Beetroot Chilla: బీట్‌రూట్‌తో చేసే అట్లు ఎంతో రుచిగా ఉంటాయి, ఇవి ఎంతో ఆరోగ్యం-beetroot chilla are very tasty and very healthy know the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot Chilla: బీట్‌రూట్‌తో చేసే అట్లు ఎంతో రుచిగా ఉంటాయి, ఇవి ఎంతో ఆరోగ్యం

Beetroot Chilla: బీట్‌రూట్‌తో చేసే అట్లు ఎంతో రుచిగా ఉంటాయి, ఇవి ఎంతో ఆరోగ్యం

Haritha Chappa HT Telugu
Published Feb 10, 2025 11:30 AM IST

Beetroot Chilla: బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో చేసే అట్లు కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. అల్పాహారం కోసం బీట్ రూట్ చిల్లాను తయారు చేయవచ్చు. రెసిపీ ఇక్కడ చూడండి.

బీట్ రూట్ చిల్లా రెసిపీ
బీట్ రూట్ చిల్లా రెసిపీ (youtube)

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. బీట్ రూట్ తినడం వల్ల రక్తహీనతకు మేలు జరుగుతుంది. చాలా మంది దీనిని సలాడ్ గా తినడానికి ఇష్టపడతారు. కొంతమంది బీట్ రూట్ రసం తాగుతారు. లేదా కొన్ని వంటకాల్లో కలుపుకుని తింటారు. బీట్ రూట్ సహాయంతో టేస్టీ చీలాను తయారు చేసుకోవచ్చు. అదేనండి బీట్ రూట్ అట్లు వండుకోవచ్చు. ఈ అట్టును పిల్లల టిఫిన్ లో వేసి బ్రేక్ ఫాస్ట్ గా మీరే తినవచ్చు.

బీట్ రూట్ అట్లు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

శెనగపిండి - ఒక కప్పు

బీట్ రూట్ - రెండు

ఓట్స్ పౌడర్ - అర కప్పు

ఆవాలు - అరస్పూను

నెయ్యి - రెండు స్పూన్లు

కారం - అర స్పూను

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

ఉల్లిపాయ తరుగు - పావు కప్పు

పనీర్ తురుము - యాభై గ్రాములు

బీట్ రూట్ అట్లు రెసిపీ

  1. బీట్‌రూట్ కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అవి పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక గిన్నెలో శెగనపిండి, ఓట్స్ పిండి, కారం, ఉప్పు, ఆవాలు వేసి బాగా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు బీట్ రూట్ ను మెత్తగా రుబ్బి అందులో వేసి కలుపుకోవాలి.
  4. ఈ బీట్ రూట్ ప్యూరీని ఇతర పదార్థాలతో మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి అందమైన ఎరుపు-పింక్ కలర్ పిండిలా తయారు చేసుకోవాలి.
  5. అవసరమైతే నీరు కలపండి లేదా వదిలేయండి.
  6. ఇప్పుడు పనీర్ ను తురిమి ఫిల్లింగ్ తయారుచేసి తర్వాత పచ్చి కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయ వేసి బాగా కలపాలి.
  7. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి.
  8. నూనె వేడెక్కాక ఆ పిండితో అట్టులా వేసుకోవాలి.
  9. ఇప్పుడు రెండు వైపుల నుంచి లేత గోధుమ రంగులోకి, క్రిస్ప్ గా మారే వరకు ఉడికించాలి.
  10. తర్వాత పనీర్ ఫిల్లింగ్ ను ఒక వైపు వేసి మడతపెట్టాలి. అంతే అట్లు రెడీగా ఉన్నట్టే.
  11. అన్నింటిని ఒకే విధంగా తయారుచేసుకుని పెరుగు, గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి.

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే పోషకాలు కూడా ఎక్కువే. పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని తినాల్సిన అవసరం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం