Yoga for laziness: ఈ రెండు యోగాసనాలు ఉదయాన్నే చేశారంటే.. రోజంతా బద్దకం ఉండదు-bhujangasan pavan mukthasan to get rid of laziness and to get active body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Laziness: ఈ రెండు యోగాసనాలు ఉదయాన్నే చేశారంటే.. రోజంతా బద్దకం ఉండదు

Yoga for laziness: ఈ రెండు యోగాసనాలు ఉదయాన్నే చేశారంటే.. రోజంతా బద్దకం ఉండదు

Koutik Pranaya Sree HT Telugu
Sep 17, 2024 10:30 AM IST

Yoga for laziness: ఈ రెండు యోగా ఆసనాలు మీ శరీరంలో శక్తిని పెంచి, రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచడానికి, బద్దకం తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రెండు యోగాసనాలు ఏమిటో తెల్సుకుని చేసేయండి.

yoga asanas for staying active
yoga asanas for staying active (shutterstock)

ఎంత బాగా నిద్రపోయినా సరే ఉదయం లేవగానే అలసట, బద్దకంగా అనిపిస్తుంటే రోజంతా అలాగే ఉంటుంది. రోజంతా ఏమీ చేయబుద్ది కాదు. మీ వంద శాతం ఏ పనిలోనూ ఇవ్వలేరు. అందుకే ఈ సింపుల్ యోగాసనాలను మీ దినచర్యలో చేర్చుకోండి. వీటితో కొత్త ఉత్తేజం వస్తుంది. వీటికి ఒక పది నిమిషాలు కేటాయించారంటే రోజంతా చురుగ్గా ఉంటారు. అవేంటో చూడండి.

భుజంగాసనం:

దీన్నే కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడం వల్ల పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ ఆసనం నడుము కింది భాగాన్ని బలోపేతం చేస్తుంది. శరీరంలో శక్తి స్థాయిని పెంచుతుంది.

  1. భుజంగాసనం చేయడానికి ఒక ప్రశాంతమైన చోటులో యోగా మ్యాట్ వేసుకోండి. దీని మీద బోర్లా పడుకుని పాదాలు ఒకదానితో ఒకటి కలిపి ఉంచాలి.
  2. మోచేతుల దగ్గర రెండు చేతులను వంచి, రెండు అరచేతులను ఛాతీ పక్కన నేలపై ఉంచండి.
  3. ఇలా చేసేటప్పుడు దీర్ఘ శ్వాస తీసుకుని మెడను మెల్లగా పైకి లేపాలి. నెమ్మదిగా ఛాతీని పైకి లేపి, ఆపై పొట్టను నెమ్మదిగా పైకి లేపాలి.
  4. ఈ స్థితిలో ఉండి ఆకాశం వైపు చూడటానికి ప్రయత్నించండి. ఇలా చేసేటప్పుడు మెడను నిటారుగా ఉంచాలి. ఈ భంగిమలో కాసేపు ఉండండి చాలు.

పవనముక్తాసనం:

పవనముక్తసనాన్నిఆంగ్లంలో విండ్ రిలీవింగ్ పోజ్ అంటారు. క్రమం తప్పకుండా పవనముక్తాసనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడి గర్భాశయానికి సంబంధించిన సమస్యల విషయంలో స్త్రీలు ప్రయోజనం పొందుతారు. బరువు తగ్గడంతో పాటు బద్ధకం, అలసటను అధిగమించడానికి కూడా ఈ ఆసనం సహాయపడుతుంది. పవనముక్తాసనం చేయడానికి,

  1. నిశ్శబ్ద ప్రదేశంలో యోగా మ్యాట్ పరుచుకోండి. వెళ్లకిలా పడుకోండి.
  2. శ్వాస తీసుకునేటప్పుడు మీ కాళ్ళను 90 డిగ్రీల వరకు ఎత్తండి. తరువాత, శ్వాసను వదిలేటప్పుడు మీ కాళ్ళను వంచి మీ మోకాళ్ళను మీ ఛాతీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నించండి.
  3. ఇలా చేసేటప్పుడు, మీ మోకాళ్ళను మీ చేత్తో పట్టుకోండి, మీ తలను పైకి లేపండి,
  4. మీ నుదిటిని మీ మోకాళ్ల వరకు తాకడానికి వీలైనంత ప్రయత్నించండి. ఈ భంగిమలో కాసేపు ఉండి శ్వాస తీసుకోండి.
  5. తర్వాత మీ తలను, తరువాత కాళ్ళను క్రిందికి తీసుకురండి. ఈ యోగాసనాన్ని 2 నుండి 3 సార్లు సాధన చేయండి.

టాపిక్