Multani Mitti Benefits : మీ చర్మం మెరిసిపోవాలంటే ముల్తానీ మట్టిని ఉపయోగించే పద్ధతులు ఇవే
Multani Mitti Benefits In Telugu : ముఖం అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే ఇందుకోసం కొన్ని సహజ పద్ధతులను పాటించాలి. అందులో ఒకటి ముల్తానీ మట్టి.
ముల్తానీ మట్టి అనేది ఒక ప్రసిద్ధ సహజ చర్మ సంరక్షణకు ఉపయోగించేది. ఇది చాలా ఇళ్లలోనూ ఉంటుంది. ఇందులో మినరల్స్, నీరు సమృద్ధిగా ఉంటాయి. ఇది గోధుమ, ఆకుపచ్చ రంగులతో సహా వివిధ రంగులలో కూడా కనిపిస్తుంది. ముల్తానీ మట్టిలో హైడ్రేటెడ్ అల్యూమినియం సిలికేట్‌లు, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం బెంటోనైట్ ఉన్నాయి.
ఫుల్లర్స్ ఎర్త్ అని కూడా పిలువబడే ముల్తానీ మట్టిని సౌందర్య సాధనాల్లో కూడా ఉపయోగిస్తారు. దీని ప్రత్యేక లక్షణాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. అదే సమయంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా చర్మానికి మేలు చేస్తుంది.
ముల్తానీ మట్టి అనేక ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంది. ముఖ్యంగా చర్మానికి ఇది చాలా ప్రయోజనాలను అందిస్తుంది. మొటిమలతో పోరాడుతుంది. జిడ్డును తగ్గిస్తుంది. పిగ్మెంటేషన్‌ను నయం చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మరియు మృదువుగా చేస్తుంది. ముల్తానీ మట్టి చర్మాన్ని టోన్ చేయడానికి చాలా సహాయపడుతుంది. ఫలితంగా ఇది ముడతలు, వదులుగా ఉండే చర్మం, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముల్తానీ మట్టి చర్మాన్ని అందంగా తయారయ్యేలా చేస్తుంది.
ముల్తానీ మట్టి వేడి, ఎండలో కాలిపోయిన చర్మానికి అద్భుతమైన నివారణ. స్కిన్ టోన్ మెరుగుపరచడానికి దీనిని ఉపయోగించవచ్చు. ముల్తానీ మట్టి మొటిమలను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ప్రతిరోజూ ఉపయోగించవచ్చు. ముల్తానీ మట్టి చర్మం నుండి అదనపు నూనెను తొలగించడానికి, పగుళ్లను నివారించడానికి ఉపయోగించవచ్చు. ఇది చర్మంలోని కాలుష్య కణాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
ముల్తానీ మట్టి ముఖంపై ఉండే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సమర్థవంతమైన యాంటీబయాటిక్ అని చెప్పవచ్చు. గాయాలు సోకకుండా నిరోధించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. ముల్తానీ మట్టిని వివిధ పదార్థాలతో కలపవచ్చు. ఇది మీ ముఖం కాంతివంతంగా, మృధువుగా మారేలా చేస్తుంది.
నీటితో ముల్తానీ మట్టిని నేరుగా ఉపయోగించవచ్చు. పాలతో ముల్తానీ మట్టిని కలుపుకోవచ్చు. రోజ్ వాటర్, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, నిమ్మరసం, తేనె, బొప్పాయి, నెయ్యి, పసుపు, కలబంద, గుడ్డులోని తెల్లసొన, పెరుగుతో ముల్తానీ మట్టిని కలపవచ్చు.
వేసవిలో సూర్యరశ్మికి చర్మం త్వరగా పాడైపోతుంది. అలాంటి సమయంలో ముల్తానీ మట్టి మీ చర్మాన్ని కాపాడుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. ప్రతివారుమే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొంత మంది తమ అందాన్ని కాపాడుకునేందుకు బ్యూటీ పార్లర్ వెళ్తుంటారు. ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. అందరూ ఎప్పటికీ ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేరు. ముల్తానీ మట్టిని ఇందుకోసం వాడుకోవచ్చు.
అందం పెంచడానికి అద్భుతమైన సౌందర్య సాధనం ముల్తాని మట్టి. మీ చర్మాన్ని కాపాడుకోవడానికి, చర్మం రంగు పెరగడంతో పాటు వివిధ రకాల చర్మ సమస్యలు వచ్చినా అరికట్టవచ్చు. ఎందుచేతనంటే ముల్తాని మట్టిలో చర్మ సమస్యలకు సంబంధించిన లక్షణాలు చాలా ఉన్నాయి.
ముఖం రంగును పెంచడానికి ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ముల్తానీ మట్టితో ఇంట్లోనే ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోండి. పైన చెప్పిన పదార్థాలతో దీనిని కలపండి. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతో మాస్క్ వేసుకుంటే చర్మం రంగు పెరగడంతో పాటు, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.