Boiled Egg Burji: ఉడికించిన గుడ్లతో ఎగ్ బుర్జీ చేసి చూడండి, వెరీ టేస్టీ రెసిపీ
Boiled Egg Burji: ఎగ్ బుర్జీ అనగానే కోడిగుడ్డు కొట్టి చేసే వంటకమే అనుకుంటారు. కానీ కోడిగుడ్లను ఉడికించి సన్నగా తరిగి కూడా టేస్టీ ఎగ్ బుర్జీ చేయవచ్చు. దీని రెసిపీ చాలా సులువు. ఇది అన్నంలో, చపాతీల్లోకి అదిరిపోతుంది.
గుడ్డుతో చేసే ఏ రెసిపీ అయినా టేస్టీగానే ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. పిల్లలకే కాదు పెద్దలకు కూడా నచ్చేలా ఉంటుంది ఈ ఉడికించిన ఎగ్ బుర్జీ. గుడ్లను ఉడకబెట్టి సన్నగా తరిగి ఈ రెసిపీని చేస్తారు. ఈ రెసిపీలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీ రోటీ, పరాఠాలతో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అన్నంలో కలుపుకున్న ఎగ్ రైస్‌లా టేస్టీగా ఉంటుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
ఉడకబెట్టిన ఎగ్ బుర్జీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ఉడికించిన కోడి గుడ్లు - నాలుగు
ఉల్లిపాయలు - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
అల్లం - చిన్న ముక్క
టొమాటోలు - ఒకటి
ధనియాల పొడి - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు స్పూన్లు
వెల్లుల్లి - అయిదు రెబ్బలు
కశ్మీరీ కారం ఒక స్పూను
గరం మసాలా - అర స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
ఉడకబెట్టిన ఎగ్ బుర్జీ రెసిపీ
- ఈ ఎగ్ బుర్జీ వండడానికి ముందే కోడి గుడ్లను ఉడకబెట్టి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
- అందులో కాస్త వెన్న కూడా వేసుకుని కూర రుచి అదిరిపోతుంది.
- ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు వేసి కలుపుకోవాలి.
- అల్లం వెల్లుల్లి పేస్టును కూడా బాగా కలుపుకోవాలి.
- ఆ మిశ్రమంలో టమాటోలు సన్నగా తరిగి వేయాలి.
- అందులో ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
- ధనియాల పొడి, కశ్మీరీ కారం, గరం మసాలా వేసి కాసేపు చిన్న మంట మీ ఉడికించుకోవాలి.
- ఇప్పుడు మీ మిశ్రమంలో ముందుగా తరిగి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి బాగా కలుపుకోవాలి.
- చిన్న మంట మీద పది నిమిషాలు వేయించాలి. తరువాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
- దీన్ని కేవలం చపాతీ, రోటీలతోనే కాదు ఒక కప్పులో వేసి స్నాక్స్ లా తినేయచ్చు. రుచి అదిరిపోతుంది.
గుడ్డు పగులగొట్టి చేసే బుర్జీ కన్నా ఇలా గుడ్డు ఉడికించి చేసే బుర్జీలో ఎన్నో పోషకాల ఉంటాయి. మన శరీరంలో తయారుకచేసుకోలేని ముఖ్యంగా అమైనో ఆమ్లాలు గుడ్డు ద్వారా పొందవచ్చు. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ పోషకాల కోసం రోజుకో గుడ్డు అయినా తినాలి. లేదా గుడ్డుతో చేసి రెసిపీలను తినడం మంచిది. ఇక్కడ ఇచ్చిన ఎగ్ బుర్జీలో పోషకాలు అధికంగానే ఉంటాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇంట్లోని వారందరికీ ఇది నచ్చుతుంది.
టాపిక్