Protein Food: మజిల్ పెంచాలనుకునేవారికి తక్కువ ఖర్చులో బెస్ట్ ప్రొటీన్ ఫుడ్, ఇదిగో రెసిపీ
Protein Food: బాడీ మజిల్ పెంచడానికి ట్రై చేస్తున్నారా..? చలికాలం ఏ ఫుడ్ తీసుకోవాలనే ఆలోచనకు చెక్ పెట్టండి. జిమ్ లో వర్కౌట్లు చేసుకుని రాగానే కొద్ది క్షణాల్లోనే తయారు చేసుకోగల బెస్ట్ ప్రొటీన్ ఫుడ్ మీ కోసం.
ఫిట్‌గా, హెల్తీగా ఉండటం కోసం మీరు ప్రతిరోజూ వర్కవుట్ చేస్తుంటారా? వ్యాయామం చేసిన తర్వాత తీసుకునే ఆహారం గురించి రోజూ చింతిస్తున్నారా? ముఖ్యంగా చలికాలంలో కండరాల ఆరోగ్యానికి ఉపయోగపడేది, తక్కువ ధరలో దొరికే ప్రొటీన్ ఆహారం గురించి మీరు వెతుకుతున్నట్లయితే ఈ రెసిపీ మీ కోసమే. ముఖ్యంగా వెజిటేరియన్లకు ఇది చక్కటి ప్రొటీన్ మీల్. స్ప్రౌట్స్, మఖానా, దోసకాయ వంటి రకరకాల ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేసుకునే ఈ రెసిపీ కండరాలను బలోపేతం చేయడానికి అవసరమైన పోషకాలు, ప్రొటీన్లను అందిస్తుంది. పోస్ట్ వర్కౌట్ మీల్ అయిన ఈ రెసిపీ టేస్టీగా ఉండటమే కాదు మంచి ఆరోగ్యకరం కూడా. తయారు చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

కావల్సిన పదార్థాలు:
- నెయ్యి - టేబుల్ స్పూన్
- స్ప్రౌట్స్ - 100 గ్రాములు
- ఉప్పు - (రుచికి తగినంత)
- పసుపు - ఒక టీ స్పూన్
- కారం - ఒక టీ స్పూన్
- చాట్ మసాలా - ఒక అర టీ స్పూన్
- దోసకాయ ముక్కలు - సగం దోసకాయ
- టమాట - ఒకటి
- మఖానా - వంద గ్రాములు
- ఉల్లిపాయ - చిన్నది
- చిల్లీ సాస్
- కొత్తిమీర
తయారు చేసే విధానం:
- ముందుగా స్టవ్ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి దానిపై ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి.
- అది వేడెక్కిన తర్వాత స్ప్రౌట్స్ వేసుకుని వేడి చేయాలి. అన్ని స్ప్రౌట్స్ దొరకకపోతే పెసలు వేసుకున్నా సరిపోతుంది.
- ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు, టీ స్పూన్ పసుపు, కారం ఒక టీ స్పూన్, చాట్ మసాలా అర టీస్పూన్ వేసి బాగా కలుపుకోవాలి.
- వేగాయనుకున్న తర్వాత అందులో దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి.
- వాటిపైన మఖానా వేసి కాస్త కొత్తిమీర జోడించుకుని గార్నిష్ కోసం కారప్పూస లాంటిది కూడా వేసుకోవచ్చు.
అంతే మీ పోస్ట్ వర్కౌట్ మీల్ రెడీ అయిపోయినట్లే.
పోస్ట్ వర్కౌట్ మీల్స్‌లో తీసుకునే ఈ ఆహారంలో ఏయే పదార్థంతో ఎలాంటి ప్రయోజనముందో తెలుసుకుందామా.
స్ప్రౌట్స్: స్ప్రౌట్స్‌లో ఉన్న ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థకు కూడా మంచివి.
నెయ్యి: నెయ్యి శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వును అందిస్తుంది. ఇది శరీరానికి ఇన్సులిన్ అందించడం వల్ల సున్నితత్వాన్ని పెంచి, కండరాలు పెంచడంలో సహాయపడుతుంది.
మఖానా (ఫాక్స్ నట్స్): మఖానాలో ప్రొటీన్, ఐరన్‌తో పాటు బోలెడు విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చి కండరాల పునరుద్ధరణలో సహాయపడతాయి.
పసుపు: పసుపు యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తుంది. శరీరంలో ఉన్న నాడీ బలహీనతలను తగ్గించి, కాల్షియం అవశేషాలను పెంచుతుంది.
టమాటా, దోసకాయ: ఇవి విటమిన్ Cతో నిండి ఉంటాయి. శరీరంలో శ్వాస ప్రక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఉల్లిపాయ, చాట్ మసాలా: ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా ఆహారానికి రుచిని పెంచుతాయి.
కొత్తిమీర: కొత్తిమీరలో విటమిన్ K, విటమిన్ A, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు అందిస్తుంది.
సంబంధిత కథనం