Biphasic Sleep: పగటిపూట నిద్ర మంచిదే.. బైపాసిక్ స్లీప్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?-biphasic sleep daytime sleep is good do you know the benefits of it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Biphasic Sleep: పగటిపూట నిద్ర మంచిదే.. బైపాసిక్ స్లీప్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Biphasic Sleep: పగటిపూట నిద్ర మంచిదే.. బైపాసిక్ స్లీప్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Ramya Sri Marka HT Telugu
Published Feb 08, 2025 12:00 PM IST

Biphasic Sleep: రాత్రి సమయంలోనే కాదండీ.. పగలు నిద్రపోవడం కూడా మంచిదేనట. ఇలా నిద్రపోవడంలో పలు రకాలున్నాయట. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మానసికంగా, శారీరకంగా ఎన్నో ప్రయోజనాలను సమకూరుస్తుందట.

పగటిపూట నిద్ర మంచిదే.. బైపాసిక్ స్లీప్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
పగటిపూట నిద్ర మంచిదే.. బైపాసిక్ స్లీప్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

బైఫాసిక్ స్లీప్ వల్ల శరీరానికి, మనస్సుకు ఎంతో ప్రయోజనవంతంగా ఉంటుందట. 24 గంటల సమయంలో కేవలం ఒకసారి మాత్రమే కాకుండా రెండు సార్లుగా నిద్రపోవడాన్నే బైపాసిక్ స్లీప్ అంటారు. అంటే రాత్రి సమయాల్లో నిద్రించే 6-7 గంటల నిద్రతో పాటు పగటి పూట ఒక గంట కంటే తక్కువ సమయం నిద్రపోవాలట. ఇలా చేయడం వల్ల మెమొరీ మెరుగై, మీలో ఉత్పాదకత వక్తి పెరుగుతుంది. ఇంకా మూడ్ స్థిరంగా ఉండి, పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.

బైపాసిక్ స్లీప్ వల్ల మరిన్ని ప్రయోజనాలు:

ఉత్పాదకత పెరగడం:

మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. దృష్టితో పాటు అప్రమత్తతను మెరుగుపరుస్తుంది. నీరసంగా ఉండకుండా మీలో ఉత్పాదకత శక్తిని కూడా పెంచుతుంది.

మూడ్ మెరుగుపరచడం:

కొద్దిసేపు అలా నాప్ వేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి ఎమోషనల్ గా అదుపులో ఉండేందుకు తోడ్పడుతుంది.

ఆరోగ్యం మెరుగుపడటం:

గుండె జబ్బుల రిస్క్ తగ్గించి, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాకుండా జీవక్రియలను అదుపులో ఉంచుతుంది.

బైపాసిక్ స్లీప్‌ను ఎలా ప్రాక్టీస్ చేయాలి?

ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి:

రాత్రి సమయాల్లో ఆరు నుంచి ఏడు గంటల సేపు నిద్రపోయేందుకు ప్లాన్ చేయండి. దాంతోపాటుగా మధ్యాహ్న సమయంలో ఒక గంటలోపు నిద్రపోయేందుకు సరిపడ సమయాన్ని కేటాయించుకోండి.

క్రమంగా అలవాటు చేసుకోవడం:

మీకు ఈ అలవాటు కొత్త అయితే మాత్రం, కొద్దిసేపు విరామాలతో మొదలుపెట్టండి. నిదానంగా నైట్ టైం నిద్రను తగ్గించుకోవడం వల్ల పగటి షార్ట్ స్లీప్ సాధ్యం అవుతుంది.

మీ వాతావరణాన్ని మార్చుకోవడం:

నిద్రను మంచి కంఫర్టబుల్ గా, కాస్త వెలుతురు తక్కువ వచ్చే ప్రదేశంగా ఉంచుకోవాలి.

మానిటర్ చేసుకుంటూ ఉండటం:

మీలో శక్తి స్థాయిలు మారుతున్న విధానం గురించి చర్చించుకోండి. అవసరమైన మేరకు వాటి షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకోండి.

బైపాసిక్ స్లీప్‌లో రకాలు:

సియెస్తా స్లీప్ షెడ్యూల్:

రాత్రి సమయంలో 5-6గంటలు మాత్రమే నిద్రపోయి పగలు 60-90 నిమిషాల వరకూ నిద్రపోవడాన్ని సియెస్తా స్లీప్ షెడ్యూల్ అంటారు.

మిడ్ డే న్యాప్ షెడ్యూల్:

రాత్రి సమయంలో 7 గంటల సేపు నిద్రపోవడంతో పాటుగా మధ్యాహ్న సమయంలో ఒక 20-30 నిమిషాల పాటు నిద్రపోవడం బెటర్.

ఫస్ట్/సెకండ్ స్లీప్ షెడ్యూల్:

రాత్రి నిద్రపోయే సమయాన్ని రెండు భాగాలు చేసుకోండి. చరిత్రాత్మకంగా చాలా ఏళ్లుగా ఉన్న ప్రాక్టీస్‌యే ఇది. నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఒక టైం ఇంటర్వెల్ పెట్టుకుని అదే సమయాన్ని రిపీట్ చేస్తూ ఉండండి.

బైపాసిక్ స్లీప్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:

నిద్రపట్టడంలో ఆలస్యం:

మధ్యాహ్నం పడుకునే సమయం కాస్త లేట్ అయితే అది రాత్రి నిద్రపై ప్రభావం చూపిస్తుంది.

ర్యాపిడ్ ఐ మూమెంట్ (REM) స్లీప్ తగ్గించుకోవడం:

మేధస్సును చాలా క్రియాశీలంగా ఉంచుకునే REM స్లీప్ ను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతే మెమొరీ మీద మూడ్ ఛేంజింగ్ మీద పట్టు కోల్పోతాం.

స్లీప్ క్వాలిటీ:

రాత్రి సమయంలో మధ్యలో మేల్కోవడం వంటి అలవాటు ఉండటం వల్ల నిద్రలో క్వాలిటీ తగ్గిపోతుంది.

శరీరాన్ని అలసిపోయినట్లుగా చేయడం:

ఒక నిర్ణీత సమయం కేటాయించుకోకుండా ఉండటం వల్ల ఎక్కువసేపు నిద్ర వస్తున్నట్లుగా అనిపించి శరీరం త్వరగా అలసిపోతుంది.

గమనించాల్సిన విషయాలు:

  • రొటీన్‌గా నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే, రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం.
  • నాప్ టైం: మధ్యాహ్నం నిద్రించేందుకు పెట్టుకున్న సమయాని కంటే ఆలస్యంగా నిద్రపోకూడదు. అలా చేయడం వల్ల రాత్రి నిద్ర క్వాలిటీలో మార్పు ఉండదు.
  • పూర్తి నిద్ర సమయంలో మార్పులు: రాత్రి సమయంలో కనీసం 7గంటల సేపు నిద్రపోవడం ముఖ్యం. ఒకవేళ కుదరకపోతే రోజు మొత్తంలోనైనా 7గంటల నిద్ర తప్పనిసరి.
  • ఈ బైపాసిక్ స్లీప్ అనేది కొంతమందిలో సత్ఫలితాలను చూపిస్తే, మరికొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ చూపించవచ్చు. ఈ పద్దతి మీకు సూట్ అవుతుందనిపిస్తేనే అలవాటు చేసుకోవడం బెటర్.

Whats_app_banner

సంబంధిత కథనం