Viral Video:గేదెకు బాలుడు ప్రపోజ్.. తరిమిన గేదె..వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!-boy proposes to buffalo to get into relationship video viral in social media ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Boy Proposes To Buffalo To Get Into Relationship Video Viral In Social Media

Viral Video:గేదెకు బాలుడు ప్రపోజ్.. తరిమిన గేదె..వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

HT Telugu Desk HT Telugu
Sep 17, 2022 09:27 PM IST

Viral Video: సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో ఓ బాలుడు గేదెకు ప్రపోజ్ చేయగా అది అతన్ని అక్కడి నుండి తరమడం అందరికి నవ్వు తెప్పిస్తుంది.

boy proposes to buffalo
boy proposes to buffalo

సోషల్ మీడియాలో ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగానూ, మరికొన్ని వీడియోలు షాకింగ్‌గానూ ఉంటాయి. ఎక్కువగా ఎనిమల్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది షాక్ అవుతున్నారు. ఈ ఫన్నీ వీడియోలో, ఓ బాలుగు గేదెకు ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ఇందులో ఆ గేదె రియాక్షన్ చూసి అందరూ నవ్వుకుంటున్నారు

సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిలు ప్రపోజ్ చేసుకుంటుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రిలేషన్ షిప్‌కు సంబంధించిన చాలా వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఈ వీడియాలో ఆ బాలుడు గేదెకు ప్రపోజ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫన్నీ వీడియో చాలా నవ్విస్తోంది.

ఈ వైరల్ వీడియోలో, పచ్చని పొలంలో ఆ బాలుడు గేదెకు ప్రపోజ్ చేయడం కనిపిస్తుంది. మోకాళ్ళు దించి, గేదెకు ఓ గడ్డి బొకే ఇచ్చి ప్రపోజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతన్ని చూడగానే ఈ గేదె ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. తర్వాత ఆ బాలుడు గేదె ముందు డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. దీని తర్వాత గేదె చేసింది చూసి మీరు నవ్వు ఆపుకోలేరు. బాలుడి డ్యాన్స్ చూసిన గేదె ఆ అక్కడి నుండి తరిమింది. దీంతో బాలుడు అక్కడి నుండి ఒకటే పరుగు. భయంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా పరిగెత్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఈ వీడియోను లైక్‌లతో ముంచెత్తారు . ఈ వీడియోను చూసి మీరు కూడా నవ్వుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం