Saturday Motivation: రోజుకు కేవలం పది సెకన్లు ఈ పనిచేయండి చాలు, మానసికంగా శారీరకంగా ఎంతో ఆరోగ్యం
Saturday Motivation: శారీరక, మానసిక ఆరోగ్యం కోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించాలి. ఆ సమయంలో శంఖాన్ని ఊదితే ఎంతో మంచిది. శంఖాన్ని ప్రతిరోజూ ఊదితే ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి.
Saturday Motivation: శంఖం... ఇది ఒక సముద్రపు షెల్. హిందువులకు శంఖం ఎంతో పవిత్రమైనది. దీన్ని పూజల్లో అధికంగా వాడుతూ ఉంటారు. అయితే శంఖాన్ని స్వచ్ఛతకు, శుభానికి చిహ్నంగా భావిస్తారు. ఇది సానుకూల ప్రకంపనలను వ్యాప్తి చెందుతుంది.ఆ సానుకూల ప్రకంపనలు మీలో కూడా కలగాలంటే ప్రతి రోజూ ఉదయం శంఖాన్ని పది సెకన్ల పాటూ ఊదాలి. దీని వల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
హిందూ మతంలో శంఖం విష్ణువుతో సంబంధాన్ని కలిగి ఉంటుందాన్ని చెబుతారు.శంఖాన్ని ఊదడం వల్ల దాని నుంచి వచ్చే శబ్ధం చుట్టూ ఉన్న పర్యవరణాన్ని శుద్ధి చేస్తుంది. గాలిలోని మలినాలను శుభ్రపరుస్తుంది. సానుకూల శక్తిని నింపుతుంది. శంఖం ఊదడం చాలా సులువైన పద్ధతే. దీని ఊదడం వెనుక ఎంతో సైన్స్ కూడా దాగి ఉంటుంది.
ప్రతిరోజూ పది సెకన్ల పాటూ శంఖాన్ని ఊదడం వల్ల మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. శంఖం నుంచి వచ్చే ధ్వని మీ చుట్టు పక్కల వారిపై శుధ్దిని కలిగిస్తుంది. దీని నుంచి వచ్చే కంపనాలు మీ చుట్టూ రక్షిత ప్రకాశాన్ని ఏర్పరుస్తాయి. శంఖం ప్రతిరోజూ ఊదే వారు ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా, శాంతియుతంగా జీవించడానికి సహాయపడుతుంది.
శంఖాన్ని ఊదడం వల్ల ముక్కుతో వీలైనంతగా గాలి పీల్చి ఆ తరువాత నోటితో ఊదుతారు. దీనివల్ల శ్వాసకోశ వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు శంఖం ఊదడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.
శంఖం ఊదడం వల్ల వారిలో సంకల్పబలం, ధైర్యం, ఆశావాదం వంటివి కలుగుతాయి.శంఖం ఊదడం వల్ల ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఆధునిక సైన్స్ చెబుతున్న ప్రకారం ప్రతిరోజూ శంఖం ఊదడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. గొంతు సమస్యలు రాకుండా ఇది కాపాడుతుంది.
ప్రతిరోజూ శంఖం ఊదిన ఇల్లు ఎంతో శుభప్రదం. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శంఖం ధ్వని ఇంట్లోని వారందరికీ ఎంతో మేలు చేస్తుంది.
శంఖం ఊదేవారికి చర్మం యవ్వనంగా ఉంటుంది. ముఖంపై ఉండే ముడతలు, గీతలు రాకుండా ఉంటాయి. నోటి కండరాలపై ఒత్తిడి పడి అక్కడ ముడతలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా పురుషులు ప్రతిరోజూ శంఖం ఊదడం మంచిది. ఇది వారిలో ప్రొస్టేట్ గ్రంధికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. డిప్రెషన్ రాకుండా కాపాడడంలో కూడా ఇది ఎంతో బాగా పనిచేస్తుంది.