Meal Maker Bhurji Recipe। మీల్ మేకర్ కర్రీని ఇలా చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది!
Meal Maker Bhurji Recipe: మీల్ మేకర్ మంచి శాకాహార ప్రోటీన్ పదార్థం. మాంసం తినని వారు ప్రోటీన్ల కోసం మీల్ మేకర్ తినవచ్చు. ఇక్కడ మీకు మీల్ మేకర్ భుర్జీ రెసిపీని అందిస్తున్నాం.
Recipe of the day: కోడిగుడ్డును గిలక్కొట్టి ఎగ్ భుర్జీలాగా చేసుకోవడం చాలా సింపుల్, ఎంతో రుచికరంగానూ ఉంటుంది. గుడ్డు తినని వారు అదే తరహాలో పనీర్ భుర్జీ చేసుకోవచ్చు. మీకు పనీర్ కూడా ఇష్టం లేకపోతే ఇక్కడ మరొక ప్రత్యామ్నాయ వంటకం ఉంది, అదే మీల్ మేకర్ భుర్జీ. దీనిని సోయా భుర్జీ అని కూడా పిలుస్తారు. ఈ రెసిపీ కూడా చాలా సులభం, నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు అందుబాటులో లేనపుడు మీల్ మేకర్ వండుకుంటారు. ఈ మీల్ మేకర్‌తో మీరు గ్రేవీ లేదా ఫ్రై లేదా ఫ్రైడ్ రైస్ ఇలా ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇది మంచి శాకాహార ప్రోటీన్ పదార్థం. మాంసం తినని వారు ప్రోటీన్ల కోసం మీల్ మేకర్ తినవచ్చు.
ఇక్కడ మీకు మీల్ మేకర్ భుర్జీ రెసిపీని అందిస్తున్నాం. సోయా గ్రాన్యూల్స్, శనగ పప్పు దీనిని తయారు చేస్తారు. దీనిని మీరు చపాతీ లేదా అన్నంతో సైడ్ డిష్ గా తినవచ్చు. మీల్ మేకర్ భుర్జీ రెసిపీని ఈ కింద చూడండి.
Meal Maker Bhurji Recipe కోసం కావలసినవి
- 1 కప్పు సోయా గ్రాన్యూల్స్
- 1/2 కప్పు శనగపప్పు
- 1 పెద్ద ఉల్లిపాయ
- 1 టొమాటో
- 1-2 పచ్చిమిర్చి
- 1 స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్
- 2 టేబుల్ స్పూన్ల నూనె
- 1 స్పూన్ కారం
- 2 స్పూన్ ధనియాల పొడి
- 1/2 స్పూన్ పసుపు
- 1 tsp జీలకర్ర పొడి
- 1/4 టీస్పూన్ ఇంగువ
- 1 ఎండు మిరపకాయ
- ఉప్పు రుచికి తగినంత
- 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు
- 1 స్పూన్ నిమ్మరసం
మీల్ మేకర్ భుర్జీని ఎలా తయారు చేయాలి
- ముందుగా శనగపప్పును కనీసం అరగంట పాటు నానబెట్టండి. అలాగే మీల్ మేకర్లను కూడా నీటిలో నానబెట్టి, ఆపై నీటిని పిండేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
- మీకు శనగపప్పు మెత్తగా ఉండాలని కోరుకుంటే పప్పును కుక్కర్ లో వేసి సరిపడా నీళ్లు పోసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. (నానబెడుతున్నప్పుడు ఉడికించడ ఐచ్ఛికం)
- ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేసి, ముందుగా ఎండు మిరపకాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి అపారదర్శకమయ్యే వరకు వేయించాలి.
- తరువాత ఇంగువ, పచ్చిమిర్చి వేసి వేయించాలి, ఆపై మీల్ మేకర్ కూడా వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
- ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటో వేసి కాసేపు వేయించాలి. ఆపై నానబెట్టిన/ ఉడికించిన శనపప్పును వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసి ప్రతిదీ బాగా కలపండి. అవసరమైతే, మీరు కొద్దిగా నీరు కలపవచ్చు.
- ఇప్పుడు భుర్జీని తక్కువ మంట మీద కొద్దిసేపు ఉడికించి, చివరగా నిమ్మరసం పిండండి.
అంతే, .మీల్ మేకర్ భుర్జీ రెడీ.
సంబంధిత కథనం