Beetroot for Intimate Health: శృంగార జీవితానికి బీట్‍రూట్ ఓ వరం.. కోరిక పెంచడం సహా లాభాలు ఇవే-beetroot can spice up romantic drive and boost your performance on bed intimate health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot For Intimate Health: శృంగార జీవితానికి బీట్‍రూట్ ఓ వరం.. కోరిక పెంచడం సహా లాభాలు ఇవే

Beetroot for Intimate Health: శృంగార జీవితానికి బీట్‍రూట్ ఓ వరం.. కోరిక పెంచడం సహా లాభాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 05, 2024 12:30 PM IST

Beetroot for Intimate Health: బీట్‍రూట్ శృంగారానికి కూడా చాలా మేలు చేస్తుంది. బెడ్‍పై పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉండేలా సహకరిస్తుంది. బీట్‍రూట్ వల్ల శృంగార జీవితానికి ప్రయోజనాలు ఏవో.. ఎలానో ఇక్కడ తెలుసుకోండి.

Beetroot for Intimate Health: శృంగార జీవితానికి బీట్‍రూట్ ఓ వరం.. కోరిక పెంచడం సహా లాభాలు ఇవే
Beetroot for Intimate Health: శృంగార జీవితానికి బీట్‍రూట్ ఓ వరం.. కోరిక పెంచడం సహా లాభాలు ఇవే

బీట్‍రూట్‍లో ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు సహా చాలా పోషకాలు ఉంటాయి. అయితే, దీన్ని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. టేస్ట్ అంతగా నచ్చదని అంటుంటారు. అయితే, ఈ దంప కూరగాయ రెగ్యులర్‌గా తినడం వల్ల చాలా ఆరోగ్యానికి లాభాలు ఉంటాయి. అలాగే, శృంగార జీవితానికి కూడా బీట్‍రూట్ ఓ వరంగా ఉంది. ఇది తింటే శృంగారపరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయి. బెడ్‍ మీ పర్ఫార్మెన్స్‌ను బీట్‍రూట్ పెంచగలదు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

హర్మోన్ల ఉత్పత్తి

బీట్‍రూట్‍లో బోరోన్ అనే మినరల్ ఎక్కువగా ఉంటుంది. శృంగార హార్మోన్లుగా పిలిచే ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్‍ల ఉత్పత్తిని ఇది పెంచగలదు. దీంతో బీట్‍రూట్ తింటే లైంగిక ప్రక్రియకు ఉపయోగపడుతుంది. శృంగారం మరింత మెరుగ్గా ఉండేలా చేయగలదు.

కోరిక పెరిగేలా..

శృంగారం చేయాలనే కోరికను బీట్‍రూట్ పెంచగలదు. బీట్‍రూట్‍లో నైట్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది తింటే నైట్రిక్ యాసిడ్‍గా మారుతుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగయ్యేందుకు నైట్రిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. లైంగిక పనితీరు కోసం రక్తప్రసరణ పెరగడం చాలా ముఖ్యం. దీనివల్ల శృంగారం చేయాలనే వాంఛ అధికం అవుతుంది.

ఎనర్జీని పెంచుతుంది

బీట్‍రూట్‍లో బీటైన్, బోరోన్, ఐరన్ సహా చాలా పోషకాలు ఉంటాయి. వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. శృంగారం చేసేందుకు ఎనర్జీ లెవెల్స్, ఉత్సాహం పెరుగుతాయి. ఎక్కువ సేపు లైంగిక చర్యలో పాల్గొనే స్టామినా ఉండేందుకు బీట్‍రూట్ సహకరిస్తుంది.

ఇలా తీసుకోవచ్చు

జ్యూస్‍గా.. బీట్‍రూట్‍ను వివిధ పద్ధతుల్లో తీసుకోవచ్చు. బీట్‍రూట్ జ్యూస్ మంచి ఆప్షన్‍గా ఉంటుంది. ముందుగా రెండు పెద్ద బీట్‍రూట్‍లు, తీపి కోసం ఓ యాపిల్‍ను ముక్కులుగా చేసుకొని ఓ గ్లాస్ నీరు వేసి మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. మరింత టేస్ట్ కావాలంటే ఓ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు.

సలాడ్‍లో.. మీరు తినే సలాడ్‍లో బీట్‍రూట్ ముక్కలను యాడ్ చేసుకోవచ్చు. కాస్త ఉడికించుకున్న బీట్‍రూట్ ముక్కలను సలాడ్‍లో వేసుకోవచ్చు. రెండు ఉడికించుకొని తరిగిన బీట్‍రూట్ ముక్కలు, కట్ చేసిన పాలకూర లాంటి ఆకుకూరలు, కాస్త టీజ్, వేయించిన వాల్‍నట్స్, బాదం, కాస్త నిమ్మరసం, టేస్ట్ కోసం తేనె, కాస్త ఉప్పు వేసుకొని సలాడ్‍లా తయారు చేసుకోవచ్చు.

రోస్ట్ చేసుకొని.. బీట్‍రూట్‍ను వేయించుకొని కూడా తినొచ్చు. బీట్‍రూట్‍ను ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత వాటిపై ఉప్పు, మిరయాల పొడి వేసుకోవచ్చు. అయితే, ఈ ఫ్రై కోసం ఆలివ్ ఆయిల్ వాడితే బాగుంటుంది.

బీట్‍రూట్ కర్రీ, బీట్‍రూట్ సూప్, బీట్‍రూట్ స్మూతి ఇలా వివిధ రకాలుగా ఈ కూరగాయను తీసుకోవచ్చు. బీట్‍రూట్ రెగ్యులర్‌గా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. శరీరంలో ఎనర్జీని పెంచగలదు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బీట్‍రూట్ మంచి ఆప్షన్‍గా ఉంటుంది. జీర్ణక్రియకు, మెదడు పనితీరుకు, కాలేయ ఆరోగ్యానికి కూడా బీట్‍రూట్ మంచి చేస్తుంది.

Whats_app_banner