబ్బాయిలు దూరంగా పారిపోతారు.

మరొకరిని కాపీ కొట్టకుండా తమదైన సహజ శైలిలో జీవించే అమ్మాయిలను అబ్బాయిలు ఇష్టపడతారు. కొంతమంది అమ్మాయిలు ఫ్యాషన్ ట్రెండ్ కు అనుగుణంగా తమ లుక్స్ ను మార్చుకుంటూ ఉంటారు. ఆ లుక్ వారికి సూట్ అవుతుందో లేదో కూడా ఆలోచించరు. కొందరు అమ్మాయిలు తమ డ్రెస్సింగ్ స్టైల్ ను తమదైన శైలిలో డిసైడ్ చేసుకుంటారు. ఆ అమ్మాయిలకు తమకు ఏది మంచిదో, ఏది మంచిది కాదో నిర్ణయించుకోగలరు. అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలను మరింత ఆకర్షణీయంగా చూస్తారు.

ప్రతి ఒక్కరికీ వారి వారి వ్యక్తిగత స్పేస్ అవసరం. తమ భాగస్వామిని ప్రతి క్షణం ఎక్కడున్నారు? ఏం చేస్తారు? వంటి లెక్కలు అడిగే అమ్మాయిలను అబ్బాయిలు దూరం పెడతారు. రిలేషన్ షిప్ లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ తమ స్వేచ్ఛను మాత్రం కోరుకుంటారు. తమ భాగస్వామికి తగిన స్వేచ్ఛని ఇచ్చే అమ్మాయిలను అబ్బాయిలు పడతారు. పర్సనల్ స్పేస్ ఇచ్చే అమ్మాయిలను అబ్బాయిలు ఇష్టపడతారు.

తమకంటే చిన్నవారైనా, పెద్దవారైనా, అందరినీ గౌరవించే వ్యక్తిని అబ్బాయిలూ ఇష్టపడతారు. అబ్బాయిలు కూడా తమతో పాటు తమ కుటుంబం, స్నేహితులు, బంధువులను గౌరవించే అమ్మాయిలను ఇష్టపడతారు. అబ్బాయికి సంబంధించిన ప్రతి బంధాన్ని అమ్మాయి గౌరవిస్తే అలాంటి వారికోసం అబ్బాయిలు పడి చచ్చిపోతారు.

Whats_app_banner