House warming Gift Ideas: గృహ ప్రవేశానికి ఇవిగో మంచి గిఫ్ట్‌ ఐడియాలు..-best and useful gift ideas for house warming ceremony ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Best And Useful Gift Ideas For House Warming Ceremony

House warming Gift Ideas: గృహ ప్రవేశానికి ఇవిగో మంచి గిఫ్ట్‌ ఐడియాలు..

గృహ ప్రవేశం గిఫ్ట్ ఐడియాలు
గృహ ప్రవేశం గిఫ్ట్ ఐడియాలు (pexels)

House warming Gift Ideas: గృహ ప్రవేశం వేడుకలకు వెళ్లేటప్పుడు ఎలాంటి బహుమతి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే మంచి ఆప్షన్లు ఏంటో తెలుసుకోండి.

సొంతిల్లు అందరికీ ఓ కల. అందుకనే దాన్ని తమ అభిరుచులకు తగ్గట్లుగా తయారు చేసుకుంటారు. ఇక ఆ ఇంటికి చేసే ఒకే ఒక్క వేడుక గృహ ప్రవేశం. ఇల్లంతా పువ్వులతో అలంకరించి, బంధువులందరినీ ఆహ్వానించి, పాలు పొంగించి దాన్ని ఎంతో అద్బుతమైన వేడుకలా చేసుకుంటారు. అలాంటి గృహ ప్రవేశానికి మనల్నీ పిలుస్తుంటారు. అలా వెళ్లినప్పుడు చాలా మంది ఏదో ఒక ఫోటోనో, గడియారమో బహుమతిగా ఇచ్చి వచ్చేస్తారు గానీ దాని గురించి పెద్దగా ఆలోచించరు. అందరూ ఇచ్చినట్లుగా మనమూ బహుమతి ఇస్తే ప్రత్యేకత ఏముంటుంది? అందుకనే కొత్త ఇంటికి ఉపయోగపడే పర్సనలైజ్డ్‌ బహుమతిని ఇస్తే చాలా బాగుంటుంది. దాన్ని వారు ఎప్పటికీ మర్చిపోకుండా భద్రంగా ఇంట్లో ఉంచుకుంటారు. అలాంటి అద్దిరిపోయే ఐడియాలు ఇక్కడున్నాయి చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు

  • పేర్లతో లైట్లను డిజైన్‌ చేయించుకోవడం ఈ మధ్య ట్రెండ్‌గా మారిపోయింది. మీరు గృహ ప్రవేశానికి వెళ్లే వారి పేర్లతో ఇలాంటి లైట్లను డిజైన్‌ చేయించి బహుమతిగా ఇవ్వండి. చూసిన వారు వావ్‌ అనకుండా ఉండరు.
  • అలాగే ఇప్పుడు చాలా రకాల కస్టమైజ్డ్‌ నేమ్‌ బోర్డులు వస్తున్నాయి. మీకు డీఐవైలు చేసే అలవాటు ఉంటే మీ ట్యాలెంట్‌తో ఇంట్లోనే ఓ చక్కని నేమ్‌ బోర్డ్‌ని తయారు చేయండి. లేదంటే మార్కెట్లో ఉన్న మంచి ఆప్షన్‌లను వెతికి ఓ నేమ్‌ బోర్డ్‌ని వారికి బహుమతిగా ఇవ్వండి. వారు దాన్ని ఎంతో అపురూపంగా ఇంటి ముందు పెట్టుకుంటారు.
  • ఎసెన్షియల్‌ ఆయిల్‌ డిఫ్యూజర్లు ఇప్పుడు చాలా అందమైన డిజైన్లలో అందుబాటులో ఉంటున్నాయి. వాటిపైనా నచ్చిన పేరును ప్రింట్‌ చేయించి ఇయ్యవచ్చు.
  • ఏ శుభ కార్యానికైనా మొక్కను గిఫ్ట్‌ చేయడం అనేది చాలా మంచి ఆలోచన అని చెప్పవచ్చు. కొత్త ఇంటిలో అడుగుపెడుతున్న వారికి అందంగా, ప్రత్యేకంగా ఉన్న ఓ బోన్సాయ్‌ మొక్కను ఇచ్చి చూడండి. వారి ఆనందానికి అవధులు ఉండవు.
  • గృహ ప్రవేశం జరుగుతున్న ఆ ఇంటి ఫొటోను తీసుకుని దానిలా మంచి పెయింటింగ్‌ వేయించండి. దానికి మీ బెస్ట్‌ విషెస్‌ రైటప్‌ని జోడించి బహుమతిగా ఇచ్చి చూడండి. అవతలి వారు మిమ్మల్ని తప్పక అభినందిస్తారు.
  • ఇక ఎలక్టానిక్ ఉత్పత్తులను ఇవ్వాలనుకునే వారు ముందుగా వారి దగ్గర ఏం ఉన్నాయో, ఏం లేవో తెలుసుకోండి. జ్యూసర్‌, ఒవెన్‌, టోస్టర్‌, కాఫీ మిషిన్‌.. లాంటివీ మంచి ఆప్షన్లనే చెప్పవచ్చు. అయితే ఎలక్ట్రానిక్‌వి బహుమతిగా ఇవ్వాలనుకున్నప్పుడు మంచి కంపెనీ ఉత్పత్తులను తప్పకుండా ఎంచుకోవాలి.
  • ఈ మధ్య కాలంలో వెండి వస్తువులని గిఫ్టింగ్‌ చేయడం ఎక్కువైంది. పూజ వస్తువుల్ని, దేవుడి బొమ్మల్ని, వెండి కోటింగ్ ఉన్న దేవతా పటాల్ని ఇవ్వాలనుకుంటే వారి దగ్గర లేని వాటిని చూసి కొని ఇవ్వడం మెరుగైన ఆలోచన.

WhatsApp channel

టాపిక్