DIY Cold Tonic Shots: జలుబుపై బ్రహ్మాండంగా పని చేసే టానిక్ షాట్స్.. ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..!
DIY Cold Tonic Shots: చలికాలంలో వచ్చే జలుబు పోవాలంటే కాస్త ఇబ్బందే. వెంటనే వదలదు. అలాంటప్పుడు మాత్రలకు బదులు ఈ పవర్‌ఫుల్ కోల్డ్ టానిక్ షార్ట్స్ ట్రై చేయండి. జలుబు తొందరగా తగ్గిపోతుంది.
శీతాకాలంలో శ్వాస కోశ సంబంధమైన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటివి ఇబ్బందులు పెడుతుంటాయి. ఈ కాలంలో వాతావరణంలో కాలుష్య కారకారకాలు, వైరస్‌లు, బ్యాక్టీరియాలు.. తదితరాల వల్ల మనం ఈ వ్యాధుల బారిన పడుతూ ఉంటాం. అయితే జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి లాంటి వాటికి అద్భుతంగా పని చేసే కొన్ని రకాల టానిక్ షార్ట్స్‌ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఆయుర్వేద వైద్య నిపుణులు వివరిస్తున్నారిక్కడ.
నల్ల మిరియాల పొడికి తేనె చేర్చి :
నల్ల మిరియాల్ని ఏడెనిమి వరకు తీసుకోవాలి. వాటిని రోట్లో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడిని టీ స్పూనుడు తేనెతో చేర్చాలి. తేలికగా మింగడానికి వీలయ్యేలా కావాలనుకుంటే కొన్ని గోరు వెచ్చని నీటిని కలుపుకుని తాగొచ్చు. ఈ నల్ల మిరియాల టానిక్ ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల జలుబు సమస్యలు తగ్గుముఖం పడతాయి.
అల్లం, తేనె, మిరియాల్ని చేర్చి :
అలాగే మిరియాలకు మరి కొన్ని పదార్థాలను కలుపుకుని మరో అద్భుతమైన టానిక్‌ని తయారు చేసుకోవచ్చు. అందుకోసం కాస్త తురుమిన అల్లం, టీ స్పూను తేనె, మిరియాల పొడి, నిమ్మరసాలను తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకుని ఉదయాన్నే తాగవచ్చు. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకనే దీన్ని ఇమ్యునిటీ బూస్టింగ్ టానిక్ అని చెబుతుంటారు.
ఎలా తాగాలంటే :
జలుబు, దగ్గులతో ఇబ్బందులు పడుతున్న వారు ఈ రెండు ఆయిర్వేద టానిక్ షార్ట్స్‌ని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే రోజుకు రెండు మూడు సార్లు వరకు వీటిని తీసుకోవచ్చు. ప్రతి రెండు డోసులకు మధ్య కనీసం మూడు గంటల వ్యవధి ఉండాలని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇవి తయారు చేసుకోవడం చాలా తేలిక. ఇంకా ఎంతో ప్రభావవంతంగానూ పని చేస్తాయి.
నల్ల మిరియాలతో ప్రయోజనాలు :
ఈ రెండు టానిక్‌ల్లోనూ ముఖ్యంగా కనిపిస్తున్నవి మిరియాలు. వీటిలో శ్వాస కోశ ఇబ్బందులను తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బయోటిక్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులపై చక్కగా పని చేస్తాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. కాబట్టి శరీరం ఇన్‌ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడుతుంది. తొందరగా ఈ లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది. సాధారణ జలుబు మందులు ఎక్కువ మత్తుతో కూడి ఉంటాయి. వీటిని వేసుకోవడం వల్ల చాలా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. పగటి పూట ఈ బిళ్లలు వేసుకుని పనులు చేసుకోవాలంటే విసుగ్గా అనిపిస్తుంది. అందుకనే ఇలాంటి ఇంటి చిట్కాలను పాటించడం ఉత్తమం.