wedding gift ideas: పెళ్లికి ఇవ్వదగ్గ 20 బెస్ట్ గిఫ్ట్స్ ఇవే.. అన్నీ తక్కువ బడ్జెట్ లోనే-best gift ideas to present for weddings in less budget ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Best Gift Ideas To Present For Weddings In Less Budget

wedding gift ideas: పెళ్లికి ఇవ్వదగ్గ 20 బెస్ట్ గిఫ్ట్స్ ఇవే.. అన్నీ తక్కువ బడ్జెట్ లోనే

Koutik Pranaya Sree HT Telugu
May 21, 2023 09:50 AM IST

wedding gift ideas:పెళ్లికి ఇవ్వదగ్గ ఉత్తమ బహుమతులేంటో తెలుసుకోండి. ఉపయోగకరంగా, కాస్త భిన్నంగా ఉండే 20 బహుమతుల వివరాలు మీకోసమే..

పెళ్లి బహుమతులు
పెళ్లి బహుమతులు (pexels)

ఇది పెళ్లిళ్ల సీజన్. పెళ్లిళ్లకి ఏ బహుమతులివ్వాలో ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా స్నేహితుల పెళ్లికి, దగ్గరి బంధువుల పెళ్లికి తప్పకుండా ఏదైనా ప్రత్యేకంగా బహుమతి తీసుకోవాల్సిందే. వాళ్లకి ఉపయోగపడేలా ప్రత్యేకంగా ఏ బహుమతులు ఇవ్వొచ్చో చూడండి.

1. స్టార్ మ్యాప్:

పెళ్లి రోజు తేదీ, సమయం బట్టి పెళ్లి ముహూర్తం సమయంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాల స్థానాల్ని తెలియజేస్తూ చేసే మ్యాప్ ఇది. దీని మీద వధూవరుల ఫొటోలు, పేర్లు కూడా ప్రింట్ చేసి ఫ్రేమ్ చేసి ఇవ్వొచ్చు. మనం వివరాలు చెబితే చేసిచ్చే సైట్లు ఆన్లైన్ లో చాలా ఉన్నాయి.

2. డిజిటల్ ఫొటో ఫ్రేమ్:

చాలా మంది ఫొటో ఫ్రేములు బహుమతులు ఇస్తుంటారు. కానీ వాళ్లకి ఫొటోలు నచ్చకపోవచ్చు. ఈ రిమోట్ కంట్రోలర్ డిజిటల్ ఫొటో ఫ్రేమ్‌ అన్నింటిలా కాదు. అనుకున్న ఫొటో రిమోట్ సాయంతో మార్చుకొని, గోడకు తగిలించుకోవచ్చు. స్టోరేజీ కెపాసిటీ కూడా ఉంటుంది వీటికి.

3. స్టార్ ప్రొజెక్టర్:

రంగు రంగుల నక్షత్రాలు, హృదయాకారాలు.. ఇలా చాలా రకాల ప్రొజెక్టర్లు తక్కువ ధరకే దొరుకుతున్నాయి. ఇవి పెళ్లయ్యాక వాళ్ల గదిని ప్రత్యేకంగా అలంకరించుకోడానికి అవసరమవుతాయి.

4. అదృష్టం తెచ్చే మొక్కలు:

మనీ ప్లాంట్, జేద్, స్నేక్ ప్లాంట్ వంటి వాటిని అదృష్టం తెచ్చే మొక్కలంటారు. వాటిలో ఏదైనా కొనండి. ప్రత్యేకంగా ఉంటుంది.

5. లవ్ బర్డ్స్:

ప్రేమలో ఉన్న జంటలకు మనం పెట్టే పేరిది. అదే బహుమతిగా ఇస్తే చాలా బాగుంటుంది. హంసలు, చిలుకలు.. ఇలా చాలా రకాల జంట పక్షుల బొమ్మలుంటాయి. వాటినివ్వండి.

6. మూన్ బెడ్ ల్యాంప్:

చందమామ ఆకారం మీద పెళ్లి జంట ఫొటో ప్రింట్ చేసిన అచ్చం చందమామ లాగే ఉండే ఈ ల్యాంప్ చాలా బాగుంటుంది.

7. మిస్టర్ అండ్ మిస్సెస్:

ఈ థీమ్ తో టీ కప్పులు, టీ షర్టులు, డ్రెస్సులు, కీచైన్ లు, కుషన్ లు చాలా ఉంటాయి.

8. టూ డూ అడ్వెంచర్ బుక్: పెళ్లయ్యాక వాళ్ల జర్నీని రాసుకోడానికీ, ఫొటోలు పెట్టుకోడానికి, గుర్తులన్నీ ఒక దగ్గర రాసుకోడానికి వీలుగా ఉంటాయీ పుస్తకాలు. మంచి బహుమతి అవుతుంది.

9. జ్యువెలరీ ఆర్గనైజర్: పెళ్లంటేనే నగలు, బట్టలు. అవి దాచిపెట్టుకోడానికి చెక్కతో లేదా మంచి అలంకరణతో ఉన్న జ్యువెలరీ ఆర్గనైజర్ బహుమతిగా ఇవ్వండి.

10. రూమ్ డెకార్ సెట్: మీ దగ్గరి స్నేహితుల పెళ్లయితే ఈ రొమాంటిక్ రూమ్ డెకార్ సెట్ సరైన బహుమతి. గదిని అలంకరించడానికి ఉపయోగపడుతుందిది.

11. సెంటెడ్ క్యాండిల్స్: మంచి పరిమళభరితమైన నాణ్యమైన క్యాండిళ్లు బహుమతిగా ఇవ్వండి.

12. క్రిస్టల్ ట్రీ: వీటి ప్రాముఖ్యత ఈ మధ్య పెరిగింది. 7 రకాలు క్రిస్టల్స్ ఉండే కృత్రిమ చెట్టు అదృష్టానికి చిహ్నమని నమ్ముతారు. ఇది ఇంటికి మంచి అలంకరణ వస్తువు కూడా.

13. హ్యాండ్ బ్యాగ్: అబ్బాయిలకైతే వాళ్ల పేరు ప్రింట్ చేసిన కస్టమైజ్డ్ వ్యాలెట్, అమ్మాయిలకైతే హ్యాండ్ బ్యాగ్ ఇవ్వొచ్చు.

14. గోడ గడియారం: ఒక మంచి వింటేజ్ గడియారం లేదా 12 ఫొటోలతో చేసిన కస్టమైజ్డ్ గడియారం బాగుంటుంది.

15. హోమ్ డెకార్: కొత్త ఇల్లు అలంకరించడానికి ఉపయోగపడే అలంకరణ వస్తువులు ఏవైనా కొనండి. బుద్దుని బొమ్మలు, ఆర్టిఫిషియల్ మొక్కలు.. ఏవైనా ఇవ్వొచ్చు.

16. నేమ్ బోర్డ్: భార్యా భర్తల పేర్లను ప్రింట్ చేయించి అపార్ట్ మెంట్ బయట లేదా ఇంటి బయట హ్యాంగ్ చేసుకునేలా నేమ్ బోర్డ్ ఇవ్వండి.

17. ఫొటో ఫ్రేమ్ ట్రీ: ఒకట్రెండు కాకుండా చిన్న సైజు నుంచి పెద్ద సైజులో వివిధ ఆకారాల్లో 10 నుంచి 12 వచ్చే ఫ్రేముల సెట్ ఉంటుంది. చెట్టు ఆకారంలో, హృదయాకారంలో.. ఎలా ఏదైనా ఎంచుకోండి.

18. గృహోపకరణాలు: ఇంట్లో, వంట గదిలో ఉపయోగపడే వస్తువులు

19. రాధాకృష్ణ: చాలా మంది రాధాకృష్ణుల ఫొటో ఫ్రేములు బహుమతిగా ఇస్తారు. దానికి బదులుగా మీరు రాధాకృష్ణుల విగ్రహాలు లేదా ఏదైనా డెకార్ పీస్ తీసుకోండి.

20. సిల్వర్ ప్రింటెడ్ వెడ్డింగ్ కార్డ్: వెండి రేకు మీద పెళ్లి పత్రికను అచ్చు చేయించి ఇస్తే మంచి బహుమతిగా గుర్తుండిపోతుంది.

బోనస్ గా ఇంకో బహుమతి.. రిమోట్ కంట్రోల్ క్యాండిల్ సెట్ గదిలో పెట్టుకోడానికి బెడ్ లైట్ లాగా ఉపయోగపడుతుంది. ఇంకేం ఇన్ని ఆప్షన్స్‌లో మీకు నచ్చిన, వధూవరలకు నప్పే బహుమతిని ఎంచుకోండి.

WhatsApp channel

టాపిక్