Belly Fat Exercises: వేలాడుతున్న మీ పొట్ట కండరాలను బిగుతుగా చేయడానికి ఈ ఐదు వ్యాయామాలను రోజూ చేయండి!-belly fat exercises to tighten your sagging stomach muscles do five exercises daily ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Belly Fat Exercises: వేలాడుతున్న మీ పొట్ట కండరాలను బిగుతుగా చేయడానికి ఈ ఐదు వ్యాయామాలను రోజూ చేయండి!

Belly Fat Exercises: వేలాడుతున్న మీ పొట్ట కండరాలను బిగుతుగా చేయడానికి ఈ ఐదు వ్యాయామాలను రోజూ చేయండి!

Ramya Sri Marka HT Telugu
Published Feb 09, 2025 02:30 PM IST

Belly Fat Exercises: పొట్ట కండరాలు జారిపోయి వేలాడుతూ కనిపిస్తుందా. వీటిని బిగుతుగా మార్చేందుకు క్రంచెస్ వ్యాయామాలకు బదులుగా ఈ 5 సులభమైన వ్యాయామాలు చేయండి. ఫిట్‌గా, అందంగా కనిపించండి.

వేలాడుతున్న మీ పొట్ట కండరాలను బిగుతుగా చేయడానికి ఈ ఐదు వ్యాయామాలను రోజూ చేయండి!
వేలాడుతున్న మీ పొట్ట కండరాలను బిగుతుగా చేయడానికి ఈ ఐదు వ్యాయామాలను రోజూ చేయండి! (shutterstock)

వేలాడే పొట్ట ఇప్పుడు చాలా మందిలో సమస్యగా మారింది. మారుతున్న జీవనశైలి కారణంగానో లేక తినే ఆహారాల కారణంగానో ప్రసవం అయిన మహిళలు మాత్రమే కాదు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. తమ పొట్ట కండరాలను బిగుతుగా చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు. వేలాడే పొట్టను తగ్గించుకోవడానికి డైటింగ్, వాకింగ్ తో పాటు కొన్ని క్రంచెస్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం పొందలేకపోతున్నారు. మీరు కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే మీ పొట్ట కండరాలను బిగుతుగా చేసుకుని, వేలాడే పొట్టను తగ్గించుకోవాలనుకుంటే, క్రంచెస్ కాదు ఈ 5 రకాల వ్యాయామాలను రోజువారీ కార్యక్రమంలో చేర్చుకోవాలంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.

పొట్ట కండరాలను బిగుతుగా చేసే సులభమైన వ్యాయామాలు:

ఫ్లటర్ (Flutter)

పొట్ట కండరాలను బిగుతుగా చేయడంలో ఫటర్ మీకు చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు యోగా మ్యాట్ మీద వెళ్లకిలా పడుకుని, రెండు కాళ్ళను 30 డిగ్రీల కోణంలో పైకి కిందికి కదిలిస్తూ ఉండాలి. దీన్ని 30-40 సెకన్లతో ప్రారంభించి ఒకటి లేదా రెండు నిమిషాల వరకు చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఈ వ్యాయామం పొట్ట కండరాలను బిగుతుగా చేయడంలో సహాయపడుతుంది. హిప్-ఫ్లెక్సర్ కండరాలు, క్వాడ్‌లు, లోయర్-బ్యాక్ కండరాలు బలపడతాయి. హృదయ స్పందన రేటు పెరుగి, హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది, దిగువ పొత్తికడుపు కండరాలు కూడా బలపడతాయి.

రివర్స్ టేబుల్ టాప్ (Reverse Table Top)

ఏ చైర్ లేదా టేబుల్ సహాయం లేకుండా, అరచేతులు, పాదాలను నేలకు ఆనించి నడుమును, హిప్ భాగాన్ని పైకి లేపుతూ ఈ వ్యాయమాన్ని చేయాలి. ఇది మీ పెల్విక్ ఫ్లోర్ కండరాలతో పాటు కోర్ కండరాలను బిగుతుగా చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల పొట్ట కండరాలు బిగుతుగా అవుతాయి. దీన్ని ప్రతిరోజూ చేయడం అలవాటు చేసుకుంటే వేలాడే పొట్ట మీ జోలికి కూడా రాదు.

సైడ్ ప్లాంక్ (Side Plank)

ముందుగా నేల మీద ఒకవైపు పడుకుని ఎడమ కాలు, ఎడమ మోచేయిని నేలకు ఆనించి వాటి మీద శరీర బరువును ఉంచి నడుమును, హిప్ భాగాన్ని పైకి లేపండి! 40 సెకన్ల నుండి ఒక నిమిషం వరకు రోజూ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఇది మీ పొట్ట కండరాలను బిగుతుగా మార్చడానికి చాలా బాగా సహాయపడే వ్యాయామం.

ప్లాంక్ అండ్ లెగ్ లిఫ్ట్ (Plank and Leg Lift)

బోర్ల పడుకుని తర్వాత రెండు మోచేతులపై బరువు పెట్టి భుజం, పిరుదులు, నడుము భాగాన్ని పైకి లేపి ఉంచి రెండు కాళ్లను ఒక్కొక్కటిగా లేపుతూ కిందకు దించడమే ప్లాంక్ అండ్ లెగ్ లిఫ్ ఎక్సర్‌సైజ్. వ్యాయామాన్ని రోజూ కనీసం ఒక నిమిషం చేయడానికి ప్రాక్టీస్ చేయడం ద్వారా పొట్ట, భుజం, నడుము, పిరుదుల కండరాలు బలంగా, బిగుతుగా తయారవుతాయి.

స్ట్రెయిట్ లెగ్ లిఫ్ట్ అప్ (Straight Leg Lift Up)

నిటారుగా యోగా మాట్ మీద పడుకుని, రెండు కాళ్ళను చాలా స్థిరంగా ఉంచండి. ఇప్పుడు నడుము నుండి పై భాగాన్ని పైకి లేపి, చేతులతో కాళ్ళను తాకడానికి ప్రయత్నించండి. ఈ వ్యాయామం అంతర్గత కోర్ కండరాలను బిగుతుగా చేయడంలో సహాయపడుతుంది. వేలాడే పొట్ట సమస్యకు దీర్ఘకాలికంగా గుడ్ బై చెబుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం