Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం-beetroot cheela recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Haritha Chappa HT Telugu
May 16, 2024 06:00 AM IST

Beetroot Cheela: బీట్ రూట్ తినని పిల్లలు ఎంతోమంది. అలాంటి వారికి బీట్రూట్ అట్లు చేసి ఇవ్వండి. ఇష్టంగా తింటారు.

బీట్ రూట్ రెసిపీ
బీట్ రూట్ రెసిపీ

Beetroot Cheela: బీట్రూట్లతో చేసిన రెసిపీలను ఇష్టపడే వారి సంఖ్య తక్కువే. ఎందుకంటే అది కాస్త పచ్చివాసన వేస్తుంది. నిజానికి బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడేస్తుంది. ముఖ్యంగా పిల్లలు, మహిళలు బీట్రూట్ ను కచ్చితంగా తినాలి. కానీ దాన్ని తినేవారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. ఎవరైతే బీట్రూట్ ని కూరగా తినడానికి ఇష్టపడరు. వారు ఇలా బీట్రూట్ అట్లు చేసుకొని తినండి. ఇవి టేస్టీగా ఉంటాయి. కొబ్బరి చట్నీతో తింటే అదిరిపోతాయి. వీటిని చేయడం కూడా చాలా సులువు.

బీట్రూట్ అట్లు రెసిపీకి కావలసిన పదార్థాలు

బీట్రూట్ - ఒకటి

ఉప్పు - రుచికి సరిపడా

శెనగపిండి - అరకప్పు

కారం - ఒక స్పూను

మిరియాల పొడి - అర స్పూను

బీట్రూట్ అట్లు రెసిపీ

1. బీట్రూట్‌ను శుభ్రంగా కడిగి పైన పొట్టును తీసేయాలి.

2. మిగతా భాగాన్ని చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.

3. ఆమె ఆ పేస్టును ఒక గిన్నెలో వేయాలి.

4. ఆ గిన్నెలోనే శెనగపిండి, ఉప్పు, మిరియాలు, కారం వేసి బాగా కలుపుకోవాలి.

5. అవసరమైనంత వరకు నీళ్లు కూడా పోసుకోవాలి.

6. ఒక పావుగంట సేపు దాన్ని వదిలేయాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి.

8. ఈ మిశ్రమాన్ని అట్లు పోసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.

9. అంతే బీట్రూట్ అట్లు రెడీ అయినట్టే. ఇవి పింక్ కలర్ లో వస్తాయి.

10. ఏ చట్నీతో తిన్నా ఇవి టేస్టీ గానే ఉంటాయి. ముఖ్యంగా టమోటో, కొబ్బరి చట్నీతో అదిరిపోతాయి.

బీట్రూట్ వల్ల కలిగే ప్రయోజనాలను ఎంత చెప్పినా తక్కువే. దీన్ని తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం కలుగుతుంది. బీట్రూట్ కూర తిన్నా, బీట్రూట్ జ్యూస్ తాగినా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది శక్తిని పెంచుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకోవడంలో ఇది ముందుంటుంది. కాబట్టి ప్రతిరోజు ఒక అర గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగినందుకు ప్రయత్నించండి. లేదా అప్పుడప్పుడు ఇలా బీట్రూట్ అట్లను వేసుకోండి. ఏదో రకంగా బీట్రూట్ ని ఆహారంలో భాగం చేసుకుంటే అన్ని విధాల మేలే జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు పిల్లలు దీన్ని తినడం చాలా ముఖ్యం.

Whats_app_banner