Boti Curry recipe: బోటి కూర వండడం చాలా సులువు, టేస్టీగా ఇలా వండేయండి అన్నంలో కలుపుకుంటే అదిరిపోయే కర్రీ ఇది
Boti Curry recipe: మటన్ కూరని ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. మటన్ లోనే బోటి కూర కూడా ఒకటి. దీన్ని వండడం చాలా మందికి రాదు. నిజానికి బోటి కూరను చాలా టేస్టీగా సులువుగా ఉండొచ్చు.
బోటి కూర రెసిపీ ఎంతో సులువు. కానీ వాటిని చూడగానే వండడం కష్టమేమో అనుకుంటారు. ఎక్కువమంది వాటిని పరిశుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి తెచ్చుకుంటే చాలు. ఆ కూరను సులువుగా వండవచ్చు. ఇక్కడ బోటీ కూర రెసిపీ ఇచ్చాము. దీన్ని ఫాలో అయి చూడండి. వేడివేడి అన్నంలో ఈ బోటీ కూర ఇగురును కలుపుకుంటే అబ్బా ఏమి రుచి అనిపిస్తుంది. దీన్ని వండేందుకు పెద్దగా కష్టపడకండి, బోటీని తినడం ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బోటీ కూర వండేటప్పుడు పెద్ద టాస్క్.. దాన్ని శుభ్రపరచడమే. బోటీను ముక్కలుగా కోసి వేడి నీళ్లలో వేసి బాగా కడగాలి. ఆ తర్వాతే కూరను వండేందుకు సిద్ధం కావాలి.
బోటి కూర రెసిపీకి కావలసిన పదార్థాలు
బోటి - అరకిలో
అల్లం - ఒక ముక్క
వెల్లుల్లి రెబ్బలు - పది యాలకులు
మూడు - లవంగాలు
యాలకులు - మూడు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
ఉల్లిపాయలు - రెండు
నూనె - సరిపడినంత
బిర్యానీ ఆకు - ఒకటి
కొబ్బరిపొడి - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి - రెండు
బిర్యానీ ఆకు - ఒకటి
పసుపు - చిటికెడు
ధనియాల పొడి - ఒక స్పూను
గరం మసాలా - అర స్పూను
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
బోటి కూర రెసిపీ
1. బోటి ముక్కలను ముందుగా వేడి నీళ్లలో వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోండి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మూడు గ్లాసుల నీళ్లు, పావు స్పూను పసుపు, బోటీ ముక్కలను వేసి పది నిమిషాలు పెద్ద మంటపై ఉడికించండి.
3. ఇలా చేయడం వల్ల బోటీ పూర్తిగా శుభ్రపడుతుంది.
4. ఆ తర్వాత దాన్ని వడకట్టి బోటీ ముక్కలను పక్కన పెట్టుకోండి.
5. మిక్సీలో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
6. అలాగే ఉల్లిపాయలను కూడా మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి.
7. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నాలుగు స్పూన్ల నూనెను వేయండి.
8. అందులో బిర్యాని ఆకు, ఉల్లిపాయ ముద్దను వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించండి.
9. ఆ తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకున్న అల్లం మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపండి.
10. నిలువుగా కలిపిన పచ్చిమిరపకాయలను కూడా వేసి బాగా ఫ్రై చేయండి.
11. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న బోటీ ముక్కలను అందులో వేసి బాగా కలపండి.
12. పసుపు, కారం రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలపండి.
13. ఒక గ్లాసు నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించండి.
14. కుక్కర్ మూత తీసాక ఇంకా నీళ్లు అధికంగా ఉన్నట్టు అనిపిస్తే స్టవ్ మీద ఒక పది నిమిషాలు ఉడికించండి.
15. తర్వాత పైన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.
16. అంతే టేస్టీ టేస్టీ బోటీ కూర రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. చపాతీ, రోటీతో తిన్నా కూడా బాగుంటుంది.
చాలామంది బోటి కూరను వద్దనడానికి కారణం వాటిని శుభ్రపరిచే ప్రక్రియ. మీరు బోటీ కూడా ఎక్కడ కొంటారో అక్కడే చిన్న ముక్కలుగా కట్ చేయించుకుని ఇంటికి తీసుకురండి. ఆ తర్వాత వేడి నీళ్లలో వీటిని ఉడికించి చేతితోనే శుభ్రం చేసుకోండి. అంతే బోటీ ముక్కలు శుభ్రమైపోతాయి. వాటిని ఎంచక్కా కూరలా వండేసుకోవచ్చు.