Christmas Vacation Places: క్రిస్మస్‍కు దక్షిణాదిలో టూర్ వెళ్లేందుకు 5 బెస్ట్ ప్లేస్‍లు.. ఫుల్ ఫెస్టివల్ వైబ్‍తో ఉండేలా.
Places to Visit in South India During Christmas: క్రిస్మస్ హాలీడేస్‍లో ట్రిప్ వెళ్లేందుకు దక్షిణ భారతంలో కొన్ని ప్లేస్‍లు సూటవుతాయి. ట్రావెలింగ్‍లో క్రిస్మస్ సందడి కూడా చూడాలంటే బెస్ట్‌గా ఉంటాయి. అలాంటి 5 ప్లేస్‍ల గురించి ఇక్కడ చూడండి.
ఈనెల క్రిస్మస్ సమయంలో వెకేషన్‍కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అలాగే వెళ్లిన చోట క్రిస్మస్ వైబ్స్, సందడి ఉండాలని అనుకుంటున్నారా.. అయితే దక్షిణ భారతంలో కొన్ని ప్లేస్‍లకు వెళ్లొచ్చు. క్రిస్మస్ టైమ్‍లో టూర్ వెళ్లేందుకు ఈ ప్లేస్‍లు సరిగ్గా సూటవుతాయి. పండుగ సందడి కూడా బాగుంటుంది. అలాంటి ప్లేస్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
పాండిచ్చేరి
క్రిస్మస్ టైమ్‍లో వెళ్లేందుకు పాండిచ్చేరి బెస్ట్ ఆప్షన్‍గా ఉంటుంది. ఇక్కడి ఫ్రెంచ్ కాలనీ చాలా పాపులర్. పండుగ సమయంలో ఇక్కడికి వెళితే ఫ్రెంచ్ సంస్కృతిని, వారి విధానాలను చూసే అవకాశం ఉంటుంది. ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. పాండిచ్చేరిలో పురాతన కట్టడాలు, రంగురంగుల నిర్మాణాలు, బీచ్‍లు, కేఫ్‍లు ఇలా చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. బీచ్ ఆహ్లాదకరంగా ఉంటుంది. చర్చిలు కూడా పాండిచ్చేరిలో చాలా ఉంటాయి. క్రిస్మస్ మార్కెట్ భారీ స్థాయిలో ఉంటుంది.
అలప్పీ
కేరళలో అలప్పి (అలపుజా) ప్రకృతి అందాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆకట్టుకుంటుంది. నదీ జలాల్లో పడవల్లో విహారం అద్భుతంగా అనిపిస్తుంది. హౌస్ బోట్లలో ఉండడం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. క్రిస్మస్ సమయంలో అలప్పీ వెలిగిపోతుంది. ఈ సిటీలో చాలా చర్చిలు ఉన్నాయి. స్టార్లు, లైట్లతో పాటు వాటిని కళ్లు మిరిమిట్లు గొలిపేలా అలంకరిస్తారు. ఇళ్లు కూడా కళకళలాడుతాయి. క్రిస్మస్ సందడి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పండుగ టైమ్‍లో అలప్పీ వెకేషన్ అదిరిపోతుంది. కేరళ అంతటా క్రిస్మస్ సందడి ఎక్కువగా ఉంటుంది.
గోవా
గోవాలోనూ క్రిస్మస్ సంబరాలు భారీ స్థాయిలో జరుగుతాయి. ఇక్కడ చర్చిలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ క్రిస్మస్ పార్టీలు, ఫెస్ట్‌లు ప్రత్యేకంగా జరుగుతాయి. అందమైన బీచ్‍ల్లో సమయం గడపవచ్చు. నైట్ లైఫ్‍ను కూడా ఆస్వాదించవచ్చు. క్రిస్మస్ సందర్భంగా గోవా స్ట్రీట్‍లు వెలుగులతో మిరుమిట్లు గొలుపుతాయి. బేకరీల్లో స్పెషల్ కేక్‍లు కూడా లభిస్తాయి. న్యూఇయర్ వీక్ కూడా ఉండటంతో ఈ టైమ్‍లో ఇక్కడికి సందర్శకుల రాక చాలా భారీగా ఉంటుంది.
కొచ్చి
డిసెంబర్ చివరి వారం కొచ్చి వెలిగిపోతుంది. ఈ సిటిలో ఈనెల చివరి వారంలో జరిగే ‘కొచ్చి కార్నివల్’ అదిరిపోతుంది. కళ్లు చెదిరే ఈవెంట్లు, ఎంటర్‌టైన్‍మెంట్ ప్రోగ్రామ్‍లు, వివిధ సంస్కృతులకు అద్దం పట్టేలా జరిగే కార్యక్రమాలు.. ఇలా చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. బైక్ రేస్‍లు, బీచ్ ఫుట్‍బాల్, బాక్సింగ్. సైకిల్ రేస్ ఇలా చాలా స్పోర్ట్స్ జరుగుతాయి. ఫుడ్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఇలా వారమంతా కొచ్చి కార్నివల్‍లో సందడి భారీ స్థాయిలో ఉంటుంది. కొచ్చిలో క్రిస్మస్ కూడా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, సెయింట్ జార్జ్ లాంటి పురాతన చర్చిలు చాలా ఉన్నాయి. క్రిస్మస్ సమయంలో ఈ సిటీ వెలిగిపోతుంది. డికరేషన్లతో కళ్లు చెదిరేలా ఉంటుంది. క్రిస్మస్ వైబ్స్ ఫుల్‍గా ఉంటాయి.
చెన్నై
తమిళనాడు రాజధాని చెన్నైలోని క్రిస్మస్ సందడి బాగా ఉంటుంది. డెరకేషన్‍తో చాలా వీధులు తళుకుతళుకుమంటాయి. వెలంకనీ చర్చ్, షాంతోమ్ చర్చ్ సహా మరిన్ని ఫేమస్ చర్చిలు ఈ సిటీలో ఉన్నాయి. వీటి డెరకేషన్ అద్భుతంగా ఉంటుంది. క్రిస్మస్ మార్కెట్ కూడా చెన్నై సిటీలో భారీగా జరుగుతుంది.