Bike Servicing At Home : ఇంటి వద్ద మీరే బైక్ సర్వీసింగ్ చేసుకోవచ్చు.. డబ్బులు సేఫ్!-bike general servicing at home to save money and tips to maintain two wheeler for better condition ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bike Servicing At Home : ఇంటి వద్ద మీరే బైక్ సర్వీసింగ్ చేసుకోవచ్చు.. డబ్బులు సేఫ్!

Bike Servicing At Home : ఇంటి వద్ద మీరే బైక్ సర్వీసింగ్ చేసుకోవచ్చు.. డబ్బులు సేఫ్!

Anand Sai HT Telugu
Feb 20, 2024 09:00 AM IST

Bike General Servicing : బైక్‌ సర్వీసింగ్‌కు ఇస్తే డబ్బులు కచ్చితంగా జేబులో నుంచి వదులుకోవాల్సిందే. చిన్న చిన్న రిపేర్లు ఉన్నా.. డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. అందుకే మీరే ఇంటి దగ్గర కొన్ని చిట్కాలు పాటించవచ్చు. సర్వీసింగ్ చేసుకోవచ్చు.

ఇంటి వద్ద బైక్ సర్వీసింగ్
ఇంటి వద్ద బైక్ సర్వీసింగ్ (Unsplash)

టూ వీలర్ మెయింటెన్ చేయాలంటే అంత ఈజీ కాదు. ప్రతీదీ చూసుకోవాలి. బండిలో కాస్త చప్పుడు వచ్చినా చిరాకేస్తుంది. సరిగా వెళ్లకపోయినా సర్వీసింగ్ సెంటర్ వైపు చూస్తూంటాం. కానీ అక్కడకు వెళితే మాత్రం డబ్బులు కచ్చితంగా ఖర్చు అవుతాయి. అదే మీరు ఇంటి దగ్గరే కొన్ని చిట్కాలు పాటిస్తే తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గతుంది. ఎప్పుడో ఓసారి తీసుకెళ్లి పైపైన చెక్ చేయింవచ్చు. నిజానికి మీకు కాస్త బైక్ మీద ఐడియా ఉంటే మీరే ఇంటి వద్ద సర్వీసింగ్ చేసుకోవచ్చు. అందుకోసం కొన్ని టిప్స్ ఫాలో కావాలి.

ద్విచక్ర వాహనాలు రోజువారీ జీవితంలో భాగమై పోయాయి. ఒకప్పుడు ప్రయాణం చేయాలంటే బస్సులు, ఆటోల వైపు చూసేవారు. కానీ ఇప్పుడు ఇంటికో బైక్ ఉంటుంది. కానీ దీనిని మెయింటెన్ చేయడమంటే డబ్బులు కూడా ఖర్చు చేసుకోవడమే. ఖర్చులను నివారించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

ఇంజిన్ ఆయిల్

బైక్‌లకు ఇంజిన్ ఆయిల్ చాలా ముఖ్యమైనది. దీన్ని కనీసం 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదా ఇంజిన్ ట్రబుల్ వంటి పెద్ద సమస్యలను తెచ్చే అవకాశం ఉంది. అయితే దీనిని మార్చుకోవడం పెద్ద పనేం కాదు. మీ దగ్గర సరైన టూల్ ఉంటే మార్కెట్లో దొరికే ఇంజిన్ ఆయిల్ తెచ్చి పోసుకోవచ్చు. మీరు సర్వీసింగ్ సెంటర్ వెళితే కచ్చితంగా డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తారు.

బ్రేకులు చూసుకోండి

ద్విచక్రవాహనాన్ని ఎక్కువగా ఉపయోగించినప్పుడు బ్రేకులు ఎక్కువగా అరిగిపోయే వాటిలో ఒకటి. అదేవిధంగా ద్విచక్ర వాహనంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడని అంశం కూడా అదే. వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా మంచిది. అరిగిపోతే కొత్తవి వేసుకోవచ్చు.

క్లచ్‌తో జాగ్రత్త

గేర్‌లతో నడిచే ద్విచక్ర వాహనాలలో క్లచ్ చాలా ముఖ్యమైనది. చాలా మంది గేర్‌ వేసేప్పుడు కొన్నిసార్లు క్లచ్ ప్రెస్ చేయరు. దీంతో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు క్లచ్ వల్ల గేర్ బాక్స్‌లో పెద్ద సమస్యలు కూడా రావొచ్చు. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా క్లచ్‌ని ఉపయోగించాలి.

టైర్లు ఎక్కువ కాలం రావాలంటే

బైక్ విషయంలో డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే మరో అంశం టైర్లు. రెండు టైర్లను ఎప్పటికప్పుడు సరిగ్గా మెయింటెయిన్ చేయాలి. పెట్రోల్ బంక్ వెళ్లిన ప్రతీసారి ప్రతిసారీ టైర్లలో గాలి చెక్ చేయాలి. గాలి సరిగా ఉంటే టైర్లు ఎక్కువగా రోజులు వస్తాయి.

కిక్ రాడ్డు ఉపయోగించండి

బైక్‌ బ్యాటరీలు ఎక్కువ రోజులు వచ్చేలా చూసుకోవాలి. లేదంటే హార్న్ రాదు, సెల్ఫ్ స్టార్ట్ అవ్వదు. ఖర్చును చాలా వరకు తగ్గించుకోవడానికి వీటిని తరచుగా నిర్వహించడం మంచిది. కిక్ రాడ్డుతో స్టార్ట్ చేయడం బెటర్. పగలు లైట్లు ఆపేసుకోవాలి.

పెట్రోల్ చెక్ చేసుకోండి

బండికి చైన్ ప్రాణంలాంటిది. దీనిని నూనె, గ్రీజులను ఉపయోగించి సరిగ్గా నిర్వహించినట్లయితే ఎక్కువ కాలం వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీ బైక్‌లో పెట్రోల్ ఎప్పుడూ ఒకే బంకులో పోయించాలి. కల్తీ పెట్రోల్ ఉండే వేరే దగ్గరకు వెళ్లాలి.

ప్రతిరోజూ అనేక కిలోమీటర్లు ప్రయాణించే వారికి బైక్ ఎయిర్ బిల్డర్ల గురించి బాగా తెలుసు. బైక్‌ను తరచూ ఉపయోగించడం వల్ల దానిలోపల కాలుష్యం పేరుకుపోయి గాలిలో చేరే కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయడమే దీని పని. మనం కూడా దీనిని శుభ్రం చేసుకోవచ్చు. పైన చెప్పినవన్నీ చేస్తే మీరు బైక్ సర్వీసింగ్ త్వరగా తీసుకెళ్లాల్సిన పని లేదు. మీరే సర్వీసింగ్ చేసినట్టుగా అవుతుంది.

టాపిక్