ఉదయం లేవగానే ఈ 5 కూరగాయలతో ముఖాన్ని రుద్దారంటే మేకప్ లేకుండానే మీ ముఖం మెరిసిపోతుంది!-beauty tips skip the makeup use these 5 vegetables for a bright morning glow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఉదయం లేవగానే ఈ 5 కూరగాయలతో ముఖాన్ని రుద్దారంటే మేకప్ లేకుండానే మీ ముఖం మెరిసిపోతుంది!

ఉదయం లేవగానే ఈ 5 కూరగాయలతో ముఖాన్ని రుద్దారంటే మేకప్ లేకుండానే మీ ముఖం మెరిసిపోతుంది!

Ramya Sri Marka HT Telugu

ఖరీదైన క్రీములతో విసిగిపోయారా? రసాయనాల భయంతో వాటిని వాడలేకపోతున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన పరిష్కారం. మీ వంటింట్లోని ఈ 5 రకాల కూరగాయలతో చర్మాన్ని సహజంగా మెరిసేలా, ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు. అవేంటో వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి..

సహజ సంరక్షణతో నిగనిగలాడుతున్న చర్మం (Shutterstock)

మచ్చలు లేని మెరిసే చర్మం కోసం చాలా మంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించడం కోసం సబ్బుల నుంచి ఫేష్ వాష్‌ల వరకూ చాలా ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. కానీ చాలా సార్లు ఈ ఖరీదైన క్రీములు, సీరమ్‌ల వల్ల జేబు గుల్ల అవడమే తప్ప పెద్దగా ప్రయోజనం ఏం కనిపించదు. పైగా వాటిలో ఉండే అనేక రసాయనాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి మీరు సహజమైన, ప్రభావవంతమైన, బడ్జెట్ ఫ్రెండ్లీ మార్గాన్ని అనుసరించాలనుకుంటే ఇదే మీ కోసమే.

చర్మ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఖర్చు లేకుండా, రసాయనాల భయం లేకుండానే మీ వంటగదిలో ఉండే కొన్ని కూరగాయలతో మీ చర్మాన్ని యవ్వనంగా, మెరిసేలా తయారు చేసుకోవచ్చు. అవును వంటగదిలో ఉండే ఈ సాధారణ కూరగాయలు మీ చర్మానికి లోపలి నుండి పోషణను అందించి సహజమైన మెరుపును ఇస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడటమే కాకుండా మొటిమలు ముడతలు, మచ్చల నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఆ కూరగయాలేంటో వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి.

1. దోసకాయ

దోసకాయ శరీరానికి చలువ చేసేందుకు మాత్రమే కాదు చర్మానికి చాలా ఉపయోగకరమైన కూరగాయ. ఇది చర్మాన్ని చల్లబరచడంతో పాటు లోపలి నుండి హైడ్రేట్ చేస్తుంది. దోసకాయను ముఖంపై రుద్దడం వల్ల టాన్ తొలగిపోతుంది, డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి, చర్మానికి తాజాదనం లభిస్తుంది.

ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా చర్మాన్ని దోసకాయను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి నేరుగా ముఖంపై రుద్దండి. 10 నిమిషాలు పాటు అలాగే ఉంచి ఆ తర్వాత ముఖాన్ని గోరు వెచ్చటి లేదా చల్లటి నీటితో కడుక్కోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.

2. బంగాళాదుంప

పచ్చి బంగాళాదుంపను కూడా చర్మ సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు. నిజానికి బంగాళాదుంపలో బ్లీచింగ్ ఏజెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై మచ్చలను తొలగించి చక్కటి మెరుపును ఇస్తాయి.

ఇందుకోసం మీరు పచ్చి బంగాళాదుంపను తొక్క తీసి తురుముకుని దాని రసం లేదా గుజ్జును లేదంటే ముక్కను ముఖంపై రుద్దండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి 3-4 సార్లు ఇలా చేయడం వల్ల మచ్చలు తొలగిపోవడంతో పాటు చర్మం సహజ మెరుపును సొంతం చేసుకుంటుంది.

3. టమోటా

మీ చర్మం జిడ్డుగా ఉంటే నూనెను నియంత్రించడానికి టమోటా ఉత్తమ ఎంపిక. నిజానికి టమోటాలో 'లైకోపీన్' ఉంటుంది. ఇది చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షిస్తుంది, అనవసరమైన నూనెను నియంత్రిస్తుంది.

దీని కోసం మీరు టమోటాను తీసుకుని కట్ చేసి నేరుగా ముఖంపై మసాజ్ చేస్తూ రుద్దండి. ఇది రంధ్రాలను బిగుతుగా చేయడానికి సహాయపడుతుంది. చర్మం కూడా మెరుస్తుంది.

4. క్యారెట్

క్యారెట్ సహాయంతో కూడా చర్మాన్ని మెరిసేలా తయారు చేసుకోవచ్చు. నిజానికి క్యారెట్‌లో ఉండే 'బీటా కెరోటిన్' చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. దీని కోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు.

ఒక క్యారెట్‌ను తీసుకుని మెత్తగా పేస్టులా తయారు చేసి ఫేస్ ప్యాక్‌లా ముఖానికి పట్టించండి. కాసేపు ఆరని తర్వాత శుభ్రమైన నీటితో ముఖం కడుక్కోండి. ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.

5. సొరకాయ

వంటగదిలో ఉండే సొరకాయ ఆరోగ్యం పరంగానే కాకుండా చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సొరకాయ చర్మాన్ని చల్లబరుస్తుంది, వాపును తగ్గిస్తుంది, డిటాక్సిఫై చేస్తుంది.

చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా చేయడానికి సొరకాయను తురుముకుని ఫేస్ ప్యాక్‌లా తయారు చేసి ముఖానికి పట్టించండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి. వారానికి 2 నుండి 3 సార్లు ఇలా చేయడం వల్ల ముఖంపై మెరుపు వస్తుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.