Blood Donor Day : ప్రాణాన్ని రక్షించడానికే కాదు.. మంచి ఆరోగ్యానికి కూడా..
అవసరమైన రోగులకు సురక్షితమైన రక్తం అందించి వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానాన్ని అందరూ చేయాలి. రక్తదానంపై అవగాహన కల్పిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14వ తేదీన ప్రతి సంవత్సరం రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే రక్త దానం చేయడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
World Blood Donor Day 2022 : ప్రాణాలను రక్షించే కానుకగా రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపేందుకు.. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సదస్సులు నిర్వహించి.. ప్రజలు రక్తదానం చేయడానికి, రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు. రక్తదానం అంటే ప్రాణాలను కాపాడటం మాత్రమే కాదు.. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో మీరు తెలుసుకుని.. ఎదుటివారి ప్రాణాలు రక్షిస్తూ.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బరువు తగ్గడం
సకాలంలో రక్తదానం చేయడం వల్ల బరువు తగ్గడంతోపాటు.. ఆరోగ్యవంతమైన ఫిట్‌నెస్ పొందవచ్చు. అయితే దీనిని కేవలం బరువు తగ్గించే ప్రణాళికగా మాత్రం భావించకూడదు అంటున్నారు వైద్యులు. రక్తదానం చేసే ముందు వైద్యుని సంప్రదించి.. మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా.. రక్తదానం చేయాలి. అంతేకానీ మీకు నచ్చినప్పుడు వెళ్లి రక్తదానం చేయడం ప్రమాదకరం అంటున్నారు.
2. హిమోక్రోమాటోసిస్ నివారణ
రక్తదానం చేయడం వల్ల హీమోక్రోమాటోసిస్ అభివృద్ధిని నిరోధించవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ సమయంలో శరీరం ఇనుమును అధికంగా శోషిస్తుంది. కాబట్టి అది హీమోక్రోమాటోసిస్ను నిరోధిస్తోంది. కానీ రక్తదాన అర్హత ప్రమాణాలు కచ్చితంగా నిర్ధారించుకోవడం అత్యవసరం.
3. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి
క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల ఐరన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో పెద్ద మొత్తంలో ఐరన్ ఏర్పడటం వలన ఆక్సీకరణ నష్టం కలుగుతుంది. ఇది వృద్ధాప్యం, గుండెపోటులు, స్ట్రోకులు మొదలైన వాటిని వేగవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు నిరూపించారు.
4. క్యాన్సర్ రిస్క్ తక్కువ
శరీరంలో ఐరన్ అధికంగా ఉండటం క్యాన్సర్‌కు ఆహ్వానం. రక్తదానం చేయడం ద్వారా.. మీరు ఆరోగ్యకరమైన ఐరన్ స్థాయిలను కలిగి ఉంటారు. తద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
5. కొత్త రక్త కణాల ఉత్పత్తి
రక్తదానం కొత్త రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కోల్పోయిన ఎర్ర రక్త కణాలన్నీ 30 నుంచి 60 రోజుల వ్యవధిలో భర్తీ జరుగుతాయి. కాబట్టి రక్తదానం చేయడం వల్ల కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్