Body Detox after Festival: ఫెస్టివల్ సీజన్‍లో అతిగా తినేశారా? శరీరంలో చెడు వ్యర్థాలు తొలగేందుకు వీటిని తీసుకోండి-best ways to detoxify your body post diwali festive season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Body Detox After Festival: ఫెస్టివల్ సీజన్‍లో అతిగా తినేశారా? శరీరంలో చెడు వ్యర్థాలు తొలగేందుకు వీటిని తీసుకోండి

Body Detox after Festival: ఫెస్టివల్ సీజన్‍లో అతిగా తినేశారా? శరీరంలో చెడు వ్యర్థాలు తొలగేందుకు వీటిని తీసుకోండి

Body Detox after Festival: సాధారణంగా పండుగల సీజన్‍లో ఎక్కువగా తినేస్తుంటాం. దీనివల్ల శరీరంలో కొవ్వు, చెక్కర లాంటివి ఎక్కువవుతాయి. కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల ఇవి తొలగిపోయేందుకు సులువు అవుతుంది. అవేంటంటే..

Body Detox after Festival: ఫెస్టివల్ సీజన్‍లో అతిగా తినేశారా? శరీరంలో చెడు వ్యర్థాలు తొలగేందుకు వీటిని తీసుకోండి

పండుగ అంటే సంబరాలతో పాటు రకరకాల ఆహార పదార్థాలు చేసుకుంటారు. ముఖ్యంగా వెలుగుల పండుగ ‘దీపావళి’ అంటే దీపాలు, టపాసులే కాకుండా స్పెషల్ వంటకాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది సాధారణం కంటే ఎక్కువగా ఆహారం తింటారు. స్వీట్లు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకొనే ఉంటారు. ఎంత కంట్రోల్ చేసుకున్నా.. పండుగ సమయాల్లో ఎక్కువగానే తినేస్తాం. అయితే, దీనివల్ల శరీరంలో కొవ్వులు, చెక్కెర చేరిపోతాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే ఇవి తొలగిపోయేందుకు (డిటాక్స్) కొన్ని రకాల ఆహారాలు తోడ్పడతాయి. పండుగల తర్వాత ఇలాంటివి తింటే మేలు.

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే కడుపు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయేందుకు ఇవి ఉపయోగపడతాయి. క్యారెట్లు, యాపిల్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఓట్స్ సహా కూరగాయాలు మీ డైట్‍లో తీసుకోండి. పండుగల తర్వాత కొన్ని రోజులు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తింటే మేలు.

గోరువెచ్చని నిమ్మరసం నీరు

నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవటంతో పాటు శరీరంలోని వ్యర్థాలు, విషతుల్యాల సులువుగా బయటికి వెళ్లేందుకు తోడ్పడుతుంది. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ గ్యాస్ట్రిక్ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకొని, ఉదయాన్నే పరగడుపున తాగాలి.

ఆకుకూరలు

మీ ఆహరంలో పాలకూర, కేల్ లాంటి ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. ఆకుకూరల్లో క్లోరోఫిల్ అధికంగా ఉంటుంది. కాలేయంలోని వ్యర్థాలు తొలగించేందుకు ఇది తోడ్పడుతుంది. ఆహారంతో పాటు సలాడ్లు, స్మూతీల్లోనూ ఆకుకూరలు వాడండి.

కూరగాయల జ్యూస్‍లు

శరీరాన్ని డిటాక్స్ చేసేందుకు కూరగాయల జ్యూస్‍లు కూడా ప్రభావంతంగా పని చేస్తాయి. క్యారెట్, బీట్‍రూట్, సెలెరీ వంటి జ్యూస్‍లు తాగొచ్చు. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు డిటాక్స్ ప్రక్రియకు తోడ్పడతాయి. నీటిలో కూరగాయలు వేసి బ్లెండ్ చేసి తాగొచ్చు.

కలబంద జ్యూస్

కలబందలో డైజెస్టివ్, యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. జీర్ణక్రియను ఈ జ్యూస్ మెరుగుపరచగలదు. గ్లాస్ నీటిలో రెండు టేబుల్ స్పూన్‍ల కలబంద జ్యూస్ వేయాలి. ఆ తర్వాత దాన్ని ఉదయాన్నే తాగాలి. దీనివల్ల డిటాక్స్ మెరుగవుతుంది.

ప్రోబయోటిక్ ఫుడ్స్

ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహకరిస్తాయి. మంటను తగ్గిస్తాయి. యగర్ట్, పెరుగు, టెంఫే, కాటేజ్ టీజ్, మజ్జిగలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి.

గ్రీన్ టీ తాగడం

యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే గ్రీన్ టీ లాంటివి తాగాలి. జీవక్రియలను గ్రీన్ టీ మెరుగుపరుస్తుంది. పుదీన టీ, చేమంతి టీ కూడా జీర్ణక్రియను ఇంప్రూవ్ చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయేందుకు ఈ హెర్బల్ టీలు తోడ్పడతాయి.

ఇవి వద్దు

పండుగ సమయాల్లో తిండి ఎక్కువగా తిన్నందున కొన్ని రోజుల పాటు నియంత్రణ పాటించాలి. తీపి ఎక్కువగా ఉండే పదార్థాలను దూరంగా ఉంచాలి. ఫ్రైడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కొన్ని రోజులు తినకూడదు. సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. ఆల్కహాల్, కూల్‍డ్రింక్స్ లాంటి షుగర్ ఎక్కువగా ఉండేవి తాగకూడదు.