Diabetes: వంటగదిలో ఉన్న ఈ ఒక్క పదార్థం మీ శరీరంలోని మధుమేహాన్ని తగ్గించేస్తుంది, దీన్ని ఎలా తినాలంటే
Diabetes: షుగర్ వ్యాధి వచ్చిందంటే మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. మీ ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చడం వల్ల డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవచ్చు. అందులో ముఖ్యమైనది బిర్యానీ ఆకులు.
డయాబెటిస్ ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, రోజంతా కూర్చొనే ఉండడం, వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరం అనేక రోగాల బారిన పడుతోంది. ఈ వ్యాధులలో ఒకటి డయాబెటిస్. షుగర్ ఉన్నప్పుడు దాన్ని అదుపులో ఉంచుకోవడానికి మందులతో పాటు కొన్ని హోం రెమెడీస్ ను ప్రయత్నిస్తుంటారు. నిజానికి మన వంటగదిలో కొన్ని మసాలా దినుసులు ఉన్నాయి, వీటిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వాటిల్లో ఒకటి బిర్యానీ ఆకులు. ఇవి డయాబెటిస్‌ను కొంతవరకు నియంత్రించడంలో కూడా బాగా సహాయపడతాయి. కాబట్టి బిర్యానీ ఆకులు మీ రక్తంలో చక్కెర నిర్వహణకు ఎలా సహాయపడతాయో తెలుసుకోండి.
బిర్యానీ ఆకులతో ఉపయోగం
ఆహారం సువాసనను పెంచేందుకు బిర్యానీ ఆకులు ఎంతో సహాయపడతాయి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి చాలా సహాయపడుతాయివి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బిర్యానీ ఆకుల సహాయంతో చక్కెరను శరీరం నుంచి పూర్తిగా తొలగించలేము. కానీ చక్కెర పెరగకుండా నియంత్రించడానికి ఇది చాలా మంచి మార్గం. ఆహారం నియంత్రించడంతో పాటూ, రోజూ శారీరక వ్యాయామాలను చేయడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. జర్నల్ ఆఫ్ బయోకెమికల్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులు బిర్యానీ ఆకులను ఆహారంలో చేర్చుకోవాలి. వారిలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు తగ్గేలా చేస్తాయి.
ఎలా తినాలి?
బిర్యానీ ఆకులను తరచుగా వంటగదిలో ఆహారం రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే, ఇది కాకుండా, మీరు దీనిని అనేక మార్గాల్లో కూడా మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి మేలు చేసే మసాలా. కాబట్టి మీరు దీన్ని మీ రోజువారీ టీలో చేర్చవచ్చు. ఇది టీ రుచిని పెంచడమే కాకుండా మీకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది కాకుండా షుగర్ పేషెంట్లు బిర్యానీ ఆకుల నీటిని డైట్ లో చేర్చుకోవడం మంచిది. దీని కోసం, రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో బిర్యానీ ఆకును నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే తేలికగా వేడి చేసి తాగాలి. ఇలా బిర్యానీ ఆకులను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో ఎంతో సహాయపడతాయి.
బిర్యానీ ఆకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఇ, విటమిన్ సి, కెరటోనాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. బిర్యానీ ఆకులు తినడం వల్ల పొట్ట, కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో బిర్యానీ ఆకులు ముందుంటాయి.
మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ బిర్యానీ ఆకులతో టీ కాచుకుని తాగడం మంచిది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కూడా దీన్ని తాగడం ఎంతో ఉత్తమం. శరీరంలో ఉన్న విష వ్యర్థాలను తొలగించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఎక్కువ. కాబట్టి వీటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గే అవకాశం ఉంది.