Beauty Tips: 60 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్లలా కనిపించాలనుకుంటున్నారా? ఈ 5 పండ్లు తినండి! వయస్సును దాచేయండి!
Beauty Tips: వయస్సు పెరిగిపోతుందని ఆందోళన పడకండి. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా వృద్ధాప్య లక్షణాలు మీ చర్మంపై కనిపించకుండా వాయిదా వేసుకోవచ్చు. ఎప్పటికీ మెరిసేలా, యవ్వనంగా ఉంచే కొన్ని యాంటీ ఏజింగ్ పండ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

వృద్ధాప్యం రాకముందే ముసలివారిగా కనిపించాలని ఎవ్వరూ కోరుకోరు. అలాగే ఒకవేళ వృద్ధాప్యం వచ్చినా ఆ ఛాయలు కనిపించకుండా ఉండేందుకే ప్రయత్నిస్తుంటారు. అందుకే మార్కెట్లో యాంటీ ఏజింగ్ ఉత్పత్తులకు అంత డిమాండ్. మీరెన్ని స్కిన్ కేర్ ప్రొడక్టులు వినియోగించినా, ఎంత అందంగా ఉండాలని ప్రయత్నించినా ఆహారంలో మార్పులు తీసుకోకుంటే అది సాధ్యపడదు. చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా, ముడతలు లేకుండా ఉంచుకోవడానికి ప్రత్యేక సంరక్షణ తీసుకోవాలి. చర్మంపై అదే మెరుపు కొనసాగడానికి మీ ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోండి. వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదించే కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మతో అందే కొలాజెన్
మీ ఆహారంలో పోషకాలతో నిండిన, రుచికరమైన దానిమ్మను చేర్చుకోండి. ఇది మీ ఆరోగ్యానికే కాకుండా అందానికి చాలా మేలు కలుగజేస్తుంది. దానిమ్మలో పాలీఫినోల్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల చర్మం సాగేతనం పెంచి ముడతలు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా తేమ, మెరుపును కాపాడుతుంది.
చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచే పెర్సిమన్
చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచడంలో ఎక్సోటిక్ పండ్లలో ఒకటైన పెర్సిమన్ పండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెర్సిమన్‌లో పుష్కలంగా దొరికే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం చర్మానికి మేలు చేస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం నిర్మాణంలో మార్పులు తీసుకొస్తుంది. ఫలితంగా సాగేతత్వం పెరిగి ముడతలు రాకుండా చేస్తుంది. రోజూ పెర్సిమన్ తినడం వల్ల దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదిస్తాయి. దీనివల్ల చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటుంది.
స్ట్రాబెర్రీ కూడా చర్మానికి సూపర్ ఫుడ్
సైజులో చిన్నగా కనిపించే స్ట్రాబెర్రీలు రుచికే కాదు, మీ చర్మానికి కూడా గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని UV కిరణాల ద్వారా కలిగే నష్టం నుంచి రక్షించడానికి, కొల్లాజెన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. స్ట్రాబెర్రీలు తినడం వల్ల ముఖం మెరుస్తుంది. అలాగే రంగు మచ్చలను తొలగించడంలో కూడా ఇవి చాలా సహాయపడతాయి.
మెరిసే చర్మం కావాలనుకుంటే బ్లూబెర్రీ తినండి
చర్మంపై కనిపించే వృద్ధాప్య లక్షణాలను నెమ్మదించే ప్రక్రియలో ప్రభావవంతంగా పనిచేసే పండు బ్లూబెర్రీ. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6 పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంతో పాటు మొత్తం ఆరోగ్యానికి చాలా మంచివి. బ్లూబెర్రీలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుండి కాపాడి, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా, ముడతలు లేకుండా ఉంటుంది.
ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి బొప్పాయి
బొప్పాయి కూడా మన చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు A, C, B, K, E వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మంచివి. ఇవన్నీ చర్మంపై ఫ్రీ రాడికల్ నష్టంతో పోరాడతాయి. దీనివల్ల వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది. చర్మం పొడిబారడాన్ని, ముడతలను తగ్గించడంలో కూడా బొప్పాయి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సంబంధిత కథనం