BMW X5 xDrive 30d M Sport । భారత్‌లో బీఎండబ్ల్యూ నుంచి అత్యంత ఖరీదైన SUV ఇదే!-bmw launched x5 xdrive 30d m sport top spec suv in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Bmw Launched X5 Xdrive 30d M Sport Top Spec Suv In India

BMW X5 xDrive 30d M Sport । భారత్‌లో బీఎండబ్ల్యూ నుంచి అత్యంత ఖరీదైన SUV ఇదే!

HT Telugu Desk HT Telugu
Jul 28, 2022 03:57 PM IST

లగ్జరీ కార్ల తయారీదారు BMW తాజాగా భారత మార్కెట్లో xDrive 30d M స్పోర్ట్ పేరుతో మరొక ఖరీదైన SUVని ప్రవేశపెట్టింది. దీని ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకోండి.

BMW X5 xDrive 30d M Sport
BMW X5 xDrive 30d M Sport

జర్మన్ కార్ మేకర్ BMW నిశ్శబ్దంగా తమ M స్పోర్ట్ ట్రిమ్‌లో మరొక కొత్త కొత్త వేరియంట్‌ X5 xDrive 30d తీసుకొచ్చింది. తాజాగా భారత మార్కెట్లో విడుదలైన ఈ కార్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 97.9 లక్షలుగా ఉంది. అంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న X5 డీజిల్ టాప్-ఎండ్ వేరియంట్ కంటే కూడా ఇది రూ. 3 లక్షలు ఎక్కువ.

సరికొత్త BMW X5 xDrive 30d M Sport కారులో పవర్‌ట్రెయిన్ ఇప్పటికీ అలాగే ఉంది. అయితే డిజైన్ పరంగా కొన్ని మార్పులు ఉన్నాయి. ప్యాకేజీలో కొత్త ఫ్రంట్ బంపర్, రియర్ డిఫ్యూజర్, టెయిల్‌పైప్స్, M స్పోర్ట్ బ్రేక్ కాలిపర్స్, M-స్పెసిఫిక్ కార్ కీ, M స్పోర్ట్ లోగోలు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పొడిగించిన డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (DTC), హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ ప్యాడిల్ షిఫ్టర్‌లు, లాంచ్ కంట్రోల్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ మొదలైనవి ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్‌లో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, సంజ్ఞతో నియంత్రణ, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటో స్టార్ట్-స్టాప్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, అడాప్టివ్ LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, 16-స్పీకర్ హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్ కెపాసిటీ

X5 xDrive 30d M స్పోర్ట్స్ ట్రిమ్‌లో 3.0-లీటర్ ట్విన్-పవర్ సిక్స్-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 265 hp శక్తిని, 620 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ను 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. అలాగే xDrive సిస్టమ్ ద్వారా మొత్తం నాలుగు చక్రాలపై కంట్రోల్ ఉంటుంది. ఈ SUV పనితీరు ఇతర X5 ట్రిమ్‌ల మాదిరిగానే ఉంటుంది. ఇది కేవలం 5.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.

ఈ టాప్-స్పెక్ వేరియంట్ BMW X5 xDrive 30d M స్పోర్ట్ M Sport బాడీ కిట్, అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. పైథోనిక్ బ్లాక్, మినరల్ వైట్ , పైథోనిక్ బ్లూ అనే మూడు కలర్ స్కీములలో ఈ కార్ లభిస్తుంది. ఈ కారు భారతదేశంలో ఆడి Q7, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, వోల్వో XC90 వంటి కార్లకు పోటీనిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్