Black Pepper For Weight loss: త్వరగా బరువు తగ్గాలా? అయితే నల్ల మిరియాలను ఈ 7 రకాలుగా మీ డైట్లో చేర్చుకోండి!-black pepper for weight loss how black pepper can help you lose weight ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Black Pepper For Weight Loss: త్వరగా బరువు తగ్గాలా? అయితే నల్ల మిరియాలను ఈ 7 రకాలుగా మీ డైట్లో చేర్చుకోండి!

Black Pepper For Weight loss: త్వరగా బరువు తగ్గాలా? అయితే నల్ల మిరియాలను ఈ 7 రకాలుగా మీ డైట్లో చేర్చుకోండి!

Ramya Sri Marka HT Telugu

Black Pepper For Weight loss: బరువు తగ్గాలనుకునే వారికి నల్ల మిరియాలు చాలా బాగా సహాయపడతాయి. ఎందుకంటే ఇందులో శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించే లక్షణాలు మెండుగా ఉంటాయి. బరువు తగ్గడం కోసం నల్లమిరియాలను 7 రకాలుగా తీసుకోవాలి. ఎలాగో తెలుసుకుందాం పదండి.

బరువు తగ్గాలంటే నల్ల మిరియాలను తప్పక తినండి

బరువు తగ్గాలంటే కఠినమైన వ్యాయామాలతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంటే తక్కువ తినాలని కాదు సరైన పొషకాలతో నిండిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. అంతేకాదు.. కొన్ని రకాల మసాలా దినుసులను కూడా మీ డైట్లో చేర్చుకోవాలి.అవును.. కొన్ని రకాల మసాలా దినుసులు శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించేందుకు చాలా బాగా సహాయపడతాయి. అందులో ముఖ్యమైనవి నల్ల మిరియాలు.

నల్ల మిరియాలు కేవలం సాధారణ మసాలా దినుసు అనుకుంటే మీరు పొరపడ్డట్టే. ఘనమైన వాసన, విభిన్న రుచితో పాటు ఇందులోని పైపరిన్ అనే చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చాలా త్వరగా మంచి ఫలితాలను చూపిస్తాయి. దీనిలోని బయో యాక్టివ్ పదార్థాలు శరీర బరువును చాలా త్వరగా తగ్గించగలరు. ఇందుకోసం మీరు ఏం చేయాలి? నల్ల మిరియాలను డైట్లో ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

బరువు తగ్గడానికి నల్ల మిరియాలు ఎలా ఉపయోగపడతాయి:

  • నల్లమిరియాలు బరువు తగ్గించడానికి ప్రధాన కారణం ఇందులోని పైపెరిన్. ఇది శరీరంలోని కొవ్వు కణాలను విచ్చిన్నతను పెంచుతుంది.
  • నల్ల మిరియాలలోని ధర్మోజెనిసిసన్ ప్రేరేపిస్తుంది. బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది.
  • వీటిలోని ఘాటైన వాసన, రుచి ఆకలిని సహజంగా అణిచివేస్తాయి. అతిగా తినడాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయి.
  • నల్లమిరియాలోని పైపెరిన్, అడిపోజెనిసిస్‌ను నిరోధించడం ద్వారా, కొత్త కొవ్వు కణాల ఏర్పాటును తగ్గించడం ద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నివారించడంలో పాత్ర పోషిస్తుంది. ఈ ప్రక్రియ బరువు పెరుగుటను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • దీని క్రియాశీల సమ్మేళనం, పైపెరిన్, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది, కొవ్వు నిల్వను ప్రేరేపించే చక్కెర స్పైక్‌లను తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ను స్థిరీకరించడం, చక్కెర కోరికలను అరికట్టడం ద్వారా, నల్ల బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

బరువు తగ్గడానికి నల్ల మిరియాలు ఎలా తినాలి?

మీరు బరువు తగ్గడానికి నల్ల మిరియాలను తినాలనుకుంటే, మీ దినచర్యలో దీన్ని చేర్చుకోవడానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

1. గోరువెచ్చని నీటితో నల్ల మిరియాలు:

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ½ టీస్పూన్ తాజాగా రుబ్బిన నల్ల మిరియాలు వేసి కలుపుకుని, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.

2. నల్ల మిరియాలు, నిమ్మకాయ:

గోరువెచ్చని నీటిలో ½ టీస్పూన్ నల్ల మిరియాలు, 1 టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు తేనె కలపాలి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతి రోజూ భోజనానికి ముందు దీన్ని త్రాగాలి.

3. బ్లాక్ పెప్పర్ టీ:

ఒక గిన్నెలో నీటిని మరిగించి దాంట్లో చిటికెడు నల్ల మిరియాల పొడి,కొద్దిగా అల్లం వేసి మరిగించండి. తరువాత దీన్ని వడకట్టి, చల్లారిన తర్వాత రుచి కోసం తేనె లేదా నిమ్మకాయను కలిపి తాగండి.

4. గ్రీన్ టీతో నల్ల మిరియాలు:

గ్రీన్ టీ తయారు చేసుకుని దాంట్లో చిటికెడు నల్ల మిరియాల పొడిని జోడించండి. ఉత్తమ ఫలితాల కోసం రోజుకు ఒకటి లేదా రెండుసార్లు త్రాగండి.

5. నల్ల మిరియాలు, పెరుగు:

పెరుగు మీద ½ టీస్పూన్ నల్ల మిరియాల పొడి చల్లుకుని ప్రతిరోజూ స్నాక్‌గా లేదా భోజనం తర్వాత జీర్ణక్రియను పెంచేదిగా తీసుకోండి. ఇది శరీర బరువును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది.

6. పసుపు పాలతో నల్ల మిరియాలు:

గోరువెచ్చని పసుపు పాలలో చిటికెడు నల్ల మిరియాలు వేసి నిద్రపోయే ముందు త్రాగాలి.

7. భోజనంలో నల్ల మిరియాలు చల్లుకోవడం:

సలాడ్లు, సూప్‌లు, గ్రిల్డ్ కూరగాయలు, గుడ్లు మరియు స్మూతీలకు నల్ల మిరియాలు జోడించండి. రోజువారీ వంటకాలకు మసాలాగా దీనిని ఉపయోగించండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం