Health Benefits of Bird Dog Pose : వెన్ను నొప్పి పోవాలన్నా.. కోర్ హెల్త్ కోసం అయినా బర్డ్ డాగ్ పోజ్ వేసేయండి..
Bird Dog Pose for Back Pain Relief : చాలామంది వెన్నునొప్పితో నిరంతరం బాధపడుతూ ఉంటారు. పని వల్లనో.. ఒత్తిడి వల్లనో.. వయసు ప్రభావం.. ఇలా ఏదైనా దీనికి కారణం కావొచ్చు. అయితే బర్డ్ డాగ్ భంగిమ చేస్తూ.. ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు యోగా నిపుణులు. అంతేకాకుండా దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు.
Health Benefits of Bird Dog Pose : బాలీవుడ్‌లో ఫిట్‌గా ఉండే నటీమణులలో శిల్పాశెట్టి ఒకరు. ఆమె తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫిట్‌నెస్ వీడియోలను పంచుకుంటుంది. అయితే ఈ సాగరకన్య తాజాగా.. డాగ్ బర్డ్ పోజ్ వ్యాయామం గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ భంగిమ గురించి మనం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
ట్రెండింగ్ వార్తలు
ఎందుకంటే ఇది మీ వెన్నునొప్పిని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా.. మీ కోర్, గ్లూట్స్, భుజాలు, చేతులను బలపరుస్తుంది. అంతేకాకుండా ఇది మీ శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో పని చేస్తుంది. మీరు పనిలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా మీరు ఈ వ్యాయామాన్ని చాలా సులభంగా చేసేయవచ్చు. అసలు ఈ బర్డ్ డాగ్ భంగిమ అంటే ఏమిటి? దీనివల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటి? దీనిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బర్డ్ డాగ్ భంగిమ అంటే ఏమిటి?
బర్డ్ డాగ్ పోజ్ అనేది మన సమతుల్యతను మెరుగుపరిచే ఒక సాధారణ కోర్ వ్యాయామం. ఇది వెన్నెముకకు చాలా మంచిది. ఈ వ్యాయామం నడుము నొప్పి నుంచి మీకు కచ్చితంగా ఉపశమనం కలిగిస్తుంది. ఈ వ్యాయామ భంగిమ.. మీ కోర్, తుంటి, వెనుక కండరాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ భంగిమ ప్రభావం మొత్తం శరీరంపై ఉంటుంది.
అంతేకాకుండా ఈ వ్యాయామం వృద్ధులతో సహా అన్ని వయసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వెన్నెముకను సరిచేయడానికి, నడుము నొప్పిని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.
బర్డ్ డాగ్ పోజ్ ఎలా చేయాలంటే..
* బర్డ్ డాగ్ పోజ్ చేయడానికి.. ముందు మీరు మీ చేతులు, కాళ్లపై ఉండేలా చూసుకోండి. డాగ్ భంగిమలో ఉండాలి.
* ఇప్పుడు ఈ వ్యాయామం చేయడానికి.. కుడి చేయి, ఎడమ కాలుని పైకి లేపి.. నేలకి సమాంతరంగా ఉంచండి.
* మీ సమతుల్యతను కాపాడుకోవడానికి.. మీరు మీ కోర్ కండరాలను గట్టిగా ఉంచండి. గాలిలో లేపిన చేయి, కాలుతో ఒక చిన్న బర్డ్ వేవ్ ఇవ్వండి. అనంతరం.. ఎడమ చేయి, కుడి కాలుతో చేయండి. ఈ సమయంలో మీ కటిని ఒక వైపునకు వంచకుండా చూసుకోండి.
బర్డ్ డాగ్ వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు
* నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. బర్డ్ డాగ్ వ్యాయామం మీ కండరాలకు చాలా మంచిది. ఇది మీకు స్థిరత్వం ఇస్తుంది. ఇది ఎరెక్టస్ స్పైనే, రెక్టస్ అబ్డోమినిస్, గ్లుట్స్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది.
* వెన్ను సమస్యలు, హైపర్‌మొబిలిటీ ఉన్నవారికి ఈ వ్యాయామం మంచిది. ఇది మీ బ్యాలెన్స్, భంగిమను మెరుగుపరుస్తుంది.
* వ్యాయామం చేస్తున్నప్పుడు.. బర్డ్ డాగ్ భంగిమ నుంచి ఎక్కువ ప్రయోజనం పొందడానికి కండరాల కదలికల కంటే మీ శరీరం అంతటా కదిలేలా చేయండి.
* ఇది నడుము నొప్పిని తగ్గిస్తుంది. వెన్నునొప్పిని నయం చేయడానికి ఇది గొప్ప వ్యాయామం. అంతేకాకుండా బలమైన కోర్ని అందిస్తుంది.
* మీరు వర్కవుట్ తర్వాత లేదా వ్యాయామానికి ముందు బర్డ్ డాగ్ భంగిమ వ్యాయామం చేయవచ్చు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ వ్యాయామం చేయవచ్చు. ఇది దిగువ వీపునకు, మీ వెన్నెముకకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సంబంధిత కథనం