Urine Infection : యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే సెక్స్ చేయోచ్చా? ఇన్ఫెక్షన్ తగ్గించే చిట్కా ఇది-best home remedy for urine infection ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Best Home Remedy For Urine Infection

Urine Infection : యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే సెక్స్ చేయోచ్చా? ఇన్ఫెక్షన్ తగ్గించే చిట్కా ఇది

HT Telugu Desk HT Telugu
May 30, 2023 03:29 PM IST

Urine Infection : చాలామంది తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్.. బారిన పడుతారు. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇంటి దగ్గరే కొన్ని చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

యూరిన్ ఇన్ఫెక్షన్(Urine Infection) బారిన పడడానికి చాలా కారణాలు ఉంటాయి. దీని కారణంగా మూత్రాశయం, గర్భాశయం, మూత్రం ప్రవహించే మార్గం.. ఇలా అన్ని ప్రభావానికి గురి అవుతాయి. మరీ ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య వస్తుంది. మూత్రం ఆపుకోవడం, అలాగే గర్భిణీ స్త్రీలల్లో, డయాబెటిస్ తో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మసాలా కలిగిన ఆహారాలను కూడా ఎక్కువగా తీసుకోవద్దు. మద్యపానం(Liquor) తాగడం, నీటిని తక్కువగా తాగడం వంటి కారణాలతో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది.

యూరిన్ ఇన్ఫెక్షనన్.. కారణంగా మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రం వచ్చినట్టుగా అవడం, వెన్ను భాగంలో ఒక్కసారిగా నొప్పి రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. యాంటీ బయాటిక్ లను కొంతమంది వాడుతారు. అయితే దీనికంటే.. ఆయుర్వేద చిట్కాలను(Ayruveda Tips) ఉపయోగిస్తే.. ఇంకా మంచిది. త్వరగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఎలాంటి దుష్ర్పభావాలు కూడా ఉండవు.

ఈ చిట్కా తయారీ కోసం.. ఆపిల్ సైడ్ వెనిగర్ ను ఉపయోగించాలి. ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఆపిల్ సైడ్ వెనిగర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని(Lemon), ఒక టీ స్పూన్ తేనెను వేసి కలపాలి. ఇలా తయారు చేసి.. ఆ నీటిని ఉదయం అల్పాహారం తీసుకున్న అరగంట తర్వాత, అలాగే సాయంత్రం 4 గంటల సమయంలో తీసుకోవాలి. ఇలా తీసుకుంటే.. సులభంగా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు విటమిన్ సి(Vitamin C) ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పుల్లగా ఉండే పండ్లను తినాలి. ఇలా చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు.. ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. అలానే ప్రతిరోజూ నీటిని ఎక్కువగా తాగాలి. మూత్రం ఇన్ఫెక్షన్.. తగ్గించడంలో ధనియాల కషాయం చక్కగా పనిచేస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారు.. సమస్య తగ్గే వరకూ లైంగిక చర్యల్లో పాల్గొనకూడదు. ఇలా కొన్ని చిట్కాలు పాటిస్తే.. త్వరగానే సమస్య నుంచి బయటపడొచ్చు.

WhatsApp channel