Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్-besan laddu recipe with ghee in telugu know how to ake this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

Haritha Chappa HT Telugu
May 07, 2024 03:30 PM IST

Besan Laddu Recipe in Telugu: నెయ్యితో శనగ పిండి లడ్డూ చేసి చూడండి. ఇది ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు కూడా నచ్చుతుంది. దీన్ని చేయడం చాలా సులువు.

శెనగపిండి లడ్డూ రెసిపీ
శెనగపిండి లడ్డూ రెసిపీ (Pixabay)

Besan Laddu: శెనగపిండితో చేసే స్వీట్లలో లడ్డూ ఒకటి. శెనగపిండితో చేసే తొక్కుడు లడ్డూ చాలా రుచిగా ఉంటుంది. దట్టంగా నెయ్యి వేసి చేస్తే ఈ లడ్డూను పిల్లలు ఇష్టంగా తింటారు. దీనిలో చక్కెర పొడి వేశాం, కాబట్టి డయాబెటిస్ రోగులు దీన్ని తినకూడదు. చక్కెర బదులు బెల్లం తరుగు వేసుకుంటే అన్ని విధాల మంచిది. మీ ఇష్టప్రకారం పంచదార లేదా బెల్లంలో ఏదో ఒకటి వినియోగించుకోవాలి.

శనగపిండి తొక్కుడు లడ్డూ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

శెనగపిండి - అరకిలో

నెయ్యి - ఒక కప్పు

చక్కెర పొడి - ఒకటిన్నర కప్పు

యాలకుల పొడి - అర స్పూను

జీడి పప్పులు - ఒక కప్పు

వంటసోడా - చిటికెడు

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

శనగపిండి తొక్కుడు లడ్డూ రెసిపీ

1. శెనగపిండిని ఒక గిన్నెలో వేయాలి. అందులో ఉప్పు వేసి కలపాలి.

2. ఆ మిశ్రమంలోనే రెండు స్పూన్ల నూనె, నీళ్లు పోసి పకోడీ మిశ్రమంలా కలుపుకోవాలి.

3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. శెనగపిండి మిశ్రమాన్ని జల్లెడలో వేసి బూందీలాగా వేసుకోవాలి.

5. ఈ బూందీని తీసి పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి పంచదార నీళ్లు వేయాలి.

7. తీగ పాకం వచ్చే దాకా స్టవ్ మీద ఉంచాలి. తీగ పాకం వచ్చాక స్టవ్ కట్టేయాలి.

8. ఇప్పుడు పంచదార పాకంలో ముందు చేసుకున్న బూందీని అందులో వేసి బాగా కలుపుకోవాలి.

9. అందులోనే నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

10. గోరు వెచ్చగా మారాక వాటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. నెయ్యి వేసావు కాబట్టి ఘుమఘుమలాడిపోతుంది.

శెనగపిండితో చేసే వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి. దీంతో స్వీట్లు చేస్తే చాలా రుచిగా ఉంటాయి. శెనగపిండిని ఆహారంలో భాగం చేసుకుంటే అధికరక్తపోటు సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్య అదుపులో ఉంటుంది. ఆటోఇమ్యూన్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇందులో ఫైబర్ మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.

టాపిక్