Boondi Curry: టైం లేనప్పుడు ఇలా ఐదు నిమిషాల్లో బూందీ కూర వండేసుకోండి, అన్నంలో కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది-boondi curry recipe in telugu know how to make this curry in five minutes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Boondi Curry: టైం లేనప్పుడు ఇలా ఐదు నిమిషాల్లో బూందీ కూర వండేసుకోండి, అన్నంలో కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది

Boondi Curry: టైం లేనప్పుడు ఇలా ఐదు నిమిషాల్లో బూందీ కూర వండేసుకోండి, అన్నంలో కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Feb 04, 2025 05:30 PM IST

Boondi Curry: సమయం లేనప్పుడు ఐదు నిమిషాల్లో బూందీ కూరను వండేసుకోవచ్చు. ఇది తినేందుకు టేస్టీగా ఉంటుంది. అన్నంలో చపాతీలో కూడా తినవచ్చు. బూందీ కూర రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

బూందీ కర్రీ రెసిపీ
బూందీ కర్రీ రెసిపీ (Godavari Konaseema Ruchulu/Youtube)

బూందీ కూర ఎప్పుడైనా తిన్నారా? దీన్ని రుచి చూశారంటే వదల్లేరు. అంత టేస్టీగా ఉంటుంది. సమయం లేనప్పుడు ఐదు నిమిషాల్లో అయిపోయే కూర ఇది. ఇంట్లో బూందీ రెడీగా ఉంటే చాలు... ఈ కూరను ఐదు నిమిషాల్లో వండి లంచ్ బాక్స్ పెట్టవచ్చు. దీన్ని అన్నంలో కలుపుకొని తిన్నా చపాతీతో తిన్నా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది. స్పైసీగా కావాలనుకుంటే దీన్ని పచ్చిమిర్చి జోడించి స్పైసీగా చేసుకోవచ్చు. ఏదేమైనా బూందీ కూర రెసిపీ చాలా సులువు.

yearly horoscope entry point

బూందీ కూర రెసిపీకి కావలసిన పదార్థాలు

బూంది - ఒక కప్పు

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

కారం - పావు స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

నూనె - ఒక స్పూన్

బూందీ కూర రెసిపీ

1. ఇంట్లో బూందీ రెడీగా ఉంటే చాలు ఐదు నిమిషాల్లో కూరను వండేసుకోవచ్చు.

2. దీనికోసం ముందు ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. అందులో ఉల్లిపాయలను వేసి బాగా వేయించాలి.

5. అవి రంగు మారేవరకు వేయించాక పచ్చిమిర్చి తరుగును కూడా వేయాలి.

6. అలాగే ఉప్పు, పసుపును వేసి బాగా కలుపుకోవాలి.

7. గుప్పెడు కరివేపాకులను కూడా వేసి బాగా కలపాలి.

8. ఉల్లిపాయలు బాగా వేగాక అర గ్లాసు నీటిని వేయాలి.

9. నీరు సలసలా మరుగుతున్నప్పుడు బూందీని వేసుకోవాలి.

10. మీకు స్పైసీగా కావాలనుకుంటే కారాన్ని కూడా వేసుకోవచ్చు.

11. హై ఫ్లేమ్ మీద నీరు త్వరగా ఇంకిపోయేలా ఉడికించాలి.

12. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. అంతే టేస్టీ బూందీ కూర రెడీ అయినట్టే.

13. ఒక్కసారి ఇలా చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో.

ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు లేదా ఇంట్లో పిల్లలకి లంచ్ బాక్స్ చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా బూందీ కూర వండండి. అద్భుతంగా ఉంటుంది. బూందీని శెనగపిండితోనే చేస్తారు. కాబట్టి కూరగా కూడా ఇది బాగుంటుంది.

బూందీలో కొన్నిసార్లు జీడిపప్పులు, వేరుశనగ పలుకులు కూడా వస్తాయి. వాటిని కూడా కూరలో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. బూందీ కూర వండాలంటే పూర్తిగా బూందీ మాత్రమే ఉన్న ది తీసుకోవాలి. కొంతమంది కారపూసలు వంటివి కూడా బూందీలో కలుపుతారు. అలాంటిది కాకుండా కేవలం బూందీని తీసుకుంటే ఈ బూందీ కూర వండడం సులభంగా మారుతుంది. ఈ బూందీ కూర ఎంత తిన్నా బోర్ కొట్టదు. ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్లాల్సిన సమయం వస్తే ఇలాంటి కూరలు త్వరగా వండేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం