Dark Neck Remedies: మెడ నల్లగా మారి చిరాకుగా కనిపిస్తుందా? అయితే ఈ సింపుల్ హోం రెమిడీస్ ట్రై చేయండి!-beauty tips try this easy and best home remedies for neck darkness ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dark Neck Remedies: మెడ నల్లగా మారి చిరాకుగా కనిపిస్తుందా? అయితే ఈ సింపుల్ హోం రెమిడీస్ ట్రై చేయండి!

Dark Neck Remedies: మెడ నల్లగా మారి చిరాకుగా కనిపిస్తుందా? అయితే ఈ సింపుల్ హోం రెమిడీస్ ట్రై చేయండి!

Ramya Sri Marka HT Telugu

Dark Neck Remedies: మెడ భాగం మొత్తం నల్లగా మారి చూడటానికి చాలా చికాకుగా కనిపిస్తుందా? దీని వల్ల అందిరిలోనూ అసౌకర్యంగా ఫీలవుతున్నారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే. ఈ సింపుల్ హోం రెమిడీస్ తో క్షణాల్లో మీ మెడ నలుపు తగ్గిపోతుంది. అవేంటో ఓ లుక్కేసి ట్రై చేసేయండి మరి!

సొగసైన మెడ కోసం.. ఈ టిప్స్ పాటించండి

అందంగా కనిపించడం అంటే కేవలం ముఖం మాత్రమే కాదు కదా! చేతులు, కాళ్లు, మెడ భాగం కూడా శుభ్రంగా, మెరుస్తూ కనిపించాలి. కానీ కొంత మందికి మెడ భాగం మొత్తం పూర్తిగా నల్లగా మారిపోయి చూడటానికి చాలా చిరాకుగా కనిపిస్తుంది. దీని వల్ల వాళ్లు ఎక్కడికెళ్లినా ఇబ్బందిగా, అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఇలాంటి సమస్యే మీకు కూడా ఉంటే ఈ చిట్కాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ సింపుల్ చిట్కాలతో మీ మెడను శుభ్రం చేసుకున్నారంటే మెడ నలుపంతా క్షణాల్లో తగ్గిపోతుంది. ఇందుకోసం మీకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో మీ మెడను తెల్లగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా మీ మెడ నలుపును మాయం చేసే ఆ చిట్కాలేంటో చూసేద్దాం రండి..

మెడ నలుపును తగ్గించే ఐదు ఇంటి చిట్కాలు

చిట్కా నెం-1:

కావలసిన పదార్థాలు:

  • ఒక చెంచా బియ్యం పిండి,
  • అర టీస్పూన్ బేకింగ్ సోడా,
  • ఒక టీస్పూన్ కాఫీ పౌడర్ ,
  • అరచెక్క నిమ్మరసం
  1. పైన ఉన్న పదార్థాలన్నింటినీ ఒక బౌల్‌లో వేసుకుని బాగా కలపండి.
  2. తర్వాత ఈ మిశ్రమాన్ని మెడ చుట్టూ అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి. తర్వాత గోరు వెచ్చటి లేదా చల్లటి నీటితో కడగండి.

చిట్కా నెం-2:

కావాల్సిన పదార్థాలు:

  • ఒక చిన్న ముక్క స్పటిక పొడి(పటిక),
  • ఒక చెంచా ముల్తానీ మిట్టీ,
  • నీరు
  1. స్పటిక పొడి, ముల్తానీ మిట్టీని ఒక బౌల్ లో తీసుకుని కాసిన్ని నీళ్లు పోసి చిక్కటి పేస్టులా తయారు చేయండి.
  2. తర్వాత ఈ పేస్టును మెడ చుట్టూ అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసేయండి.

చిట్కా నెం-3

కావాల్సిన పదార్థాలు:

  • బంగాళదుంప
  • పసుపు,
  • టూత్ పేస్ట్,
  • కొబ్బరి నూనె
  1. ముందుగా బంగాళదుంపను సగానికి కట్ చేసి దానికి చాకుతో లోపలి గీతలు పెట్టండి.తర్వాత దీని మీద పసుపు, టూత్ పేస్ట్, కొబ్బరినూనె వేయండి.
  2. ఇప్పుడు ఈ బంగాళాదుంపతో మెడ నల్లగా మారిన చోటంతా 5 నుంచి 10 నిమిషాల పాటు రుద్దండి. తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు మెడపై ఈ మిశ్రమాన్ని అలాగే వదిలేసి తర్వాత నీటితో కడిగేయండి.

చిట్కా నెం- 4

కావాల్సిన పదార్థాలు:

  • కలబంద
  • పసుపు
  • కాఫీ పొడి
  • చక్కెర
  • నిమ్మరసం
  1. ఒక కలబంద ముక్కను తీసుకుని దాన్ని మధ్యలో కట్ చేసుకుని గుజ్జుకు గాట్లు పెట్టండి. ఇప్పుడు దాని మీద పసుపు, కాఫీ పొడి, చక్కెరతో పాటు నిమ్మరసం పోసి మెడంతా బాగా రుద్దుతూ అప్లై చేయండి.
  2. ఇలా రుద్దిన తర్వాత పావు గంట పాటు అలాగే ఉండి తర్వాత నీటితో శుభ్రం చేసేయండి.

చిట్కా నెం-5

కావాల్సిన పదార్థాలు:

  • టమాటా
  • టూత్ పేస్ట్
  • ఉప్పు
  • కాఫీ పౌడర్
  • బేకింగ్ సోడా
  • నిమ్మరసం
  1. ముందుగా సగం కట్ చేసిన టమాటాను తీసుకుని దాని మీద మీకు నచ్చిన పేస్ట్, ఉప్పు, కాఫీ పౌడర్, బేకింగ్ సోడాతో పాటు అర చెక్క నిమ్మరసం వేయండి.
  2. ఇప్పుడీ టమాటా ముక్కతో మెడ మొత్తాన్ని బాగా రుద్దండి. పావు గంట తర్వాత గోరు వెచ్చటి లేదా చల్లని నీటితో శుభ్రంగా కడిగేయండి.

ఈ చిట్కాలన్నీ కేవలం మెడ భాగంలో మాత్రమే కాదు మొచేతులు, మోకాళ్లు, చంకలతో పాలు నల్లగా ఉన్న శరీర భాగాలను కూడా అప్లై చేసుకోవచ్చు. బాగా నల్లగా ఉన్న వారు కనీసం వారానికి రెండు సార్లు ఈ చిట్కాలను పాటించాలి. ఈ చిట్కాలు పాటించడం వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బందులు కలగవు. మీ మెడ నలుపు అంతా పోయి అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం