Makhana for Men: ఫూల్ మఖానా పురుషులకు వరం, పాలలో కలుపుకుని తింటే లాభాలివే
Makhana for Men: మఖానా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. దీన్ని స్నాక్ లాగా, ఉపవాస సమయంలో తినడానికి ఇష్టపడతారు. అయితే ఇవి పురుషులకు ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా? ఎలాగో తెలుసుకోండి. మఖానాను పాలలో కలుపుకుని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.
గత కొన్ని రోజులుగా ఫూల్ మఖానా లాభాల గురించి ఎక్కువగానే మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా అనారోగ్యకరమైన స్నాక్స్‌కు మఖానాను ప్రత్యామ్నాయంగా తింటున్నారు చాలా మంది. దీంతో రకరకాల స్నాక్స్ చేసుకోవచ్చు కూడా. పిల్లలకూ వీటిని ఎక్కువగానే తినిపిస్తున్నారు. దీంట్లో ఉన్న పోషకాలే దానికి కారణం. అయితే మఖానా వల్ల పురుషుల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చాలా మందికి తెలీదు. మఖానా పురుషుల లైంగిక ఆరోగ్యానికి ఎలా సాయపడుతుందో తెల్సుకోండి.
మఖానా లాభాలు:
1) శుక్రకణాల నాణ్యత, సంఖ్య:
ఫూల్ మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మఖానాలో స్పెర్మ్ నాణ్యత, కౌంట్ మెరుగుపరిచే లక్షణాలు ఉన్నాయి.
2) కండరాల అభివృద్ధి:
మఖానాలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది.
3) ఎముకలకు మంచిది:
మఖానాలో ఫాస్పరస్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీన్ని రోజువారీ స్నాక్స్‌గా తీసుకోవచ్చు.
4) గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ:
మఖానాకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో మఖానా రక్తంలోకి గ్లుకోజ్ విడుదలను నెమ్మది చేస్తుంది. దీనివల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఇది మంచి స్నాక్.
మఖానాను పాలలో కలిపి తింటే లాభాలు:
మఖానాను ఏ విధంగానైనా ఆహారంలో చేర్చుకోవచ్చు. మఖానాలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. పాలలో శక్తిని ఇవ్వడానికి సహాయపడే పోషకాలు కూడా వీటిలో ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల మీకు మరింత శక్తి లభిస్తుంది.
మఖానా రోజూ తినవచ్చా?
అవును, మఖానాలను రోజూ తిన్నా ఎలాంటి నష్టం ఉండదు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడతాయి. అధిక యాంటీఆక్సిడెంట్లు ఉన్న కారణంగా ఇది గొప్ప యాంటీ ఏజింగ్ పదార్ధం. దాని అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, శరీరంపై మఖానా యొక్క ప్రతికూల ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల అలెర్జీలు, కడుపు సమస్యలు మరియు ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి.