Rice Flour Skin Care : బియ్యపు పిండితో మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు-beauty tips apply rice flour on face and check result after 10 minutes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rice Flour Skin Care : బియ్యపు పిండితో మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు

Rice Flour Skin Care : బియ్యపు పిండితో మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు

Anand Sai HT Telugu
May 25, 2024 02:00 PM IST

Rice Flour Benefits In Telugu : వేసవిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే మెరిసిపోతుంది. అందుకే బియ్యపు పిండిని ముఖానికి రాయండి.

బియ్యం పిండి ఫేస్ ప్యాక్
బియ్యం పిండి ఫేస్ ప్యాక్

Rice Flour Face Pack In Telugu : ఈ కాలంలో చాలా మంది అందం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం రసాయనాలను ఉపయోగిస్తున్నారు. కానీ అందరి చర్మాలకు క్రీములు పడవు. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే సహజ పదార్థాలతో మీ ముఖాన్ని మెరిసేలా చేసుకోవాలి. ఇందుకోసం మీ ఇంట్లో బియ్యపు పిండి ఉంటే చాలు. పది నిమిషాల్లో మీ ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.

మీరు చాలాసార్లు పార్లర్, సెలూన్‌కి వెళ్లడానికి సమయం లేకుంటే ఇంట్లోనే బియ్యం పిండి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇలా చేస్తే 10 నిమిషాల్లో మీ ముఖం మెరిసిపోతుంది. కొరియన్ చర్మ సంరక్షణలో ఉపయోగించే ప్రధాన మూలకం బియ్యం పిండి. కొరియన్ మహిళలు జుట్టు, చర్మ సంరక్షణలో బియ్యాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. బియ్యాన్ని నానబెట్టి ఆ నీటిని వాడుతారు. అందుకే వారు అంతలా మెరిసిపోతారు.

వేసవి చర్మ సంరక్షణలో బియ్యం పిండిని చేర్చడం ద్వారా మీరు అనేక చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. బియ్యప్పిండిని ముఖానికి రాసుకోవడం వల్ల కలిగే లాభాలు, పద్ధతులు తెలుసుకుందాం.

బియ్యం, మిల్క్ క్రీమ్

1 టీస్పూన్ బియ్యం పిండితో మిల్క్ క్రీమ్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయండి. ఇప్పుడు దీన్ని డార్క్ సర్కిల్స్‌పై అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా నిరంతరం చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య తొలగిపోతుంది.

బియ్యపు పిండి, రోజ్ వాటర్

బియ్యం పిండిలో నూనెను పీల్చుకునే గుణాలు ఉన్నాయి. ముఖంపై ఆయిల్ పేరుకుపోవడం వల్ల ఆయిల్ స్కిన్ సమస్య వస్తుంది. అందువల్ల జిడ్డు చర్మం ఉన్నవారు బియ్యం పిండిని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం ఒక చెంచా బియ్యప్పిండిని రోజ్ వాటర్‌లో కలిపి అప్లై చేయాలి. ఆరిన తర్వాత ముఖం కడుక్కోవాలి.

పెరుగు, బియ్యం పిండి

బియ్యంలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మం ఛాయను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీని కోసం ఒక చెంచా పెరుగును బియ్యం పిండిలో కలిపి ముఖానికి పట్టించాలి. 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని కడగాలి.

నెయ్యితో కలిపి ఫేస్ ప్యాక్

మీ చర్మం చాలా పొడిగా ఉంటే బియ్యం పిండిలో రోజ్ వాటర్, నెయ్యి కలపండి. దీంతో ముఖం మృదువుగా, హైడ్రేటెడ్ గా కనిపిస్తుంది. స్నానానికి ముందు, ఈ రైస్ ఫేస్ ప్యాక్‌ని ముఖం, మిగిలిన శరీరానికి అప్లై చేయండి. డెడ్ స్కిన్ కూడా తొలగిపోతుంది.

బియ్యపు పిండిలో పసుపు కలిపి రాసుకుని.. కాసేపు అలాగే ఉండండి. తర్వాత చల్లని నీటితో కడుక్కోండి. దీని ద్వారా మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. మీ చర్మం మెరిసిపోతుంది.

చర్మ సంరక్షణలో చాలా మంది క్రీములను వాడుతారు. ఇది ఆ సమయంలో బాగానే ఉన్నా.. భవిష్యత్తులో మాత్రం చాలా సమస్యలను తీసుకొస్తాయి. మెుటిమలకు కారణం అవుతాయి. కొందరికి క్రీములు వాడిన తర్వాత కొన్ని రోజులకు ముఖం మీద నల్లటి మచ్చలు కూడా ఏర్పడతాయి. అందుకే చర్మంపై ఎలాంటి ప్రయోగాలు చేసినా.. మెుదట చర్మ సంరక్షణ నిపుణుడిని సంప్రదించడం మరిచిపోవద్దు.

WhatsApp channel